ఛాన‌ళ్ల బండారం బ‌య‌ట‌పెట్టిన చిరంజీవి

ప్ర‌జారాజ్యం పార్టీ ఫెయిల్యూర్ కి చాలా కార‌ణాలున్నాయి. అప్ప‌ట్లో కొన్ని ఛాన‌ళ్లు.. చిరుకి వ్య‌తిరేకంగా ప‌నిచేశాయి. చిరంజీవి చేసిన చిన్న చిన్న విష‌యాల్ని సైతం భూత‌ద్దంలో పెట్టి చూపించాయి. ఓసారి.. అభిమానుల‌కు క‌ర‌చాల‌నం ఇచ్చిన వెంట‌నే, చిరు చేతికి శానిటైజ‌ర్ రాసుకోవ‌డం తో ఛాన‌ళ్లు… ఆ దృశ్యంపై బాగా ఫోక‌స్ చేశాయి. ‘అభిమానులు అంట‌రానివాళ్లా?’ ఇలాంటి వాళ్లు ప్ర‌జ‌ల‌కు సేవ ఏం చేస్తారు` అన్న‌ట్టు క‌థ‌నాలు ప్ర‌సారం చేశాయి. దాంతో చిరు ఫ్యాన్స్ కూడా త‌మ హీరోపై అనుమానం గా చూశారు.

ఈ క‌థ‌నం వెనుక అస‌లు నిజాన్ని ఇటీవ‌ల చిరు బ‌య‌ట పెట్టాడు. ఆరోజు తాను శానిటైజ‌ర్ వాడిన మాట వాస్త‌వ‌మే అని, అయితే… ప్ర‌జా సంక‌ల్ప యాత్ర లో భాగంగా, బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న‌ప్పుడు, త‌న‌కెవ‌రో ఖ‌ర్జూరం అందించార‌ని, అది తినే ముందు… చేతుల్ని శానిటైజ‌ర్‌తో శుభ్రం చేశాన‌ని, అయితే… అదొక్క‌టీ ఎడిట్ చేసి, అభిమానికి షేక్ హ్యాండ్ ఇవ్వ‌డం, శానిటైజ‌ర్ వాడ‌డం, ఇవి మాత్ర‌మే ఫోక‌స్ చేశార‌ని, అభిమానులు అంట‌రాన్ని వాళ్లా? అంటూ పెద్ద పెద్ద హెడ్డింగులు పెట్టార‌ని, ఇది చ‌క్క‌టి ఎడిటింగ్ నైపుణ్యానికి నిద‌ర్శ‌న‌మ‌ని.. సెటైర్ వేశాడు. ఇదంతా.. సీరియ‌స్ గా, మీడియాపై కోపంతో చెప్ప‌లేదు. స‌ర‌దాగా.. గుర్తు చేసుకున్నారంతా. ఆ ఫుటేజీల‌న్నీ మీడియా హౌసుల్లో ఇంకా భ‌ద్రంగానే ఉన్నాయ‌ని, వాటిని బ‌య‌ట‌కు తీస్తే.. నిజానిజాలేమిట‌న్న‌ది ప్ర‌జ‌లే తీర్పు చెబుతార‌ని.. చిరు వ్యాఖ్యానించారు. మొత్తానికి ప్ర‌జారాజ్యం స‌మ‌యంలో త‌న‌పై ప‌డిన నింద‌ని చిరు ఈ రూపంలో చెరిపేసుకునే ప్ర‌య‌త్నం చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close