ఏపీలో కరోనా బారిన పడుతోంది యువతే..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం ఎక్కువగా వృద్ధులపైనే ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ నమోదవుతున్న కేసుల్లో అరవై శాతానికిపైగా 21 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న వారివే ఉన్నాయి. మొత్తంగా 486 పాజిటివ్ కేసులు ఉంటే.. ఈ కేటగరిల్లోని వారు 371 మంది ఉన్నారు. అరవై ఎళ్లు పైబడిన వారిలో కేవలం 42 మందికే కరోనా వైరస్ సోకరింది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి పదేళ్ల వయసున్న 18 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఆంధ్రప్రదేశ్ కరోనా వైరస్ ప్రభావం భిన్నంగా ఉందని చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనమన్న అభిప్రాయం ఏర్పడుతోంది.

సాధారణంగా యువతలో రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. వారికి వైరస్ సోకినా అంత త్వరగా బయటపడదు. చాలా మంది బలవర్థమైన ఆహారం.. ఇతర ఆరోగ్యపరమైన అలవాట్ల వల్ల…. ఎలాంటి లక్షణాలు లేకుండానే ఉంటారు. వృద్ధులపై మాత్రం తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే…ప్రపంచవ్యాప్తంగా కరోనా అనుమానితులు ఎక్కువగా వృద్ధులే ఉంటున్నారు. వారికే ఎక్కువ టెస్టులు చేస్తున్నారు. అయితే.. దానికి భిన్నంగా ఏపీలో యువతపైనే కరోనా పంజా విసురుతోంది. అనుమానితులు కూడా ఎక్కువగా యువతే ఉంటున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందన్నదానిపై… ఆరోగ్య నిపుణులు కూడా పరిశీలన జరుపుతున్నారు.

యువతకు వైరస్ బారిన పడే అవకాశం తక్కువగా ఉన్నందున.. వారికి ఆంక్షలు సడలించాలని.. పెద్దవారిని మాత్రం జాగ్ర్తతగా చూసుకోవాలన్న సూచనలు కొన్ని వర్గాల నిపుణుల నుంచి వచ్చాయి. అయితే.. అలాంటి పరిస్థితి లేదని.. ఏపీ ఏ కేస్ స్టడీగా మారుతోంది. ఒక్క ఏపీలోనే కాకుండా.. ఇప్పుడు ర్యాపిడ్ టెస్టులు చేస్తున్న దేశాల్లోనూ యువతలో కరోనా ప్రభావం ఎక్కువగానే ఉందని అంచనా వేస్తున్నారు. వైరస్ అప్పటికప్పుడు బయటపడదు. పధ్నాలుగు రోజుల్లోపు బయటపడవచ్చని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ తర్వాత కూడా వెలుగు చూస్తోంది. దాంతో.. వైరస్‌కు.. వయసుతో పనిలేదని.. అందరిపై ప్రభావం చూపుతోందని అంచనాకు వస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close