తెలంగాణ ఇంట‌ర్ వ్య‌వ‌హారం‌పై చంద్ర‌బాబు ఏమ‌న్నారు?

తెలంగాణ ఇంట‌ర్ బోర్డు నిర్వాకంపై ఇంకా ఆందోళ‌న‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. రీ వెరిఫికేష‌న్ కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశించినా… నిర‌స‌న‌లు కొన‌సాగుతున్నాయి. ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ద్ద జ‌న‌సేన కార్య‌ర్త‌ల‌కు నిర‌స‌న‌కు దిగారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ ముట్ట‌డికి ప్ర‌య‌త్నించారు. ఆత్మ‌హ‌త్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాల‌కి న్యాయం జ‌ర‌గాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇంకోప‌క్క‌, ఇంట‌ర్ బోర్డు కార్యాలయం ద‌గ్గ‌ర ఐద్వా కార్య‌క‌ర్త‌లు కూడా నిర‌స‌న చేస్తున్నారు. రాజ‌కీయ పార్టీలు కూడా ఇంట‌ర్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో ప్ర‌భుత్వ అల‌స‌త్వాన్ని త‌ప్పుబ‌డుతున్నాయి. రెండోసారి ముఖ్య‌మంత్రి అయిన కేసీఆర్ పాల‌న‌ను గాలికి వ‌దిలేశార‌న‌డానికి ఇదే సాక్ష్య‌మంటున్నాయి. ఈ నేప‌థ్యంలో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కూడా ఈ వ్య‌వ‌హారంపై స్పందించారు.

పార్టీ నేత‌ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించిన చంద్ర‌బాబు మాట్లాడుతూ… తెలంగాణ‌లో ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను కూడా అక్క‌డి ప్ర‌భుత్వం స‌రిగా నిర్వ‌హించ‌లేక‌పోయింద‌ని వ్యాఖ్యానించారు. విద్యార్థుల జీవితాల‌తో ఆడుకునే విధంగా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌న్నారు. ఇంట‌ర్ ఫ‌లితాల నేప‌థ్యంలో అక్క‌డి ముఖ్య‌మంత్రి స‌మీక్ష నిర్వ‌హిస్తే… ఎవ్వ‌రూ నోరు మెద‌ప‌డం లేద‌నీ, కానీ తాను ఏపీలో రోజువారీ పాల‌న‌లో భాగంగా స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తే పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేసే ప‌రిస్థితి ఉంద‌న్నారు. తాను స‌మీక్ష‌లు చేస్తుంటే నానా యాగీ చేసేందుకు ఎందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌న్నారు. ఎన్నిక‌ల సంఘం ఇష్టానున‌సారంగా వ్య‌వ‌హ‌రిస్తే ప‌రిపాల‌న అస్త‌వ్య‌స్థంగా మారుతుంద‌ని చంద్ర‌బాబు అన్నారు.

అధికార దాహంతో ఏపీలో ఎన్ని అరాచ‌కాలు చెయ్యాలో అన్నీ వైకాపా చేసింద‌నీ, వాట‌న్నింటినీ స‌మ‌ర్థంగా తిప్పికొట్టామ‌న్నారు సీఎం. ఎవ‌రు ఎన్ని ర‌కాలుగా ప్ర‌చారం చేసుకున్నా, విమ‌ర్శ‌లు చేస్తున్నా టీడీపీ మ‌రోసారి అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని మ‌రోసారి చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. ఈవీఎంల ప‌నితీరుపై చేస్తున్న పోరాటం ఇప్ప‌టికాద‌నీ, దేశ‌వ్యాప్తంగా ఎన్నో రాజ‌కీయా పార్టీలు కూడా ఈ పోరాటంలో భాగ‌స్వాములుగా ఉన్నార‌ని చెప్పారు. గ‌డ‌చిన ఐదేళ్లుగా అధికారులు త‌న‌కు ఎంత‌గానో స‌హ‌క‌రించానీ, కానీ ఇప్పుడు అధికారుల మ‌ధ్య చిచ్చుపెట్టేందుకు ఈసీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని విమ‌ర్శించారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌ల కాగానే వెంట‌నే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ఉంటాయ‌నీ, వాటి కోసం టీడీపీ శ్రేణుల‌న్నీ సిద్ధంగా ఉండాల‌ని ఈ సంద‌ర్భంగా పార్టీ కేడ‌ర్ కు చంద్ర‌బాబు చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close