ఇది ఓటమి భయంతో చేస్తున్న ప్రయత్నం కాదన్న చంద్రబాబు

ఈవీఎంల పనితీరుపై చాలా అనుమానాలున్నాయన్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విపక్షాలతో ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఏపీలో ఎన్నికలు నిర్వహించిన తీరును వివరించారు. కాంగ్రెస్ నేత అభిషేక్ మనుసింఘ్వీతోపాటు, కపిల్ సిబల్, అరవింద్ కేజ్రీవాల్, సురవరం సుధాకర్ రెడ్డితోపాటు ఇతర పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు హాజరయ్యారు. చంద్రబాబు మాట్లాడుతూ… తానేదో ఓడిపోతాన్న భయంతోనే ఢిల్లీకి వచ్చాననీ, ఇవన్నీ చేస్తున్నానని కొందరు విమర్శిస్తున్నారన్నారు. ‘రెండొందల శాతం ధీమాతో చెప్తున్నా.. మేం గెలుస్తున్నా’మన్నారు. తెల్లారుజాము నాలుగున్నర వరకూ ప్రజలు ఓట్లు వేశారంటే… అది కేంద్రంపై, ఎన్నికల నిర్వహిస్తున్న తీరుపై వారు వ్యక్తం చేసిన ఆగ్రహమే అన్నారు.

ఎన్నికల్ని ఎదుర్కొనలేకే తాను ఈ పనిలోపడ్డానంటూ కొంతమంది విమర్శలు చేస్తున్నారనీ, ఆంధ్రాలో ఎన్నికలు అయిపోయాయని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు తాను పని చేస్తున్నది దేశం కోసం అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడం, తద్వారా దేశాన్ని కాపాడుకోవడం కోసం ఇప్పుడీ పని చేస్తున్నా అన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్న లక్ష్యంతో పార్టీలన్నీ గత కొన్నాళ్లుగా ఈ పోరాటం చేస్తున్నాయన్నారు. జర్మనీ, నెథర్లాండ్స్, ఐర్లాండ్ ఇలాంటి చాలా దేశాలు ఈవీఎంల నుంచి మళ్లీ బేలెట్ పద్ధతికి వెళ్లాయన్నారు. తెలంగాణలో 25 లక్షలు ఓట్లు తీసేస్తే, తాము కోర్టుకు వెళ్లినా సరైన స్పందన లేదనీ, చివరికి, ఈసీ సారీ చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారన్నారు. 23 పార్టీలన్నీ చేస్తున్న డిమాండ్ ఒక్కటేననీ… కనీసం ఇప్పుడైనా 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని కోరుతున్నామన్నారు. కానీ, స్లిప్పుల లెక్కించడానికి ఆరురోజులు పడుతుందని కోర్టును కూడా తప్పుతోవ పట్టిస్తున్నారన్నారన్నారు.

అనంతరం, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సీనియర్ నేత కపిల్ సిబల్, సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడారు. అందరి డిమాండ్… ఈవీఎంలపై నమ్మకం లేదనీ, కనీసం 50 శాతం వీవీప్యాట్లను లెక్కించాలని. భాజపాకి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి సమస్యలు ఎందుకు రావడం లేదని. ఈవీఎంలపై దేశంలో 23 పార్టీలకు పూర్తిస్థాయి నమ్మకం లేదంటూ ఒక వేదిక మీదికి వచ్చినప్పుడు… దాన్ని తగ్గ సమాధానం, పరిష్కార మార్గం అన్వేషించాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యని కేంద్రం ఈజీగా తీసుకోవచ్చు. కానీ, ఆ తీరు ప్రజలు ఈజీగా తీసుకోరు కదా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అధికారం నెత్తికెక్కితే పాతాళంలోకే !

అధికారం ప్రజలు ఇచ్చేది. అలాంటి ప్రజల కన్నా తానే ఎక్కువ అనుకుంటే.. పాతాళంలోకి పంపేస్తారు ప్రజలు. చరిత్రలో జరిగింది ఇదే. ఇప్పుడు జరుగుతోంది ఇదే. భవిష్యత్ లో జరగబోయేది కూడా ఇదే. ఎందుకంటే...

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోన్న పోలింగ్ … ఓటేసిన ప్రముఖులు

ఎంపీ ఎనికల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకొని క్యూ లైన్ లో నిల్చొని ఓటు వేశారు. ప్రజలంతా తమ...

ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు ఎవరివీ..? ఎందుకీ అస్పష్టత..?

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయనే విషయంలో ఎవరూ స్పష్టతకు రాలేకపోతున్నారు.ఎంపీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మొదట్లో పరిస్థితులు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నప్పటికీ అభ్యర్థుల ఎంపికలో...

ఎంపీ ఎన్నికలు…హైదరాబాద్ లో కర్ఫ్యూ..!!

హైదరాబాద్ లో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. నిత్యం రద్దీగా కనిపించే మహానగరం వెలవెలబోతోంది. ప్రజలు ఓట్లు వేసేందుకు సొంతూళ్ళకు వెళ్ళడంతో నగరమంతా బోసిపోయింది. ఇది హైదరాబాదేనా అనుమానం వచ్చేలా హైదరాబాద్ నిర్మానుష్యంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close