అసెంబ్లీలో విప‌క్షాల‌పై తెరాస ప‌ట్టు సాధించిన‌ట్టేనా!

టి.ఆర్‌.ఎస్‌. అంటేనే ‘తిరుగులేని రాజ‌కీయ శ‌క్తి’ అనే మీనింగ్ చెబుతుంటారు. మ‌నం బ‌ల‌ప‌డాలంటే ప్ర‌త్య‌ర్థుల్ని బ‌ల‌హీన ప‌ర‌చాల‌న్న సూత్రాన్ని ఆక‌ళింపుజేసుకుని, ఫిరాయింపుల్ని అధికార పార్టీ ప్రోత్స‌హించి కొంత‌మేర‌కు విజ‌యం సాధించింది. ఇప్పుడు అసెంబ్లీలో కూడా త‌న‌దైన వ్యూహాన్ని అమ‌లు చేస్తూ… ప్ర‌తిప‌క్షాల‌న్నింటినీ బాగానే దారిలోకి తెచ్చుకున్నారు కేసీఆర్‌. పార్టీలవారీగా ఎవ‌రిని ఎలా అదుపులో ఉంచాలో… అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఎలా దారిలోకి తెచ్చుకోవాలో తెరాసకు బాగా తెలుసు.

శాస‌నస‌భ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ కాంగ్రెస్. కానీ, అది పేరు మాత్ర‌మే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం అన్న‌ట్టుగా తీరు మారిపోయింది. కాంగ్రెస్ నేత‌లు ఎవ‌రైనా అధికార పార్టీపై స్వ‌రం కాస్త పెంచుతున్న సంద‌ర్భం వ‌స్తోంది అన‌గానే కేసీఆర్ మాట్లాడ‌టం మొద‌లుపెడ‌తారు. ‘స‌భ‌లో పెద్ద‌లు జానారెడ్డి లాంటివారు ఉన్నారు. ఆయ‌న‌కి అన్ని విష‌యాలు తెలుసు’ అనేస‌రికి ప‌రిస్థితి మారిపోతుంది. ప్ర‌తిప‌క్షం త‌ర‌ఫున గ‌ట్టిగా మాట్లాడాల్సిన జానా చ‌ల్ల‌బ‌డిపోతారు. సో… కాంగ్రెస్ వీక్ పాయింట్ ను అక్క‌డ ప‌ట్టుకున్నారు.

ఆ త‌రువాత‌, తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకోవాలి. స‌భ‌లో ముచ్చ‌ట‌గా ముగ్గురు మాత్ర‌మే ఉన్నారు. వారిలో ఆర్‌. కృష్ణ‌య్య స‌భ‌లో ఉంటారో ఉండ‌రో తెలీదన్న‌ట్టు ఉంటారు. హాజ‌రు వేయించుకోవ‌డానికి మాత్ర‌మే ఆయ‌న వ‌స్తున్న‌ట్టు మౌనంగా మిగిలిపోతున్నారు. ఒక్కోసారి మాట్లాడినా కూడా ఆయ‌న సొంత అజెండా ఆయ‌న‌ది. మ‌రో టీడీపీ స‌భ్యుడు సండ్ర గొంతు వినిపించిందే లేదు. ఇక మిగిలింది రేవంత్ రెడ్డి. ఒక్క స‌భ్యుడిని కంట్రోల్ చేయ‌డం అధికార పార్టీ స‌భ్యుల‌కు ఏమంత పెద్ద విష‌య‌మా చెప్పండీ..?

ఇక‌, ప్ర‌తిప‌క్షాల్లో మిగిలిన‌వి భాజ‌పా, ఎమ్‌.ఐ.ఎమ్‌.లు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో తెరాస‌తో భాజ‌పా అప్ర‌క‌టిత మిత్ర‌ప‌క్షం పాత్ర పోషించాల్సి వ‌స్తోంది. పైనుంచి ఎలాంటి సంకేతాలు వ‌స్తున్నాయో ఏమోగానీ, ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల్ని త‌గ్గించేశారు భాజ‌పా నేత‌లు. రాష్ట్రంలో ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీతో ఫ్రెండ్లీగా ఉండ‌టం ఎమ్‌.ఐ.ఎమ్‌.కు ఎప్ప‌ట్నుంచో అల‌వాటు. ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతున్నారు. సీపీఎంకి ఉన్న‌ది ఒక్క‌గానొక్క స‌భ్యుడు. ఆయ‌న గొంతు బ‌లంగా విన‌బ‌డే ప‌రిస్థితి లేదు. ఈ విధంగా ప్ర‌తిప‌క్షాల‌ను సునాయంగా త‌మ ప‌రిధిలోకి తెచ్చుకుని తెరాస బాగానే కంట్రోల్ చేస్తోంద‌ని చెప్పుకోవాలి. స‌భ వెలుప‌లే కాదు… స‌భ‌లో కూడా తెరాస పూర్తిస్థాయిలో ప‌ట్టు సాధించింద‌ని అనాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close