కేంద్ర బలగాల రక్షణతో సీమ ఎత్తిపోతల పరిశీలన..! ఏపీని అవమానిస్తారా..!?

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం తారస్థాయికి చేరింది. స్టే ఉన్నా రాయలసీమ ఎత్తిపోతల పధకం నిర్మాణ పనులు చేసినట్లుగా తేలితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జైలుకు పంపుతామని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశించడం కలకలం రేపుతోంది. మరో వైపు చర్చలకు సిద్ధమని ఏపీ అంటోంది. వైఎస్‌పై తెలంగాణ మంత్రులు దారుణ వ్యాఖ్యలు చేస్తున్నా మంత్రులు ఖండించలేకపోతున్నారు. మరో వైపు కేసీఆర్ కేంద్రానికి లేఖ రాయడంతో రేపోమాపో కృష్ణాబోర్డు సీమ ఎత్తిపోతల ప్రాంతాన్ని పరిశీలించనున్నట్లుగా తెలుస్తోంది. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా ఫోన్ చేశారు. కేఆర్ఎంబీ బృందాన్ని కేంద్ర బలగాల రక్షణతో పంపుతున్నామని హామీ ఇచ్చారు.

ఏపీలో ప్రాజెక్టు పరిశీలనకు కేంద్ర బలగాల రక్షణ ఎందుకన్న అభిప్రాయం చాలా మందిలో ఉండొచ్చు. నిజానికి… గతంలోనే… కేఆర్ఎంబీ బృందం… ప్రాజెక్టును పరిశీలించాలని నిర్ణయించుకుంది. రెండు సార్లు రాష్ట్రానికి వచ్చేందుకు నిర్ణయించుకుంది. కానీ ఏపీసర్కార్ సహకరించలేదు. స్వయంగా సీఎస్.. అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ లేఖ రాశారు. అక్కడ శాంతిభద్రతల సమస్య ఉంటుందని కూడా పరోక్షంగా హెచ్చరించారు. ఈ క్రమంలో కేఆర్ఎంబీ పర్యటన వాయిదాలు మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ప్రభుత్వం.. ప్రాజెక్టు పరిశీలనకు వ్యతిరేకం కావడంతో… కేంద్ర బలగాల రక్షణతో పంపాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇది ఏపీని అవమానించడమేననే వాదన కూడా ఉంది.కానీ ఏపీ ప్రభుత్వ వైఖరి వల్ల.. ఇంతకు మించి.. వేరే దారి లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణకు చెందిన కొంతమంది రాయలసీమ ఎత్తిపోతల పధకం వద్దకు వెళ్లి అక్కడ పని జరుగుతున్న దృశ్యాలను చిత్రీకరించారు. అయితే అక్కడ సర్వే పనులు మాత్రమే జరుగుతున్నాయని ఎపీ ప్రభుత్వం చెబుతుంది. ఈ అంశంపై ఇప్పుడు జలవనరులశాఖలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఏమి చేయాలనే అంశంపై రేపుమాపో ముఖ్యమంత్రితో మాట్లాడి ఒక నిర్ణయానికి రానున్నారు. పరిశీలనకు సహకరిస్తే.. పనులు జరుగుతున్న విషయం స్పష్టమవుతుంది.అదే జరిగితే.. ఏపీ ఇమేజ్‌కుమచ్చ ఏర్పడుతుంది. అంతే కాదు సీఎస్ ఆదిత్యనాథ్‌ దాస్‌కు ఇబ్బందికరం అవుతుంది. ఈ వివాదాన్ని ఏపీ సర్కార్ వ్యూహాత్మకంగా పరిష్కరించుకోవాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close