చిరుకి స‌ర్‌ప్రైజ్ బ‌ర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన రెబ‌ల్ స్టార్‌

చిత్ర‌సీమ‌లో ఆతిథ్యానికి మ‌రో పేరులా నిలిచిన వ్య‌క్తి కృష్ణంరాజు. ఆయ‌న స్వ‌త‌హాగా భోజ‌న ప్రియుడు. నాన్ వెజ్ లేనిదే ముద్దు దిగ‌దు. అయితే ఒక‌ట్రెండు ర‌కాల‌తో స‌రిపెట్టుకోరు. అన్ని ర‌కాల‌తో కంచం నిండుగా ఉండాల్సిందే. ఆతిధ్యం ఇచ్చేటప్పుడు కూడా అంతే. డైనింగ్ టేబుల్ పై కొంచెం కూడా ఖాళీ ఉండ‌దు. తిండి పెట్టీ పెట్టీ చంపేస్తారు.. అంటూ కృష్ణంరాజు ఆతిథ్యం గురించి.. స‌ర‌దాగా కంప్లైంట్ చేస్తుంటారంతా. అందుకే కృష్ణంరాజు గారి నుంచి ఆహ్వానం వ‌స్తే.. ఇక ఆ రోజు పండ‌గే. వంట‌కాల‌న్నీ ద‌గ్గ‌రుండి సిద్దం చేసి, ప‌క్క‌న నిల‌బ‌డి మ‌రీ వ‌డ్డించ‌డం ఆయ‌న‌కు అల‌వాటు. కృష్ణంరాజు ఎంత భోజ‌న‌ప్రియుడైనా.. కారెజీ ఇంటి నుంచి రావాల్సిందే. బ‌య‌ట ఆహారం అస్స‌లు తీసుకోరు. కృష్ణంరాజు సెట్‌కి ఓ భారీ కారియ‌ర్ రావ‌డం ఆన‌వాయితీ. లంచ్ స‌మ‌యంలో అంద‌రినీ ప‌క్క‌న కూర్చోబెట్టుకొని… ఆ కారియ‌ర్‌ని పంచుకొని తినేవారు. పుల‌స కూరంటే.. కృష్ణంరాజుకి చాలా ఇష్టం. భోళా శంక‌రుడు అంటారే… కృష్ణంరాజు అలాంటివాడే. ఎవ‌రైనా స‌రే. ఆయ‌న్ని మాట‌ల‌తో ప‌డ‌గొట్టేయొచ్చు. ఎవ‌రేం అడిగినా కాద‌న‌ని వ్య‌క్తి. కృష్ణంరాజుకి ఫొటోగ్ర‌ఫీ హాబీ. ఖ‌రీదైన కెమెరాల్ని కొనేవారు. ఓసారి… చిరంజీవి పుట్టిన రోజుకు ఆయ‌న మెడ‌లో కెమెరా వేసుకొని వెళ్లారు. చిరంజీవి ఫొటోల్ని తీయ‌డానికి. కృష్ణంరాజు ఫొటోలు తీస్తున్న‌ప్పుడు ఆ కెమెరాని చూసిన చిరంజీవి.. `అన్న‌య్య‌.. ఈ కెమెరా ఎక్క‌డ‌ది.. బాగుందే` అన్నార్ట‌. అంతే.. వెంట‌నే ఆ కెమెరాని.. చిరంజీవి మెడ‌లో వేసి `ఇదే నీ బ‌ర్త్ డే గిఫ్ట్‌` అనేశారు. అప్ప‌ట్లోనే ఆ కెమెరా ఖ‌రీదు లక్ష‌ల్లో ఉండేది.
ఈ అలవాట్ల‌న్నీ అచ్చంగా అందిపుచ్చుకొన్నాడు ప్ర‌భాస్‌. అప్ప‌ట్టో కృష్ణంరాజు గురించి ఎలా చెప్పుకొన్నారో, ఇప్పుడు ప్ర‌భాస్ గురించి అలా మాట్లాడుకొంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close