మూడో శ్వేతపత్రం : సకల జన సంక్షేమం ..! పెద్ద కొడుకులా కాపాడుకుంటానన్న చంద్రబాబు ..!

ఐదుకోట్ల మంది ప్రజల కోసం కష్టపడుతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సంక్షేమ రంగంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిపై మూడో శ్వేతపత్రం విడుదల చేశారు. ప్రభుత్వానికి, సమాజానికి అతి ముఖ్యమైనది సంక్షేమంమని.. సామాజిక కారణాలు, చారిత్రక, భౌగోళిక కారణాలతో… చాలామంది పేదరికం, ఆర్థిక అసమానతలతో ఇబ్బంది పడుతున్నారని.. వారందరికీ పేదరిక నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యంగా తాను పని చేస్తున్నానన్నా రు. సంపద సృష్టించకుండా పేదరికం పోదని సంపద సృష్టించగలిగితే పేదరికం తొలగిపోతుందని. అదే పని చేస్తున్నామని.. చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతిబంధకాలు ఉన్నా రుణమాఫీ విషయంలో వెనకడుగు వేయలేదని… రూ.24 వేల కోట్లు రుణ విముక్తిచేశామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆరోగ్య సంరక్షణలో
లైఫ్ సైకిల్ విధానాన్ని ప్రవేశపెట్టామని.. కడుపులో బిడ్డ పిండంగా ఉన్న దశ నుంచి అంతిమ గడియల వరకు… ప్రభుత్వం ప్రతి దశలోనూ సంక్షేమానికి సహకరిస్తోందని.. చంద్రబాబు… ఈ మేరకు ప్రవేశ పెట్టిన పథకాల వివరాలను వెల్లడించారు.

పీడీఎస్ అమలు చేస్తున్న రాష్ట్రం ఏపీ ఒక్కటేనని పండగలొస్తే అన్ని వర్గాల వారికి కానుకలు ఇస్తున్నామన్నారు. పౌష్టికాహారం విషయంలో రాజీపడటం లేదని … దేశంలో ఎక్కడా లేని విధంగా చంద్రన్నబీమా అమలు చేస్తున్నామన్న సంగతిని గుర్తు ేచశారు. ఎన్టీఆర్ వైద్యసేవలు పెద్దఎత్తున అందిస్తున్నాని.. ఆరోగ్య వ్యయం గణనీయంగా తగ్గించగలిగామని గుర్తు చేశారు. ఏ ఊరిలోనైనా పనిచేసుకునే విధంగా… ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. నెలకు కనీసం రూ.10 వేలు సంపాదించేలా…పేదరిక నిర్మూలనకు కృషిచేస్తున్నామని చంద్రబాబు గుర్తు చేశారు. వెనుకబడిన వర్గాలకోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటుచేశాం
అట్టడుగు వర్గాల వారికి భరోసా ఇస్తున్నామన్నారు. పేదరికంపై గెలుపు కార్యక్రమంతో… ఆర్థిక అసమానతలను తొలగిస్తున్నామన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో 66 శాతం సంతృప్తి వచ్చిందని … దేశంలో ఎక్కడా లేని విధంగా అన్న క్యాంటీన్లను ప్రవేశపెట్టామన్నారు. మెక్‌డొనాల్డ్స్‌‌, కేఎఫ్‌సీ కన్నా…అన్న క్యాంటీన్లలోనే శుభ్రత, నాణ్యత ఎక్కువ ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇంత తక్కువ ధరకు రుచికరమైన భోజనం అందిస్తున్న…క్యాంటీన్లు ఎక్కడున్నాయో చెప్పాలని చంద్రబాబు సవాల్ చేశారు. ఏపీకి పెద్ద పెద్దకొడుకులా కాపాడుకుంటనని చంద్రబాబు ప్రకటించారు.

ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో కొంత రాజధానికి ఖర్చు చేస్తే… సంక్షేమ కార్యక్రమాలు చేయలేమని అందుకే… రాజధాని కోసం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టడం లేదన్నారు. కొత్త పద్ధతుల్లో రాజధాని కోసం నిధులు సమీకరిస్తున్నామని.. ఇలాంటి విధానాల్లోనే ఏపీ గెలుపు ఉందన్నారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు…రూ.15 లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తున్నామని రియల్‌టైమ్‌లో సంక్షేమ కార్యక్రమాల్ని, పథకాల్ని పర్యవేక్షిస్తున్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. 2014 ముందు ఎలాంటి సంక్షేమ పథకాలు ఉండేవి…లోటు బడ్జెట్‌ ఉన్నా ఇప్పుడు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు… అమలు చేస్తున్నామనేది బేరీజు వేసుకోవాలని చంద్రబాబు ప్రజలను కోరారు. కొందరు ఇస్తున్న బూటకపు హామీలకన్నా… రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు ఎంతో మెరుగైనవని చంద్రబాబు విశ్లేషించారు. జగన్‌కు పంచాయతీ బోర్డు మెంబర్‌కున్న అనుభవంలేదని ఎద్దేవా చేశారు. జగన్‌కు ఎకనామిక్స్‌ తెలియదు, సోషియాలజీ తెలియదు .. అన్నీ ఇచ్చేస్తామని జగన్‌ కబుర్లు చెబుతున్నారన్నారని.. ఇలాంటి అనుభవశూన్యులతో భవిష్యత్‌కు ప్రమాదమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close