అబ్బే… ‘క‌త్తి’ దిగ‌డం లేదు

చిరంజీవి 150వ సినిమా గురించి.. ఎంత కాలం ఆలోచించారో? ఎన్నేళ్లు టైమ్ వేస్ట్ చేశారో? చివ‌రికి ఏరి కోరి త‌మిళ సినిమా క‌త్తి హ‌క్కుల్ని కొని.. త‌న కుటుంబానికి బాగా కావ‌ల్సిన వినాయ‌క్ చేతిలో పెట్టాడు. ఆ సినిమాకి క‌త్తిలాంటోడు అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. త‌న పాత్ర కోసం గ‌డ్డం కూడా పెంచుతున్నాడు చిరు. అంతా బాగానే ఉంది. కానీ స్ర్కిప్టు తెలుగీక‌రించ‌డంలోనే వినాయ‌క్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ట్టు టాక్‌. మ‌రీ ముఖ్యంగా చిరంజీవిని వినాయ‌క్ శాటిస్పై చేయ‌లేక‌పోతున్నాడ‌ట‌. ఇప్ప‌టికే రెండు ద‌ఫాలు స్ర్కిప్టు మార్చాడ‌ట వినాయ‌క్‌. అయినా స‌రే.. ఇది బాలేదు.. అది బాలేదు.. అంటూ చిరంజీవి మార్పులూ చేర్పులూ చెబుతున్నాడ‌ట‌.

ఈ విష‌యంలో వినాయ‌క్ కూడా కాస్త అసంతృప్తికి గుర‌వుతున్నా.. చిరంజీవి 150వ సినిమా ప్రెస్టేజియ‌స్ ఇష్యూ కాబట్టి, చిరుతో స‌ర్దుకు పోతున్నాడ‌ట‌. ఈ నెలాఖ‌రు క‌ల్లా పూర్తి స్ర్కిప్టు చేతిలో పెట్టాల‌ని డెడ్‌లైన్ ఇచ్చాడ‌ట చిరు. రీమేక్ సినిమా విష‌యంలోనూ ఇన్ని త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లా?? ఆల్రెడీ క‌థేంటో తెలుసు, క్యారెక్ట‌రైజేష‌న్లు తెలుసు.. అయినా స‌రే చిరు ఇంత‌లా నాన్చుతున్నాడంటే.. సొంత క‌థైతే ఇంకెన్ని తిప్ప‌లు పెట్టేవాడో??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

ఆస్తుల పంచుడు వివాదం – కాంగ్రెస్‌కు బీజేపీ ప్రచారం !

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ధనవంతుల ఆస్తులను పేదలు పంచుతామని ఎక్కడా చెప్పలేదు. ఎప్పుడో మన్మోహన్ సింగ్ ఏదో చెప్పారని..దాన్ని చిలువలు పలువలు చేసి బీజేపీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ వస్తే మన ఆస్తులన్నింటినీ...

జగన్ ఎంత మాట్లాడితే షర్మిలకు అంత మేలు !

వైఎస్ వారసులు ఎవరు ?. ఈ విషయంలో ప్రజలు తేల్చుకోవాల్సిందేనని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. పులివెందులలో సభ పెట్టి వారసత్వం గురించే మాట్లాడారు. ఇప్పటి వరకూ ప్రజలు ఆయనకే...

సికింద్రాబాద్ లో ఎవరిదీ పైచేయి..?

సికింద్రాబాద్ లోక్ సభ సెగ్మెంట్ లెక్కలు మారుతున్నాయా..? సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డికి ఝలక్ తప్పదా..? కేసీఆర్ చెప్పినట్టుగానే సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు ముందంజలో ఉన్నారా..? బలమైన అభ్యర్థిగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close