కవితను అరెస్ట్ చేస్తారని జగ్గారెడ్డి ఆందోళన

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను నిందితురాలిగా చేరుస్తూ సీబీఐ ఇచ్చిన నోటీసులతో కాంగ్రెస్ ఉలిక్కి పడింది. మామూలుగా అయితే బీఆర్ఎస్ డిఫెండ్ చేసుకోవాలి. కానీ బీఆర్ఎస్ నేతలు ఎవరూ స్పందించలేదు. చివరికి కవిత కూడా స్పందించలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలకు మాత్రం.. ఎప్పుడు 2022 డిసెంబర్ లో ఓ సారి ప్రశ్నించిన తర్వాత సీబీఐ మళ్లీ ఇప్పుడు .. అదీ లోక్ సభ ఎన్నికల ముందు నోటీసులు ఇవ్వడం వెనుక ఏదో స్కెచ్ ఉందని అనుమానిస్తున్నారు. ఈ అనుమానాలతో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రెస్ మీట్ పెట్టేసారు.

కవితను నిందితురాలిగా చేర్చడం.. విచారణకు నోటీసుల వెనుక కుట్ర ఉందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తెర ముందుకు వచ్చారు. లిక్కర్ స్కామ్‌లో కవితను నిందితురాలిగా చేర్చడం ఓ డ్రామా అన్నారు. లోక్‌సభ ఎన్నికల కోసమే ఈ కేసును మళ్లీ తెరపైకి తెచ్చారన్నారు. కవితను అరెస్టు చేస్తే కేసీఆర్ ఫ్యామిలీ రోడ్డెక్కుతుందన్నారు. సింపతీతో ఎంపీ సీట్లు గెల్చుకోవాలని బీఆర్ఎస్ ప్లాన్ అని జగ్గారెడ్డి ఆరోపించాు. కాంగ్రెస్‌కు వచ్చే సీట్లు గండి కొట్టేలా.. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్లాన్ చేస్తున్నాయన్నారు.

జగ్గారెడ్డి ఆందోళనలో రాజకీయం ఉందని అనిపిస్తున్నా.. అంతగా సానుభూతి పండిచాలనుకుంటే.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అరెస్టు చేసే ప్లాన్ అమలు చేసి ఉండే వారు కదా.. అలా చేసి ఉంటే.. జగ్గారెడ్డి చెప్పినట్లుగా సానుభూతి వెల్లువ వచ్చి అసలు కాంగ్రెస్ గెలిచి ఉండేది కాదుగా అని.. ఎవరికైనా అనిపించవచ్చు. కేసీఆర్ కుటుంబంపై చర్యల తీసుకుంటే ప్రజల్లో సానుభూతి వస్తుందేమోనని కాంగ్రెస్ కంగారు పడుతున్నట్లుగా జగ్గారెడ్డి మాటలు ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. నిజంగా కవితను అరెస్టు చేసినా.. ఇప్పుడు బీఆర్ఎస్ కక్ష సాధింపలేనని డిఫెండ్ చేసుకునే పరిస్థితి లేదు. బీజేపీపై నేరుగా ఆరోపణలు చేయడం ఆపేసి చాలా కాలం అయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close