ఐదింటిలో కాంగ్రెస్ కు మూడు..బీజేపీ జీరో..! వాడిపోయిన కమలం..!!

తెలంగాణను మినహాయిస్తే.. ఎన్నికలు జరిగిన మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో మూడింటిలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మిజోరంలో మాత్రం అధికారం పోగొట్టుకుంది. పదిహేనేళ్ల నుంచి అధికారానికి దూరంగా ఉన్న చత్తీస్ ఘడ్ లో … పూర్తి స్థాయి ప్రభంజనాన్ని కాంగ్రెస్ పార్టీ సృష్టించింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు.. పోలింగ్ కు ముందు బీజేపీలో చేరిపోయినా.. కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసింది. 90 అసెంబ్లీ స్థానాలున్న అసెంబ్లీలో 67 స్థానాలను విజయం సాధించింది. ఇక ఐదేళ్ల కిందట… భారీ విజయంతో అధికారం అందుకున్న బీజేపీ.. రాజస్తాన్ లో ఈ సారి ఓటమి పాలైంది. అధికార వ్యతిరేకత తీవ్రంగా ఉందన్న ప్రచారం జరగింది.

అయితే.. కాంగ్రెస్ పార్టీ అంత బీభత్సమైన విజయాన్ని నమోదు చేయలేదు. సాధారణ మెజార్టీకి ఐదారు స్థానాలను… మాత్రం అధికంగా సాధించగలగుతోంది. రెండు వందల స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్ 107 స్థానాలను గెలుచుకోనుంది. ఇక మధ్యప్రదేశ్ లో ఫలితం…అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ మార్క్ 115 స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయమైంది. బీఎస్పీ నాలుగు చోట్ల విజయం సాధించడంతో… ఆ పార్టీ కాంగ్రెస్ కు మద్దతుగా నిలబడవచ్చు. ఈ మూడు రాష్ట్రాల్లోనూ.. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లోనూ అధికారం కోల్పోతే.. హిందీ బెల్ట్ లో .. బీజేపీకి దెబ్బ పడినట్లవుతుంది.

ఈ పరిస్థితి వచ్చే సాధారణ ఎన్నికల నాటికి ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతాయి. కాంగ్రెస్ పార్టీ.. కోలుకున్నట్లు కనిపిస్తూండటంతో.. మిత్రపక్షాలు కూడా.. ఆ పార్టీతో కలిసి వచ్చేందుకు అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీకి.. మిజోరంలో కూడా.. ఎలాంటి సానుకూల ఫలితాలు రాలేదు. మొత్తంగా.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ కు మంచి ఫలితాలు వచ్చాయి. బీజేపీ కుదేలైపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.