ప్రకృతి సేద్యంతో ఆరోగ్యకర ఆహారం..! ఐరాస సదస్సులో చంద్రబాబు ..!!

“భారతీయలు అందరి తరుపున, తెలుగు వారి అందరి తరుపున నన్ను ఇక్కడకు ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. ప్రకృతి వ్యవసాయంలో, ఆంధ్రప్రదేశ్, ఈ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది..”… తెలుగువారి సత్తాను.. చంద్రబాబు తెలుగులో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో వివరించారు. న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో ప్రపంచ ఆర్థిక వేదిక-బ్లూంబెర్గ్‌ నిర్వహించిన “సుస్థిర అభివృద్ధి-ప్రభావం” సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలకోపన్యాసం చేశారు. ఇది తనకో అద్భుతమైన అవకాశమని మాతృభాషలో రెండు నిమిషాలు మాట్లాడుతానని .. ప్రత్యేకంగా చెప్పి మరీ.. చంద్రబాబు… ప్రారంభంలో తెలుగులో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి సేద్యం విజయవంతమైన తీరును.. భవిష్యత్‌లో రైతులకు మరింత మేలు ఎలా చేయబోతున్నామన్న అంశాన్నీ వివరారు.

రైతులకు ఖర్చును తగ్గించి చీడపీడల లేని కాలుష్య రహిత సాగును ప్రోత్సహించే దిశగా తాము తీసుకున్న చర్యలను చంద్రబాబు.. వివరించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి ఇప్పటికే లక్షల ఎకరాల్లో సాగయ్యేలా చేశామన్నారు. 2029 నాటికి 20 లక్షల ఎకరాలకు ఈ విస్తీర్ణాన్ని పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరించారు. . పైసా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి అమెరికన్‌ సాంకేతికత, మేథో పరిజ్ఞానాన్ని జోడించేందుకు పరస్పర సహాయ సహకారాలపై ఆయన చర్చించారు. ఇప్పటికే దేశంలో ప్రకృతి సేద్యంలో నవ్యాంధ్ర అగ్రగామిగా ఎదిగి సాధిస్తున్న విజయాలను వివరించారు. ఈ సమావేశంలో కీలక ప్రసంగాలు చేసిన తొమ్మిది మందిలో చంద్రబాబు ఒకరు.

పరిచయం చేసే సమయంలో.. ఐక్యరాజ్య సమితి అధికారులు, ప్రపంచ ఆర్థిక వేదిక ప్రతినిధులు… చంద్రబాబును గొప్పగా ప్రశంసించారు. పెట్టుబడి లేని సాగుపై… ఓ భారతీయ రాష్ట్రం ఇంతగా ఆసక్తి చూపడం తనను ఎంతో సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వహకుడు ప్రశంసించారు. తాను ఎంతో మంది భారతీయులతో మాట్లాడానని.. అనేక నేతలతో కూడా మాట్లాడానని.. కానీ పర్యావరణ విషయంలో ఒక్క చంద్రబాబు మినహా మరెవరూ బాధ్యతగా వ్యవహరించలేదని.. ఐక్యరాజ్య సమితిలో నార్వే అంబాసిడర్ అన్నారు. మొత్తానికి చంద్రబాబు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగం.. ప్రపంచం మొత్తం భారతీయుల్ని ఆకర్షించింది. సాగులో విప్లవం దిశగా.. ప్రపంచానికి కొత్త స్ఫూర్తిని ఏపీ రైతుల ద్వారా అందించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

శ్రీకాళహస్తి రివ్యూ : బొజ్జల వారసుడికి రెడ్ కార్పెట్ వేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే !

శ్రీకాళహస్తి రాజకీయం అంటే అందరికీ గుర్తొచ్చే పేరు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సుదీర్ఘ కాలం సేవలు అందించిన ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ ఆత్మీయుడు. శ్రీకాళహస్తికి ఓ ఇమేజ్ తెచ్చి పెట్టారు. కానీ గత...

ధర్మారెడ్డి కోసం ఆలిండియా రూల్స్ మారిపోతాయ్ !

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరోసారి డిప్యూటేషన్ పొడిగించారు. రిటైరయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ ఆయన డిప్యూటేషన్ లోనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close