ఆడియో లీక్: చిరంజీవి, మీడియా హెడ్ మధ్య సంచలన సంభాషణ

మెగాస్టార్ చిరంజీవి, ఆంధ్రప్రభ మీడియా హెడ్ ముత్తా గోపాలకృష్ణ మధ్య ఇవాళ జరిగిన సంభాషణ కి సంబంధించిన ఒక ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ ఆడియో క్లిప్ లో, తన పట్ల మీడియా వ్యవహరిస్తున్న తీరుపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వివరాల్లోకి వెళితే..

30 కోట్లకు పైగా సొంత వ్యయం తో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్:

ఇటీవల చిరంజీవి తన సొంత డబ్బులతో స్థాపించిన ఆక్సిజన్ బ్యాంక్ అనేక మంది కోవిడ్ బాధితులకు ఆసరాగా నిలుస్తోంది. తెలుగు రాష్ట్రాల లోని ప్రతి జిల్లా కేంద్రంలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులను స్థాపించారు. చిరంజీవి ఈ ప్రతిపాదనను ప్రకటించిన వారం రోజులకే ఆక్సిజన్ బ్యాంకులు అనేక చోట్ల పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. మెరుపువేగంతో చిరంజీవి పూర్తి చేసిన ఈ కార్యక్రమం ఎంతమందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. కేవలం సిలిండర్ ఇచ్చి పోవడమే కాకుండా అక్కడికక్కడ ఆక్సిజన్ తయారుచేసి ఆ సిలిండర్లను నింపే ప్రక్రియను కూడా బ్యాంకులు నిర్వహిస్తున్నాయి. ఒక్కొక్క ఆక్సిజన్ బ్యాంక్ కోసం దాదాపు 50 లక్షల నుండి 60 లక్షల దాకా ఖర్చు అవుతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం గా 30 కోట్ల దాకా ఖర్చు అవుతూ ఉండగా ఈ అమౌంట్ మొత్తాన్ని చిరంజీవి వ్యక్తిగతంగా భరిస్తున్నారు. ఏ ఒక్కరి నుండి విరాళాలు ఆశించకుండా తన సొంత ఆదాయం నుండి ఆక్సిజన్ బ్యాంకులకు చిరంజీవి నిధులు సమకూరుస్తున్నారు.

ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని కి మీడియా స్పందన కరువు:

నిజానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే వారు ఎవరు ప్రచారం కోసం తాపత్రయపడరు‌. అయినప్పటికీ చేస్తున్న మంచి ప్రయత్నాన్ని ఎవరైనా శభాష్ అని ప్రశంసించినపుడు ఆ ప్రశంస ఇచ్చే ఉత్సాహంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయగలుగుతారు. ఒకవేళ మీడియా సంస్థలు ఇటువంటి వాటికి ప్రచారం కల్పించి ప్రశంసిస్తే ఈ కార్యక్రమం మరింత బృహత్తర కార్యక్రమం గా మారే అవకాశం ఉంది. అయితే అధికార పార్టీ లకు అడుగులకు మడుగులొత్తే చానల్స్ ఎందుకనో ఈ సేవ కార్యక్రమాన్ని మరుగు పరిచే ప్రయత్నం చేసినట్లుగా కనిపిస్తోంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీకి చెందిన చానల్స్ కూడా ఈ అంశంపై స్పందించడానికి తర్జనభర్జన పడ్డట్లు అర్థం అవుతోంది. బహుశా ఒక మంచి పనిని అభినందించడం కంటే తాము భుజాన ఎత్తుకొని మోసే పార్టీల శ్రేయస్సే తమకు ముఖ్యం అని తెలుగు చానల్స్ భావిస్తున్నట్లుగా ఉందంటూ ప్రేక్షకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ అంశానికి కవరేజ్ ఇవ్వకపోవడం ఒక ఎత్తయితే, కొన్ని వార్తా సంస్థలు మాత్రం ఎప్పటిలాగే ఆక్సిజన్ బ్యాంక్ విషయంలో కూడా చిరంజీవిపై బురదజల్లే ప్రయత్నం చేయడం ఆయన అభిమానులను విస్మయపరిచింది. దీంతో మీడియా పక్షపాత వైఖరి పై చిరంజీవి అభిమానులు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. అయితే ఒక ఆంధ్రప్రభ పత్రిక మాత్రం చిరంజీవి చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించడమే కాకుండా చిరంజీవి అభిమానుల ఆవేదన ని కూడా అక్షరీకరించింది. ఈ కథనం చిరంజీవి దృష్టి కి వచ్చింది

చిరంజీవి ముత్తా గోపాలకృష్ణ సంభాషణ ఆడియో లీక్ :

ఆదివారం సంచికలో ఆంధ్ర ప్రభలో ప్రచురితమైన ఈ కథనానికి కృతజ్ఞతలు చెప్పడానికి చిరంజీవి ఆంధ్రప్రభ హెడ్ ముత్తా గోపాలకృష్ణ తో సంభాషించారు. అయితే ఆ సంభాషణ లో భాగంగా ప్రస్తుత తెలుగు మీడియా పై చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ముందుగా ముత్తా గోపాలకృష్ణ మాట్లాడుతూ, కొన్ని కోట్ల మంది చిరంజీవి అభిమానులు ఆవేదననే తాను గమనించి, అక్షర రూపంలోకి మార్చానని చెప్పుకొచ్చారు. కనీసం ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ గాని ఇంత బృహత్తర కార్యక్రమాన్ని కనీసంగా కూడా ప్రస్తావించకపోవడం తనను బాధించిందని ఆయన చెప్పుకొచ్చారు. మిగతా కొందరు, ప్రజల నుంచి దోచుకోగా వచ్చిన డబ్బులతో కొద్దిపాటి కార్యక్రమాలు చేస్తూ కూడా ఎంతో ప్రచారాన్ని పొందుతుండగా మీలాంటివారు సొంత కష్టార్జితం తో ఇంత మంచి ప్రయత్నాన్ని చేస్తూ కూడా విమర్శలు ఎదుర్కోవలసి వస్తోందని ఆయన అన్నారు. అయితే దీనికి చిరంజీవి స్పందిస్తూ ప్రస్తుతం మీడియా ఇలా ఉండడం మన ఖర్మ అని అన్నారు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్లకు ఉండొచ్చని , కానీ ఒక మంచి పని చేసినప్పుడు దాన్ని మంచి అని చెప్పకపోగా దానిని కూడా చెడుగా చిత్రీకరిస్తూ వార్తలు చేయడం బాధించిందని చిరంజీవి అన్నారు. ప్రస్తుత కరోనా విపత్తు ముగిసిన తర్వాత ఇంకేదైనా కలిసి చేద్దాం అని చిరంజీవి గోపాలకృష్ణ తో సంభాషణ ముక్తాయించారు.

మొత్తం మీద:

చిరంజీవి అప్పుడెప్పుడో బ్లడ్ బ్యాంక్ స్థాపించి దానికి అనేక అవార్డులను కూడా పొందుకున్నారు. అయితే అప్పటి దాకా అందరూ చిరంజీవి బ్లడ్ బ్యాంకులని మెచ్చుకున్న వారే. కానీ, చిరంజీవి రాజకీయాల్లోకి రాగానే ఒక్కసారిగా అవే బ్లడ్ బ్యాంకుల మీద తీవ్రాతి తీవ్రమైన విమర్శలు చేశారు. ఇప్పుడు చిరంజీవి చేస్తున్న ఆక్సిజన్ బ్యాంకులని మెచ్చుకుంటే రేపు ఎప్పుడైనా చిరంజీవి మళ్లీ రాజకీయ పరంగా యాక్టివ్ అయినా, లేక బాహాటంగా జనసేన కు మద్దతు పలికినా, అప్పుడు ఈ అంశం తమకు ఇబ్బంది కలిగిస్తుంది అన్న ఉద్దేశంతో ప్రస్తుత మీడియా సంస్థలు వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతోంది.

ప్రజలకు మంచి చేయాలని స్థాపించిన ఆక్సిజన్ బ్యాంకు ఖర్చుపెట్టిన అదే 30 కోట్లు పెడితే న్యూస్ ఛానల్ స్థాపించడం, నిర్వహించడం రెండూ చేయొచ్చు. అయినప్పటికీ ఎందుకో మెగా ఫ్యామిలీ మీడియా రంగంలోకి ప్రవేశించే విషయంలో తటపటాయిస్తూ ఉంది. ప్రస్తుతం రోజులు మారాయి అని, గబ్బర్ సింగ్ సినిమాలో చెప్పినట్టు “ఎవడి డప్పు వారే కొట్టుకోవాలని”, మెగా ఫ్యామిలీ ఇప్పటికైనా అర్థం చేసుకుని సొంత ఛానల్ పెడుతుందా అన్నది వేచిచూడాలి.

– జురాన్ (@CriticZuran)

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close