ద‌స‌రా లుక్కులు: ఆయుధ పూజ చేసిన హీరోలు

ప్ర‌తి పండ‌క్కీ… కొత్త లుక్కుల‌తో హ‌డావుడి చేయ‌డం చిత్ర‌సీమ‌కు మామూలే. పండ‌గ వ‌స్తోందంటే… అభిమాన క‌థానాయ‌కుల లుక్కులు విడుద‌ల అవుతాయ‌ని అభిమానులు కూడా ఆవురావురుమంటూ ఎదురుచూస్తుంటారు. ఈ ద‌స‌రాకీ లుక్కుల హ‌డావుడి మామూలుగా లేదు. అగ్ర కథానాయ‌కులకు సంబంధించిన కొత్త సినిమాల స్టిల్స్ కొన్ని బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అయితే… ఆ లుక్స్‌లో ఓ థీమ్ కనిపించింది. ద‌స‌రా పండ‌గ అంటే.. ఆయుధ పూజ‌కు పెద్ద పీట వేస్తారు. అందుకే మ‌న హీరోలూ చేతిలో ఆయుధాల‌తో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. నంద‌మూరి బాల‌కృష్ణ క‌త్తి ప‌ట్టుకుని ర‌క్తం చిందిస్తుంటే, మ‌హేష్ బాబు గొడ్డ‌లితో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. అల్లు అర్జున్ చేతిలో ఆయుధం లేక‌పోయినా… యాక్ష‌న్ మూడ్‌లో ఉన్న‌ట్టు మాత్రం అర్థ‌మైంది.

బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా కె.ఎస్ ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సి.క‌ల్యాణ్ నిర్మాత‌. ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ఎప్పుడో బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఇప్పుడు ద‌స‌రా సంద‌ర్భంగా మ‌రో లుక్‌ని విడుద‌ల చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కూ రొమాంటిక్ యాంగిల్‌లో క‌నిపించిన బాల‌య్య‌… ఈ కొత్త లుక్‌లో త‌న‌దైన శైలిలో రౌద్ర ర‌సం చూపిస్తున్నాడు. చేతిలో క‌త్తి ప‌ట్టుకుని.. క‌ద‌న రంగంలోకి దూకాడు. ఆ స్టిల్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చల్ చేస్తోంది. బాల‌య్య వీరావేశం చూస్తుంటే.. ఈ సీన్‌లో క‌నీసం వంద మందిపై క‌త్తి దూసి ఉంటాడ‌ని అభిమానులు కూడా స‌ర‌దాగా కామెంట్లు చేసుకుంటున్నారు.

మ‌హేష్ బాబు కొత్త సినిమా `స‌రిలేరు నీకెవ్వ‌రు`కి సంబంధించిన మ‌రో స్టిల్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ద‌స‌రా పండ‌గ సంద‌ర్భంగా ఈ రోజు సాయింత్రం 5 గంట‌ల 5 నిమిషాల‌కు మహేష్ లుక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. కొండారెడ్డి బురుజు ముందు.. చేతిలో గొడ్డ‌లి ప‌ట్టుకుని వీర‌త్తం చూపిస్తున్న మ‌హేష్ లుక్ ఇది. కొండా రెడ్డి బురుజు ఈ క‌థ‌లో కీల‌క పాత్ర పోషిస్తోంది. ఆ నేప‌థ్యంలో కొన్ని ముఖ్య‌మైన స‌న్నివేశాల్ని తెర‌కెక్కించారు. దాన్ని గుర్తు చేస్తూ ఈ లుక్‌ని విడుద‌ల చేసింది చిత్ర‌బృందం.

బ‌న్నీ `అలా వైకుంఠ‌పుములో` లుక్ కూడా ద‌స‌రా సంద‌ర్భంగానే విడుద‌ల చేశారు. ఇది కూడా యాక్ష‌న్ మూడ్‌లో ఉన్న చిత్ర‌మే. కాక‌పోతే… బ‌న్నీ చేతిలో ఆయుధాలేం లేవు. చేతిలో ఉన్న చున్నీనే ఓ ఆయుధంగా త్రివిక్ర‌మ్ భావించాడేమో. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతికి విడుద‌ల చేస్తున్నారు. మ‌హేష్ సినిమా కూడా సంక్రాంతి బ‌రిలో ఉన్న‌ సంగ‌తి తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close