ఆ అభిమానుల‌కు జ‌న‌సేన సాయం ఉందా..?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ – మీడియాపై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు – త‌ద‌నంత‌ర ప‌రిణామాలు తెలిసిన‌వే. హైద‌రాబాద్ ఫిల్మ్ ఛాంబ‌ర్ లో మెగా ఫ్యామిలీ హంగామా త‌రువాత‌.. కొంతమంది అభిమానులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్ కి చెందిన ఓబీ వ్యాను, ఇండికా కారుపై దాడి ఘ‌ట‌న కూడా తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు అభిమానుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై కేసులు న‌మోదుచేశారు. అంతేకాదు, 14 రోజుల‌పాటు రిమాండ్ కి కోర్టు ఆదేశించింది. ఈ ఘ‌ట‌న‌లో దెబ్బ‌తిన్న మీడియా వాహ‌నాల‌కు బీమా సౌక‌ర్యం ఉంటుంది కాబ‌ట్టి, వారికి జ‌రిగిన న‌ష్టాన్ని పూడ్చుకునే అవ‌కాశం ఉంది.

స‌రే, ఇదే విష‌యంపై మొన్న‌నే ప‌వ‌న్ స్పందించారు క‌దా! కుర్రాళ్లు కొంత‌మంది బ‌య‌ట వాహ‌నాల అద్దాలు ప‌గుల‌గొట్ట‌డం వంటివి చేస్తున్నార‌ని తన దృష్టికి పోలీసులు తీసుకొచ్చార‌నీ, అయితే తానేం రెచ్చ‌గొట్ట‌లేద‌ని ప‌వ‌న్ అన్నారు. వాళ్లని రెచ్చ‌గొడుతున్నది కూడా మీడియేన‌నీ, చాలారోజులుగా వాళ్ల‌కు ఆగ్ర‌హం తెప్పించే విధంగా మీడియా చేస్తోంద‌నీ, కాబ‌ట్టి వాళ్ల‌కి కోపం వ‌స్తోంద‌న్న‌ట్టుగా విశ్లేషించే ప్ర‌య‌త్నం చేశారు. ఈ విష‌యం మీడియాకి చెప్పండంటూ ఉల్టా క్లాస్ తీసుకున్నారు. అంటే, అభిమానం పేరుతో కొంత‌మంది చేస్తున్న ప‌నుల‌కు ప‌వ‌న్ మ‌ద్ద‌తు ఉండ‌ద‌ని చెప్పిన‌ట్టే క‌దా. ఈ విష‌యంలో వారికి అండ‌గా నిలిచేదీ లేద‌ని చెప్పిన‌ట్టు. చోటు చేసుకున్న ఘ‌ట‌న‌ల‌పై కూడా స్పందించ‌ను అని చెప్పిన‌ట్టే క‌దా.

నిజానికి, పవన్ స్పందించే ప‌రిస్థితి కూడా లేద‌నే చెప్పాలి. ఎందుకంటే, ఈ ఘ‌ట‌న‌లో ఇరుక్కున్న అభిమానుల విష‌య‌మై ప‌వ‌న్ స్పందించి, సాయ‌మందించే ప్ర‌య‌త్నం నేరుగా చేస్తే… ప‌రోక్షంగా మీడియాపై దాడి ఘ‌ట‌నకు మ‌ద్ద‌తు ప‌లికిన‌ట్టు అవుతుంది. అలాగ‌ని, త‌న కోసం నిల‌బ‌డి, కల‌బ‌డిన అభిమానుల కోసం ప‌వ‌న్ ఏం చేస్తున్నారంటే… ఏమో, తెర వెనుక వారికి మ‌ద్ద‌తుగా నిలిచే ప్ర‌య‌త్నాలు ఏమైనా చేస్తున్నారో లేదో తెలీదు! అభిమానం పేరుతో ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటే… వాటిపై బ‌హిరంగంగా ప‌వ‌న్ స్పందించ‌లేని ప‌రిస్థితి ఉంది. వాహ‌నాల‌పై దాడి ఘ‌ట‌న‌లో 14 రోజుల జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీకి వెళ్లిన అభిమానులకు జ‌న‌సేన సాయం ఉంటుందా, ఉండదా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close