ఏపీలో ఉన్నది రద్దుల సర్కారంటున్న చంద్రబాబు ..!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ పై.. ప్రతిపక్ష నేత చంద్రబాబు… ఇక పూర్తి స్థాయిలో..రాజకీయ పోరాటానికి సిద్ధమైన సూచనలు కనిపిస్తున్నాయి. రెండు నెలల్లోనే… ప్రజల్లో అసంతృప్తి ఏర్పడిందని గుర్తించిన ఆయన… తన పాలనలో సంక్షేమ ఫలాలు ఎలా అందేవో.. ఇప్పుడు.. ఎలా ఉన్నాయో గుర్తు చేసేందుకు ప్రతీ చోటా ప్రాధాన్యం ఇస్తున్నారు. వైసీపీ హామీలు నెరవేరకపోవడాన్ని కూడా ప్రాధాన్యతాంశంగా గుర్తు చేస్తున్నారు. సామాజిక పెన్షన్లు ఆలస్యం అవుతూండటాన్ని చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఆదివాసీ దినోత్సవరం సందర్భంగా అమరావతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైసీపీ సర్కార్ రెండు నెలల వైఫల్యాలను బయటపెట్టారు. పెన్షన్లపై వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని.. తాను రూ.200 పెన్షన్‌ రూ.2 వేలు చేశానని కానీ… వైసీపీ సర్కార్ మాత్రం ఏడిదికి రూ.250 పెంచుతూ విడతల వారీగా ఇస్తారట అని మండిపడ్డారు. మేం 1వ తేదీకే పెన్షన్లు ఇచ్చేవాళ్లం.. ఇప్పుడు ఎప్పుడు వస్తుందో తెలియడం లేదన్నారు. వైసీపీ వస్తే ఏం జరుగుతుందో ఎన్నికల ముందే చెప్పా.. తాను చెప్పినట్టే జరుగుతోందని గుర్తు చేస్తున్నారు.

ప్రభుత్వం రద్దుల సర్కార్ గా మారిందని సెటైర్లు వేస్తున్నారు. పసుపు రంగు ఉందని అన్న క్యాంటీన్లను తొలగించారు.. గిరిజన యువతుల కోసం పెళ్లి కానుక తీసుకొస్తే తొలగించారు… ఉద్యోగాలన్నీ తొలగించి వైసీపీ కార్యకర్తలకు ఇచ్చుకుంటున్నారని గుర్తు చేశారు. పన్నులు కట్టేది ప్రజలు.. అనుభవించేది వైసీపీ నేతలని మండిపడ్డారు. పోలవరం కాంట్రాక్ట్‌ రద్దుచేశారని … వైఎస్‌ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులను పూర్తిచేశామన్నారు. తన జ్ఞాపకాలు ఉండొద్దని అన్ని రద్దు చేస్తున్నారని టీడీపీ హయాంలో వచ్చిన సీసీ రోడ్లు, మరుగుదొడ్లు కూడా తొలగిస్తారా? అని ప్రశ్నించారు. కియాలో తమకే ఉద్యోగాలు ఇవ్వాలని వైసీపీ రౌడీలు బెదిరిస్తున్నారని .. రాష్ట్రంలో అన్ని చోట్లా పులివెందుల పంచాయితీ పెడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఇసుక కొరత లేదని … ఇప్పుడు ఇసుక ఎందుకు దొరకటం లేదు.. ఎందుకు ధర పెరిగిందని చంద్రబాబు ప్రశ్నించారు. ఇసుక పేరుతో వైసీపీ నేతలు దోచుకుంటున్నారన్నారు.

అంతకు ముందు టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ జరిగింది. వైసీపీ ప్రభుత్వంపై రాజకీయపోరాటం ప్రారంభించాలనన్న నిర్ణయానికి పొలిట్ బ్యూరో వచ్చింది. ఓటమి తర్వాత తొలి సారి సమావేశం కావడంతో… ఫలితాలపై నేతలందరూ చర్చించారు. సామాజిక సమీకరణలో విఫలమయ్యామని కొందరు నేతలు అంగీకరించారు. టీడీపీకి తొలి నుంచి అండగా ఉన్న బీసీలు, మాదిగలు ఈ సారి దూరమయ్యారు టీడీపీ నేతలు అభిప్రాయానికి వచ్చారు. వరద బాధితులకు రూ.10వేలు పరిహారం, రుణమాఫీ 4వ, 5వ విడతలు తక్షణమే చెల్లించాలని టీడీపీ పొలిట్ బ్యూరో డిమాండ్ చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close