హేరామ్ : “చెత్త” శుద్ధి ఏది ?

గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడ్ని అందరూ స్మరించుకుంటున్నారు. సామాన్యుల సంగతేమో కానీ ప్రభుత్వాలు మాత్రం ప్రచార ఆర్భాటలతో స్మరించుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం స్వచ్చభారత్ 2 ప్రారంభించింది. ఏపీ ప్రభుత్వం స్వచ్చ సంకల్పం ప్రారంభిస్తోంది. చెత్త వాహనాలు ప్రారంభించడమే సంకల్పం. కేంద్రం ఎప్పుడో అధికారంలోకి వచ్చిన మొదట్లోనే అంటే 2014లో మహాత్ముడి కళ్ల జోడుని బ్రాండ్‌గా వాడేసి స్వచ్చభారత్ ప్రారంభించింది. ఆ పేరుతో సెస్‌లు వసూలు చేసింది. కానీ నేటికి ఏం సాధించాలో మాత్రం స్పష్టత లేదు. అప్పటికి ఇప్పటికి వచ్చిన మార్పేమీ లేదు. ఇంకా చెప్పాలంటే శుభ్రత పరిస్థితులు దిగజారిపోయాయి.

అయితే స్వచ్చతతో సంబంధం లేకుండా ప్రజలు ఇచ్చే ఓటింగ్ ..మరికొన్ని పారామీటర్స్ ఆధారంగా నగరాలకు ర్యాంకులు ఇవ్వడం మాత్రం చేస్తున్నారు. ఇప్పుడు రెండో విడతలో ఊరు చివరి చెత్తకొండల్ని కరిగించాలన్న లక్ష్యంగా పెట్టుకున్నారు. నిజానికి సమస్య ఏమిటో గుర్తించకుండా సమరానికి వెళ్తే ఇలాంటి ఫలితాలే వస్తాయి. కానీ అలాంటి ప్రయత్నం కేంద్రం చేయలేదు. రాష్ట్రంలోనూ అంతే. ఏపీలో మున్సిపల్ పాలన ఎంత దారుణంగా ఉందో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. స్వచ్చ సంకల్పం పేరుతో పెద్ద ఎత్తున వాహనాలు కొంటే సరిపోదు… గత స్వచ్చభారత్‌లో ఏంచేశారో అంతకు మించి చేయాల్సి ఉంటుంది.

మహాత్ముడికి దేశం నివాళిగా ఏమిచ్చిందో ఇప్పటికీ స్పష్టత లేదు. ఆయన పేరుతో ఆయనకు ఎంతో ఇష్టమైన స్వచ్చ భారత్‌ను నివాళిగా అర్పించాలంటే చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. ప్రచార ఆర్భాటాలను పక్కన పెట్టాలి. నిజాయితీగా శ్రమించాలి. అప్పుడే ఆయన ఆశయం సాకారం అవుతుంది. కానీ మన నేతలు పావలా పనికి ముప్పావలా ప్రచారం చేసుకోవడం ఎప్పుడూ ఆపరు. కాబట్టి ఆ ఆశ నెరవేరదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close