ఇన్ సైడ్ న్యూస్‌: క్రిష్ ని డ‌మ్మీగా మార్చేశారా?

‘ఎన్టీఆర్‌’ బ‌యోపిక్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈరోజు జ‌ర‌గాల్సిన సెన్సార్ అనివార్య‌కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డింది. సోమ‌వారం సెన్సార్ పూర్తయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇన్‌సైడ్ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం… నిర్మాత‌ల విష‌యంలో క్రిష్ కాస్త అసంతృప్తితో ఉన్నాడ‌ని తెలుస్తోంది. క్రియేటీవ్ ప‌రంగా క్రిష్ ఇచ్చిన, ఇస్తున్న స‌ల‌హాలు ఏమాత్రం స్వీక‌రించ‌డం లేద‌ని తెలుస్తోంది. స్క్రిప్టు ద‌శ‌లోనే క్రిష్ చేతులు క‌ట్టేశార‌ని, అప్ప‌టికే పూర్త‌యిన స్క్రిప్టుని య‌ధాత‌థంగా తీయ‌డం త‌ప్ప ఈ సినిమా విష‌యంలోక్రిష్ చేసిందేం లేద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. ప‌బ్లిసిటీ ప‌రంగానూ క్రిష్ ఆలోచ‌న‌లు ఏమాత్రం అమ‌లుకావ‌డం లేద‌ట‌. ఈ సినిమాకి సంంధించి రోజుకో స్టిల్ బ‌య‌ట‌కు వ‌స్తోంది. గెట‌ప్పుల‌న్నీ రివీల్ అయిపోతున్నాయి. ఇలా ముందే స్టిల్స్ బ‌య‌ట‌కు వ‌చ్చేస్తే ఎలా? సినిమాలో చూడ‌డానికీ చూపించ‌డానికీ ఏముంటుంద‌న్న‌ది కొంత‌మంది వాద‌న‌. అదీ నిజ‌మే. క్రిష్ కూడా ఇదే అభిప్రాయాన్ని బాల‌య్య ద‌గ్గ‌ర వ్య‌క్తం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. కానీ.. బాల‌య్య అవేం ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌. వీలైన‌న్ని ఎక్కువ స్టిల్స్ బ‌య‌ట‌కు వ‌ద‌లాల‌ని, అప్పుడే ఏదో ర‌కంగా జ‌నాలు మాట్లాడుకుంటార‌ని బాల‌య్య చెబుతూ వ‌చ్చాడ‌ట‌.

రెండు సినిమాలూ ఒకేసారి పూర్తి చేయాల్సిరావ‌డం, రోజుకో కొత్త సీను త‌యారై స్క్రిప్టుతో జ‌త క‌ల‌వ‌డం క్రిష్‌కి బాగా ఇబ్బందిగా ప‌రిణ‌మించింద‌ని తెలుస్తోంది. ఎన్టీఆర్ బ‌యోపిక్‌కి వీలైనంత త్వ‌ర‌గా ముగించి `మ‌ణిక‌ర్ణిక‌` ప్ర‌మోష‌న్ల‌లో పాల్గొనాల‌ని క్రిష్ భావించాడ‌ని స‌మాచారం. కానీ.. ఆ అవ‌కాశం కూడా లేక‌పోవ‌డంతో క్రిష్‌నిరుత్సాహంగా ఉన్నాడ‌ట‌. ఒక‌వేళ `మ‌ణిక‌ర్ణిక‌` విజ‌య‌వంతం అయినా ఆ క్రెడిట్ త‌న‌కు రాకుండా పోతుందేమో అని క్రిష్ భ‌య‌పడుతున్నాడు. మ‌రోవైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్ని చ‌క్క‌బెట్టుకునే బాధ్య‌త కూడా క్రిష్‌పైనే వ‌దిలేసిన‌ట్టు తెలుస్తోంది. అటు డీఐ, ఇటు ఫైన‌ల్ మిక్సింగ్ అంటూ క్రిష్ ఒక్క‌డే హ‌డావుడి ప‌డుతున్నాడ‌ని, ఈ విష‌యంలో త‌న‌కు స‌పోర్ట్ చేసే హ్యాండు లేద‌ని ఇన్‌సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close