ఎన్నికలపై ఫైనల్ నిర్ణయం ఎస్‌ఈసీదే : హైకోర్టు

స్థానిక ఎన్నికల విషయంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్‌దే తుది నిర్ణయం అని ఏపీ హైకోర్టు తేల్చేసింది. ఎన్నికలు నిర్వహించకుండా నిలిపివేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు రూలింగ్ ఇచ్చింది. కరోనా కారణంగా ఎన్నికల వాయిదా విషయంపై.. ఎన్నికల కమిషన్‌కే లేఖ రాయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ప్రభుత్వ విజ్ఞప్తిని ఎన్నికల కమిషన్ పరిశీలిస్తుందని తెలిపింది. కరోనా వ్యాక్సిన్, స్థానిక ఎన్నికలు రెండూ ప్రజలకు సంబంధించినవేనని.. దీనిపై రెండు పక్షాలు కూర్చోని మాట్లాడుకుంటే బాగుంటుందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

అలా కాకపోతే ముగ్గురు అధికారులను ఎస్ఈసీ వద్దకు పంపాలని.. కమిషన్‌తో అధికారుల భేటీపై ఎస్‌ఈసీ ఒక వేదికను ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రభుత్వ అధికారులు వారి వాదనను కమిషన్ ముందు వినిపించాలని తెలిపింది. ఈ చర్చల అనంతరం ఎస్ఈసీ ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఇప్పటికే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చామని గుర్తు ధర్మాసనం గుర్తు చేసింది. హైకోర్టు తాజా ఆదేశాలతో ఎన్నికల నిర్వహణ పూర్తిగా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేతుల్లోనే ఉంది. హైకోర్టు చెప్పినట్లుగా ప్రభుత్వ వాదన వినడానికి ఆయన సిద్ధంగా ఉండాలి. అది విన్న తర్వాత ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకోవాలి.

ఒక వేళ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ఆయన అనుకుంటే.. మాత్రం… అడ్డు చెప్పడానికి ప్రభుత్వానికి చాన్స్ ఉండదు. సహకరిస్తారా లేదా.. అన్నదానిపై తర్వాత పరిణామాలు ఆధారపడి ఉంటాయి. పలు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు కూడా నిరాకరిచింది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం.. అధికారులు సహకరించడం లేదని.. దిక్కరణ చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close