వైసీపీ జడ్పీ చైర్మన్ భర్తపై పిల్లల అక్రమ తరలింపుకేసు !

గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ కత్తెర క్రిస్టీనా భర్త కత్తెర సురేష్ పై దత్తర పేరుతో పిల్లలను విదేశాలకు అక్రమంగా తరలించడం.. విదేశాల నుంచి నిబంధలకు విరుద్ధంగా విరాళాలు సేకరించడం వంటి నేరాలపై సిబిఐ కేసు నమోదు చేసింది. హర్వెస్ట్ ఇండియా సొసైటీ అధ్యక్షుడు గా కత్తెర సురేష్ ఉన్నారు. ఈ సంస్థ ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనలకు విరుద్ధంగా విదేశీ నిధులు పొందడం పై సిబిఐ కేసు నమోదు చేసింది. విదేశీ నిధుల స్వీక‌ర‌ణల విషయంలో నిబంధనలు ఉల్లంగిస్తున్న అనేక మత మార్పిడి సంస్థలపై కేంద్రం కొరడా ఝళిపించింది. బుధవారం దేశ‌వ్యాప్తంగా 40 చోట్ల సీబీఐ సోదాలు జ‌రిపింది. విదేశీ విరాళాల స్వీక‌ర‌ణ‌లో నిబంధ‌న‌లు ఉల్లంఘించిన స్వ‌చ్ఛంద సంస్థ‌ల నుంచి ముడుపులందుకున్న ఐదుగురు ప్ర‌భుత్వ అధికారులతోపాటు 10 మందిని అరెస్ట్ చేసింది.

విదేశీ నిధుల స్వీక‌ర‌ణ‌లో విదేశీ నిధుల నియంత్ర‌ణ చ‌ట్టం ఉల్లంఘించిన వారికి క్లియ‌రెన్స్ ఇవ్వ‌డానికి కొంద‌రు అధికారులు ముడుపులు స్వీక‌రించార‌ని సీబీఐ ప్రకటించారు. కత్తెర సురేష్ నడుపుతున్న సంస్థ కూడా ఇలా నిబంధనలకు విరుద్ధంగా పండ్స్ విదేశీల నుంచి తీసుకు వచ్చింది. అదే సమయంలో ఈ సంస్థ భారతీయ అనాథలైన చిన్నపిల్లల్ని అక్రమంగా విదేశాలకు తరలించిన అభియోగాలు కూడా ఎదుర్కొంటున్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ కు బాలల హక్కుల జాతీయ కమిషన్ నోటీసులు జారీ చేసింది.

అక్రమంగా మైనర్ లను దత్తత తీసుకోవడం , అక్రమంగా విదేశాలకు తరలింపు పై జాతీయ కమిషన్ లో కేసు నమోద అయింది. కత్తెర సురేష్ దంపతులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ కు కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయితే కత్తెర సురేష్, క్రిస్టినా దంపతులు ఏపీ అధికార పార్టీ పెద్దలకు అత్యంత సన్నిహితులు. గతంలో మత మార్పిళ్లపై చర్యలు తీసుకోవాలని.. సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ కూడా మత మార్పిళ్ల సంస్థను నడుపుతున్నారని చర్యలు తీసుకోవాలని ఆదేశించినా ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. .

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close