అలీకి మంత్రి పదవి కావాల్సిందేనట..!

రాజకీయ రంగ ప్రవేశం కోసం ఉబలాట పడుతున్న అలీకి.. చాలా పెద్ద టార్గెట్లే పెట్టుకున్నారు. ఇప్పటి వరకూ రాజకీయ రంగ ప్రవేశంపై మీడియాతో పెద్దగా మాట్లాడని.. అలీ.. ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ముఖాముఖిలో మాత్రం… తన ఆశలు అన్నీ వెళ్లబోసుకున్నారు. తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే సరిపోదని… మంత్రి పదవి కూడా ఇవ్వాల్సిందేనంటున్నారు. అలా ఇచ్చే పార్టీలో చేరతానని..తనకు దాపరికాలు ఏమీ లేవంటున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంపై అలీ కన్ను ఉంది. అక్కడ… ముస్లిం జనాభా ఎక్కువ. ఎప్పుడూ ముస్లిం అభ్యర్థులే గెలుస్తూ ఉంటారు. తనకు అక్కడ సీటు ఇచ్చి .. మంత్రి పదవి కూడా ఇవ్వాలంటున్నారు. ఏ పార్టీ ఇలా ఇస్తే ఆ పార్టీలో చేరిపోతానంటున్నారు.

అలీ .. తన లక్ష్యాన్ని జేబులో పెట్టుకుని మూడు పార్టీల వద్దకు ఇప్పటికే పరుగులు పెట్టారు. కొన్నాళ్ల క్రితం ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను అలీ కలిశారు. జనవరి 9వ తేదీన వైసీపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. ఆదివారం.. అశ్వనీదత్ తో కలిసి చంద్రబాబును కలిశారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ ను కూడా కలిశారు. ఈ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ నేతలు షాక్‌ కు గురయ్యారు. పవన్ కల్యాణ్‌కు అత్యంత సన్నిహితుడైన అలీ.. పవన్ కల్యాణ్‌తో రెండు గంటల పాటు సమావేశమయ్యారు. రాజకీయంగా అన్ని విధాలుగా అండగా ఉంటానని పవన్ హామీ ఇచ్చారని, అలీ జనసేనలో చేరడం ఖాయమని జనసేన వర్గాలు చెప్పుకొచ్చాయి.

మూడు పార్టీల్లో ఏ పార్టీ నుంచి టికెట్ దక్కినా అలీ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు.. ఆయన ఆశిస్తున్న గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ సిట్టింగ్ సీటు. అక్కడి ఎమ్మెల్యేలను తొలగించి.. గుంటూరుకు ఎలాంటి సంబంధం లేని.. అలీకి జగన్ టిక్కెట్ ఇస్తారా..? అనేది కీలకం. అలాగే.. టీడీపీ అధినేత కూడా.. పార్టీకి పని చేయని వాళ్లను టిక్కెట్ ఇచ్చే పరిస్థితిలో లేరు. ఇప్పుడు అలీకి ఎక్కువగా టిక్కెట్ వచ్చే అవకాశాలు జనసేలో ఉన్నాయి. మరి అలీ ఏ నిర్ణయం తీసుకుంటారో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పవన్ కు సపోర్ట్ గా ప్రభాస్ ఫ్యామిలీ

పిఠాపురం నుంచి పోటీ చేస్తోన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సినీ ఇండస్ట్రీ నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే కొణిదెల ఫ్యామిలీతోపాటు పలువురు సినీ ప్రముఖులు నియోజకవర్గంలో వాలిపోయి పవన్...

అవధూతగా ప్రభాస్ ?

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఈ సినిమాలో ప్రభాస్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. దీనిపై ఇటివలే అధికారిక ప్రకటన ఇచ్చారు. ప్రభాస్ సెట్స్ లో అడుగుపెట్టారని అభిమానులుని సర్ ప్రైజ్...

ఈటీవీ విన్… ఇలా అయితే కష్టమే!

'ఈనాడు' ఏ రంగంలో అడుగుపెట్టినా అగ్రగామిగా నిలవడానికే ప్రయత్నిస్తుంది. ఈ సంస్థ 'ఈటీవీ విన్' తో ఓటీటీలోకి ప్రవేశించింది. అయితే ఇప్పటివరకూ ఆ ఓటీటీ నుంచి వచ్చిన ప్రాజెక్ట్స్ లో '90s' తప్పితే...

అమ్మకానికి హైదరాబాద్ మెట్రో..?

హైదరాబాద్ మెట్రోను విక్రయించేందుకు ఎల్ అండ్ టీ సిద్దమైందా..? నష్టాల పేరిట మెట్రోను విక్రయించేందుకు నిర్ణయం తీసుకుందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. అయితే మెట్రోను ఇప్పట్లో అమ్మకానికి పెట్టడం లేదని...2026 తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close