అశోక్ ని డ‌మ్మీ చేసేశారా?

పిల్ల జ‌మిందార్‌తో ఓ హిట్టు కొట్టాడు అశోక్‌. ఆ త‌ర‌వాత వ‌చ్చిన సుకుమారుడు అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. మ‌రో అవ‌కాశం అందుకోవ‌డానికి చాలా కాలం ప‌ట్టింది. మ‌ధ్య‌లో వెంక‌టేష్‌తో ఓ సినిమా అనుకున్నారు. కానీ అది వ‌ర్క‌వుట్ కాలేదు. 2012 నుంచి ‘భాగ‌మ‌తి’ క‌థ ప‌ట్టుకుని అనుష్క చుట్టూ తిరుగుతున్నాడు. ఎట్ట‌కేల‌కు ఆ సినిమా పూర్త‌యి.. ఈ నెల 26న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ‘భాగ‌మ‌తి’పై మంచి అంచ‌నాలే ఉన్న‌ప్ప‌టికీ అశోక్ క్యాలిబ‌ర్‌పై ఎవ్వ‌రికీ న‌మ్మ‌కాల్లేవు. ఈ సినిమాని త‌ను ఎలా తీశాడో అనే సందేహాలు నెల‌కొంటున్నాయి. కాక‌పోతే విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం… ఈ సినిమా కోసం అశోక్‌ని డైరెక్ష‌న్ చేయ‌నివ్వ‌లేద‌ట‌. అంతా కో డైరెక్ట‌ర్లు, స‌హాయ‌కులు చూసుకున్నార్ట‌. కెమెరామెన్ మ‌ది ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడిగానూ వ్య‌వ‌హ‌రించాడ‌ని తెలుస్తోంది. యూవీ క్రియేష‌న్స్‌కి అశోక్ చెప్పిన క‌థ బాగా న‌చ్చింద‌ని, క‌థ మాత్ర‌మే ఇవ్వ‌మ‌ని అడిగినా.. అశోక్ ఒప్పుకోలేద‌ని.. అందుకే ద‌ర్శ‌కుడిగా అశో్క్‌కి ఛాన్స్ ఇచ్చిన‌ట్టే ఇచ్చి… యూవీ క్రియేష‌న్స్ అత‌న్ని డ‌మ్మీ చేసింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ‘భాగ‌మ‌తి’ హిట్ట‌యితే స‌రే.. లేదంటే… ఆ ప్ర‌భావం అశోక్‌పై ప‌డే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

గాజు గ్లాస్ జనసేనకు మాత్రమే !

వైసీపీ నేతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇండిపెండెంట్లుగా తమ వారిని నిలబెట్టి వారికి గాజు గ్లాస్ గుర్తు ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. గాజుగ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేస్తూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close