మాట త‌ప్పితివి క‌ద‌య్యా ఆనందూ..!

ఒక్క క్ష‌ణం విడుద‌ల‌కు ముందు కొన్ని ఊహించ‌ని ప‌రిణామాలు ఎదుర‌య్యాయి. ఈ సినిమా కొరియ‌న్ లో వ‌చ్చిన `ప్యార‌ర‌ల్ లైఫ్‌`కి కాపీ అనే వాద‌న వినిపించింది. ప‌ర భాషా చిత్రాల్లో పాయింట్‌ని ప‌ట్టుకొని సినిమాలు తీసేయ‌డం మ‌న వాళ్ల‌కు బాగా అల‌వాటు. కాబ‌ట్టి… ఈ కాపీనీ పెద్ద మ‌న‌సుతో స్వీక‌రించొచ్చు. కాక‌పోతే ఇక్క‌డ ఇంకో పాయింట్ ఉంది. అదేంటంటే.. స‌ద‌రు కొరియ‌న్ సినిమాని రీమేక్ చేయ‌డానికి అనిల్ సుంక‌ర ప్లాన్ చేశారు. అందుకు గానూ.. రైట్స్ కూడా కొనుగోలు చేశారు. ఒక్క క్ష‌ణం ట్రైల‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చాక‌.. తాము రీమేక్ చేయాల‌నుకుంటున్న సినిమానే.. ఆనంద్ కాపీ చేశాడ‌న్న సంగ‌తి అర్థ‌మైంది. దాంతో… అనిల్ సుంక‌ర కాస్త హ‌డావుడి చేశాడు. ఈ సినిమా విడుద‌ల అవుతుందా, లేదా?? అనే స‌స్పెన్స్ న‌డిచింది.

ఆనంద్ కూడా మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూల్లో ”ఇది కొరియ‌న్ క‌థ కాదు.. చాలా కొత్త క‌థ‌” అని గ‌ట్టిగా చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. కాన్సెప్ట్ ఒక్క‌టే అయినంత మాత్రాన కాపీ అంటారేంటి? అని వాదించాడు. కానీ తీరా సినిమా చూస్తే.. ఇది ‘ప్యార‌ల‌ల్ లైఫ్’ సినిమాకి కాపీ అనే సంగ‌తి అర్థ‌మైంది. అలాంట‌ప్పుడు అనిల్ సుంక‌ర ఎందుకు వ‌దిలేశాడు? అనే డౌటు రావొచ్చు. విడుద‌ల‌కు ముందే… చిత్ర‌బృందంతో సెటిల్‌మెంట్ జ‌రిగిపోయింద‌ని, దాని విలువ దాదాపుగా అర‌కోటికి అటూ ఇటూగా ఉంటుంద‌ని తేలింది. చిత్ర‌సీమ‌లో ఇలాంటి సెటిల్మెంట్ వ్య‌వ‌హారాలు మామూలే. కాక‌పోతే.. వీఐ ఆనంద్ అబ‌ద్దం చెప్పిన‌ట్టు అయ్యింది క‌దా?? ఇది కాపీ కాద‌న్న ఆనంద్‌.. ఇప్పుడు మీడియాకు ఎలాంటి స‌మాధానం చెబుతాడు??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close