జార్ఖండ్‌లోనూ సీపీఎస్ రద్దు – ఏపీకే సాధ్యం కాదా ?

వారంలో సీపీఎస్ రద్దు అని ఉద్యమాలు చేసిన జగన్ తీరా సీఎం అయ్యాక నమ్మిన వాళ్లందర్నీ నట్టేట ముంచారు. సీపీఎస్ గురించి అడిగితే కేసులు పెడుతున్నారు. బైండోవర్లు చేస్తున్నారు. సీపీఎస్ రద్దు చేయడం అసాధ్యమంటున్నారు. కానీ ఇతర రాష్ట్రాలు మాత్రం అలవోకగా సీపీఎస్‌ను రద్దు చేస్తున్నాయి. రాజస్థాన్ , చత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాలు సీపీఎస్‌ను రద్దు చేయగా తాజాగా జార్ఖండ్ కూడా అదే పని చేసింది. సీపీఎస్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అక్కడి ఉద్యోగులు కూడా సీపీఎస్ రద్దు కోరుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడి ప్రభుత్వం సంక్షోభంలో ఉన్నప్పటికీ నిర్ణయం తీసుకున్నారు.

అయితే పెద్ద, చిన్న రాష్ట్రాలు సాహసోపేతంగా సీపీఎస్ రద్దు చేస్తూంటే.. మాట తప్పుతాడు అనే ముద్ర వేస్తున్నప్పటికీ ఏపీలో ఎందుకు అమలు చేయడం లేదన్న చర్చ వస్తోంది. సీపీఎస్ విషయంలో ఇప్పటికే కేంద్రానికి రద్దు చేయబోమని హమీ ఇచ్చి పెద్ద ఎత్తున అప్పులు తెచ్చారని ఇప్పుడు రద్దు చేయాలంటే ఆ అప్పులన్నీ తిరిగి కట్టాల్సి ఉంటుందని ఆ పరిస్థితి లేనందున సీపీఎస్ రద్దు చేయలేకపోతున్నారన్న వాదన వినిపిస్తోంది. సీపీఎస్ రద్దుకు పైసా అక్కర లేదు. అయితే రిటైరయ్యే ఉద్యోగులకు పెన్షన్ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ ఉద్యోగులు దాచుకున్న సొమ్మును తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది.

సీపీఎస్ రద్దు అనేది జగన్ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేసింది. వాళ్లను దారుణంగా మోసం చేయడమే కాకుండా అడ్డగోలుగా కేసులు పెట్టి వేధిస్తున్నారన్న అభిప్రాయం ఏర్పడేలా చేస్తోంది. అయితే సీపీఎస్ రద్దు అనేది అసాధ్యమేమీ కాదని ఇతర రాష్ట్రాలు నిరూపిస్తున్నాయి. ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం హామీ ఇచ్చిన జగనే. అయితే ఆయనే కుదరదని చెబుతూండటం రాజకీయం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close