ఫ్యాన్స్ తో మీటింగ్ పెట్టిన ఎన్టీఆర్‌

అప్పుడ‌ప్పుడూ స్టార్ హీరోలు అభిమానుల‌తో మీటింగ్ పెట్ట‌డం మామూలే. సాధార‌ణంగా సినిమా విడుద‌ల‌కు ముందు.. వాళ్ల‌ని పిలిచి, ముచ్చ‌ట్లు జ‌రిపి పంపిస్తుంటారు. అయితే ఈసారి ఎన్టీఆర్ కాస్త ముందుగానే మేల్కొన్న‌ట్టు తెలుస్తోంది. అభిమానుల్ని ముంద‌స్తుగా పిలిచి.. వాళ్ల‌తో మాట్లాడి, ఫొటోలు దిగి మ‌రీ వాళ్ల‌ను సంతృప్తి ప‌రుస్తున్నాడు. ఎన్టీఆర్ – కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న జ‌న‌తా గ్యారేజ్ షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ సార‌ధి స్టూడియోలో జ‌రుగుతోంది. ఈ సెట్‌కి త‌న అభిమానుల్ని ఆహ్వానించాడు ఎన్టీఆర్‌. సోమ‌, మంగ‌ళ వారాలు కృష్ణ‌, గుంటూరు, విశాఖ జిల్లాల నుంచి అభిమానులు వ‌చ్చారు. వాళ్ల‌తో ఎన్టీఆర్ కాసేపు స‌ర‌దాగా గ‌డిపాడు. వాళ్ల‌తో ఫొటోలు దిగాడు.

ఈ సినిమా కోసం సార‌ధిలో ఓ ప్ర‌త్యేక‌మైన సెట్ వేశారు. దాని విలువ దాదాపుగా రూ.2 కోట్ల‌పైమాటే. ఆ సెట్‌లో స‌న్నివేశాలు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. అందుకే.. అభిమానుల్ని ఆ సెట్‌లోనే క‌లుసుకోవాల‌నుకొన్నాడ‌ట‌. వెంట‌నే అభిమానులకు ఆహ్వానాలు అందిపోయాయి. ‘ఇక నుంచి రెగ్యుల‌ర్‌గా ట‌చ్‌లో ఉందాం..’ అని అభిమానుల‌కు మాటిచ్చాడ‌ట బాద్ షా. ఈ మీటింగ్ వెనుక రీజన్ ఇదేనా, లేదంటే వేరే రాజ‌కీయ ప‌ర‌మైన కార‌ణాలేమైనా ఉన్నాయా అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. అయితే ఎన్టీఆర్ మాత్రం.. కేవ‌లం సినిమా విశేషాలు మాత్ర‌మే ముచ్చ‌టించి పంపిన‌ట్టు భోగ‌ట్టా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో ఇంత డబ్బు.. నోట్లు ఎలా ?

ఏపీలో నోట్ల విశ్వరూపం కనిపిస్తోంది. ప్రతీ పార్టీ ఓటర్‌కు డబ్బులు పంపుతోంది. ప్రతి ఓటర్ కు నాలుగు ఐదు వందల నోట్లు చేరుతున్నాయి. యావరేజ్ గా .. ఓటుకు రెండు వేలు ఖచ్చితంగా...

తల్లి సపోర్టూ లేని జగన్ – షర్మిలను గెలిపించాలని విజయలక్ష్మి పిలుపు

జగన్మోహన్ రెడ్డి సర్వం కోల్పోయారు. చివరికి తన తల్లి సపోర్టును కోల్పోయారు. వైసీపీని ఓడించి తన కుమార్తె షర్మిలను గెలిపించాలని ఆమె అమెరికా నుంచి వీడియో విడుదల చేశారు....

స్నేహితుడి కోసమే అర్జున్ – కానీ వాడేసిన వైసీపీ

హీరో అల్లు అర్జున్ నంద్యాల పర్యటన కలకలం రేపింది. అల్లు అర్జున్ తో పాటు ఆయన భార్య స్నేహకు చాలా కాలం నుంచి మంచి మిత్రుడు అయిన రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎదురీదుతూండటంతో...

కేసీఆర్ కు పెద్దపల్లి ఒక్క సీటుపైనే ఆశా..?

ఇటీవల పదేపదే పెద్దపల్లి సీటును గెలుస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించడం ఆసక్తికరంగా మారుతోంది. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 14 - 15 స్థానాలను గెలవబోతుందని ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన కేసీఆర్ ఇటీవల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close