చ‌ర‌ణ్‌బాబూ… కాపీ కొట్టావా నాయినా

ఈమ‌ధ్య రామ్‌చ‌ర‌ణ్ కొత్త సినిమా ధ్రువ ఫ‌స్ట్ లుక్ అంటూ ఓ పోస్ట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. చెర్రీ ఫొటోపై అంకెలూ, గ‌ణిత సూత్రాలూ క‌నిపించే స‌రికి… ‘సినిమా క‌థ‌కి త‌గ్గ‌ట్టు భ‌లే డిజైన్ చేశార్రా బాబూ’ అని అంద‌రూ అటు సురేంద‌ర్‌రెడ్డినీ, ఇటు రామ్‌చ‌ర‌ణ్ నీ తెగ మెచ్చుకొన్నారు. అయితే.. ఆ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ శుద్ద కాపీ అని తేలింది. ఈ పోస్ట‌ర్ ఇన్‌ఫినిటీ అనే ఓ బాలీవుడ్ చిత్రం పోస్ట‌ర్‌ని పోలి ఉంది. ”పోలిక‌లు కాదు.. రెండూ ఒక‌టే. ఆ పోస్ట‌ర్‌నే కాపీ కొట్టారు” అంటూ విమ‌ర్శ‌కుల కాస్త గ‌ట్టిగానే చెబుతున్నారు. రెండు పోస్ట‌ర్లూ ప‌క్క‌ప‌క్క‌న పెట్టి చూస్తే అదే అనిపిస్తోంది కూడా.

ఇప్ప‌టికిప్పుడు ధృవ పోస్ట‌ర్‌ని అర్జెంటుగా విడుద‌ల చేయాల్సిన అవ‌స‌రం ఏం రాలేదు. జ‌స్ట్ ఫ్యాన్స్‌ని కాస్త థ్రిల్ చేద్దామ‌ని సోష‌ల్ మీడియాలో జ‌స్ట్ అలా వ‌దిలారంతే. చూడ‌గానే బాగా న‌చ్చేసింది. చూడ‌గా చూడ‌గా.. ఎక్క‌డ నుంచి కాపీ కొట్టారో తెలిసింది. దీనికి సురేంద‌ర్ రెడ్డి అండ్ టీమ్ ఎలా స్పందిస్తారో చూడాలి. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే షూటింగ్ ఆల‌స్యం అవ్వ‌డంతో ఇక ఎలాంటి బ్రేకులూ లేకుండా ఈ సినిమా షూటింగ్ ముగించాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంద‌ట‌. ద‌స‌రా బ‌రిలో ఈ సినిమాని నిల‌పాల‌న్న‌ది ద‌ర్శ‌క నిర్మాత‌ల ఆలోచ‌న‌. అప్ప‌టికి ఈ సినిమా సిద్ధం చేయాలంటే.. రాత్రీంబ‌వ‌ళ్లూ క‌ష్ట‌ప‌డాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో ఇంత డబ్బు.. నోట్లు ఎలా ?

ఏపీలో నోట్ల విశ్వరూపం కనిపిస్తోంది. ప్రతీ పార్టీ ఓటర్‌కు డబ్బులు పంపుతోంది. ప్రతి ఓటర్ కు నాలుగు ఐదు వందల నోట్లు చేరుతున్నాయి. యావరేజ్ గా .. ఓటుకు రెండు వేలు ఖచ్చితంగా...

తల్లి సపోర్టూ లేని జగన్ – షర్మిలను గెలిపించాలని విజయలక్ష్మి పిలుపు

జగన్మోహన్ రెడ్డి సర్వం కోల్పోయారు. చివరికి తన తల్లి సపోర్టును కోల్పోయారు. వైసీపీని ఓడించి తన కుమార్తె షర్మిలను గెలిపించాలని ఆమె అమెరికా నుంచి వీడియో విడుదల చేశారు....

స్నేహితుడి కోసమే అర్జున్ – కానీ వాడేసిన వైసీపీ

హీరో అల్లు అర్జున్ నంద్యాల పర్యటన కలకలం రేపింది. అల్లు అర్జున్ తో పాటు ఆయన భార్య స్నేహకు చాలా కాలం నుంచి మంచి మిత్రుడు అయిన రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎదురీదుతూండటంతో...

కేసీఆర్ కు పెద్దపల్లి ఒక్క సీటుపైనే ఆశా..?

ఇటీవల పదేపదే పెద్దపల్లి సీటును గెలుస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించడం ఆసక్తికరంగా మారుతోంది. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 14 - 15 స్థానాలను గెలవబోతుందని ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన కేసీఆర్ ఇటీవల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close