ఆ హ‌ద్దు చంద్ర‌బాబు కూడా దాట‌కూడ‌దు..!

ఆత్మ విశ్వాసం, అతి విశ్వాసం.. ఈ రెండిటికీ ఉన్న‌ది చిన్న తేడానే! మ‌నం చేయ‌గ‌లం అనుకోవ‌డం ఆత్మ విశ్వాసం. మ‌న‌మే చేయ‌గ‌లం అనుకోవ‌డంలో కాస్త ‘అతి’ ధ్వ‌నిస్తుంది. ఏం రంగంలో ఉన్న‌వారైనా ఈ చిన్న తేడాను గుర్తుంచుకోవాల్సిందే. నంద్యాల ఉప ఎన్నిక విజ‌యం త‌రువాత తెలుగుదేశం పార్టీలో మాంచి జోష్ వ‌చ్చింది. ఎందుకంటే, అంత‌కుముందు పార్టీ క‌ట్టుత‌ప్పుతోందేమో అనే అనుమానాలు కొన్ని ఉండేవి. కొంత‌మంది నేత‌లు చంద్ర‌బాబుతో ప్ర‌మేయంలో సొంతంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే క‌థ‌నాలు కూడా వ‌చ్చాయి. అలాంటి ఘ‌ట‌న‌ల్ని మ‌నం చూశాం కూడా. అయితే, నంద్యాల ఉప ఎన్నిక విజ‌యంతో పార్టీ అంతా ఒకేతాటిపై ఉంద‌నీ, చంద్ర‌బాబు వ్యూహాలు ప‌క్క‌గా అమ‌లౌతున్నాయ‌నే భ‌రోసా పార్టీ శ్రేణుల్లో పుష్క‌లంగా క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో అమ‌రావ‌తిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. నంద్యాల విజ‌యాన్ని 2019 ఎన్నిక‌ల్లో కూడా కొన‌సాగిస్తామ‌నే ధీమా వ్య‌క్తం చేశారు.

‘వ‌చ్చే ఎన్నిక‌లో మాత్ర‌మే కాదు.. శాశ్వ‌తంగా ఈ ప్ర‌భుత్వం కొన‌సాగుతుంది. తెలుగుదేశం పార్టీ ఎప్ప‌టికీ బ‌లంగా ఉంటేనే సామాన్య ప్ర‌జ‌లంద‌రికీ లాభం జ‌రుగుతుంది’ అన్నారు సీఎం. ‘అంతేత‌ప్ప‌, దీనికి బ‌దులుగా అటూఇటూ చూసే ప్ర‌య‌త్నాలు ఏవైనా జ‌రిగితే అంతిమంగా ప్ర‌జ‌లు న‌ష్ట‌పోతారు. లేనిపోని స‌మ‌స్య‌లు కొని తెచ్చుకున్న‌ట్టు అవుతుంద‌’ని చంద్రబాబు చెప్పారు. అభివృద్ధిని కోరుకునేవారంద‌రూ తెలుగుదేశాన్ని బ‌ల‌ప‌రచాల‌ని తాను ఎప్పుడో చెప్పాన‌న్నారు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ప్ర‌జ‌లు నైరాశ్యంలోకి వెళ్లార‌నీ, ఆ స‌మ‌యంలో నేనొక విశ్వాసం ఇచ్చాన‌నీ, అంద‌రం క‌లిసి ముందుకుపోవాలే త‌ప్ప‌, ఇళ్ల‌లో కూర్చుని బాధ‌ప‌డితే అభివృద్ధి సాధించ‌లేమ‌ని చెప్పాన‌న్నారు. అనేక స‌మ‌స్య‌ల ఎదురౌతున్నా గ‌డ‌చిన మూడున్న‌రేళ్ల‌లో అనూహ్య‌మైన అభివృద్ధిని సాధించామ‌ని చెప్పారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు ఎన్నో కుట్ర‌లు జ‌రిగాయి, వాట‌న్నింటినీ త‌ట్టుకుంటూ ప‌ట్టిసీమ వంటి ప్రాజెక్టుల‌ను పూర్తి చేశామ‌న్నారు. దీంతోపాటు ఇత‌ర అభివృద్ధి కార్య‌క్ర‌మాలు, అవి జ‌రుగుతున్న తీరుతెన్నుల గురించి కూడా చంద్ర‌బాబు వివ‌రించారు.

2019లో కూడా టీడీపీ అధికారంలోకి రావ‌డం ఖాయం అనే ధీమా వ్య‌క్తం చేయ‌డం వ‌ర‌కూ ఓకే! శాశ్వ‌తంగా టీడీపీ అధికారంలో ఉండాల‌ని ఆకాంక్షించ‌డం కూడా కొంత‌వ‌ర‌కూ ఓకే. కానీ, టీడీపీ అధికారంలో లేక‌పోతే ప్ర‌జ‌లు న‌ష్ట‌పోతార‌ని చెప్ప‌డం స‌రైంది కాదు! ఎందుకంటే, తెలుగుదేశం అభివృద్ధి చేస్తుంద‌నే న‌మ్మ‌కం ప్ర‌జ‌ల్లో ఉన్నంత కాలం అధికారంలో ఉంటుంది. ఆ న‌మ్మ‌కం ప్ర‌జ‌ల‌కు ఉంటేనే మరోసారి అవ‌కాశం ఇస్తారు. చేసిన అభివృద్ధిని చూసి ప్ర‌జ‌లు ఆద‌రిస్తారు, అవ‌కాశం ఇస్తారు అన‌డం వేరు… మాకు ఓటేస్తే త‌ప్ప అభివృద్ధి జ‌ర‌గ‌దనే సంకేతాలు ప్ర‌జ‌ల‌కు ఇవ్వ‌డం వేరు! ‘మాకు అధికారం ఇవ్వండి’ అనేది అభ్య‌ర్థ‌నాపూర్వ‌కంగా ఉండాలి. అంతేగానీ, ఇవ్వ‌క‌పోతే మీరు న‌ష్ట‌పోతారు అనేది వేరే ర‌కంగా ధ్వ‌నించే అవ‌కాశం ఉంది. ఈ మ‌ధ్య చంద్ర‌బాబు మాట‌ల్లో ఈ త‌ర‌హా ధోర‌ణి నెమ్మ‌దిగా మొద‌లైంద‌ని చెప్పాలి! ఈ చిన్న తేడాను టీడీపీ శ్రేణులు గుర్తిస్తున్నాయో లేదో మ‌రి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close