విశ్వ‌క్ సేన్ తొలి సినిమాని మోసిన సాయిరాజేష్‌

బేబీ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌య్యింది. ద‌ర్శ‌కుడిగా సాయి రాజేష్ స్టామినాకు అద్దం ప‌ట్టింది. త‌న‌కు ఇప్పుడు వ‌రుస అవ‌కాశాలు వ‌స్తున్నాయి. బేబీ చాలా విష‌యాల్లో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా నిలిచింది. అందులో విశ్వ‌క్‌సేన్ కాంట్ర‌వ‌ర్సీ కూడా ఒక‌టి. బేబీ సినిమాలోని ఆనంద్ చేసిన పాత్ర కోసం ముందు విశ్వ‌క్‌నే సంప్ర‌దించారు. అయితే విశ్వ‌క్ క‌థ కూడా విన‌కుండా అవ‌మానించాడంటూ ఓ సంద‌ర్భంలో సాయిరాజేష్ ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డం, దానికి విశ్వ‌క్ కౌంట‌ర్ ఇవ్వ‌డం జ‌రిగిపోయాయి. బేబీ హిట్ ని ఎంజాయ్ చేయండి కానీ, నా జోలికి రాకండి అన్న‌ట్టు.. విశ్వ‌క్ త‌న‌దైన శైలిలో కౌంట‌ర్ ఇచ్చాడు. దాంతో బేబీ వెర్స‌స్ విశ్వ‌క్ అంటూ సోష‌ల్ మీడియాలో కొంత చ‌ర్చ న‌డిచింది.

అయితే ఈ విష‌యంపై ఇప్పుడు మ‌రోసారి సాయి రాజేష్ మాట్లాడారు. ఈ ఇష్యూని కాంట్ర‌వ‌ర్సీ చేయ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని, విశ్వ‌క్ ఈ క‌థ విన‌క‌పోవ‌డం త‌న వ్య‌క్తిగ‌త నిర్ణ‌య‌మ‌ని, అయితే బేబీ పాట‌లు విడుద‌ల కాగానే.. పాట‌లు బాగున్నాయంటూ విశ్వ‌క్ మెచ్చుకొన్నాడ‌ని, ప్ర‌తీ హీరో, ప్ర‌తి ద‌ర్శ‌కుడి క‌థ వినాల్సిన అస‌వ‌రం లేదని, అయితే `విన‌ను` అనే మాట‌ని కాస్త గౌర‌వ ప్ర‌దంగా చెబితే బాగుంటుంద‌ని చెప్పుకొచ్చాడు. ఈ ఇష్యూ్కి సాధ్య‌మైనంత సున్నితంగా పుల్ స్టాప్ పెట్టాల‌న్న ప్ర‌య‌త్నం సాయి రాజేష్‌లో క‌నిపించింది.

ఇదే సంద‌ర్భంలో మ‌రో విష‌యాన్ని కూడా సాయిరాజేష్ గుర్తు చేయ‌డం విశేషం. విశ్వక్ సేన్ తొలి సినిమా వెళ్లిపోమాకే. ఈ సినిమా ట్రైల‌ర్ సాయిరాజేష్‌కి విప‌రీతంగా న‌చ్చింద‌ట‌. ఆ సినిమా ఆర్థిక ఇబ్బందుల్లో ప‌డి, విడుద‌ల కాని పొజీష‌న్‌లో ఈ సినిమాని దిల్ రాజు, అల్లు అర‌వింద్ ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లాడ‌ట‌. వాళ్ల‌తో విడుద‌ల చేయించ‌డానికి త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేశాడ‌ట‌. ఈ విష‌యం విశ్వ‌క్‌సేన్‌కి కూడా తెలీద‌ట‌. ఇవ‌న్నీ.. ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు సాయి రాజేష్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close