ముంచేసి సారీ చెప్తే సరిపోతుందా సీఎం సారు..!?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారీ చెప్పారు. తెలియక తప్పు చేసి ఉంటే మీ బిడ్డగా మన్నించాలని కోరారు. ఆయన ఇంతగా పశ్చాత్తాప పడటానికి కారణం.. కడప జిల్లాలో కట్టిన గండికోట ప్రాజెక్ట్ ముంపు బాధితులకు పరిహారం ఇవ్వకుండా నీళ్లు నిల్వ చేయడం. అలా చేయడం వల్ల కొన్ని గ్రామాల్లో వందల మంది ప్రజలు నిలువ నీడ లేకుండా పోవడం. అలా పోయిన వారికి కనీస సాయం కూడా చేయకుండా.. తిరగబడిన వారిపై పోలీసు కేసులు పెట్టారు. అప్పుడు ఎలాంటి స్పందన వ్యక్తం చేయని ముఖ్యమంత్రి జగన్… ఇప్పుడు వారికి ఐయాం సారీ అని చెప్పి … సంతృప్తి పరిచే ప్రయత్నం చేశారు.

కడప జిల్లా వైఎస్ ఫ్యామిలీ పట్టులోనే ఉన్నప్పటికీ.. గండికోట నిర్వాసితులకు పునరావాస కాలనీల నిర్మాణం దశాబ్దాలుగా సాగుతూనే ఉంది. గండికోటలో ఏటేటా పెరుగుతున్న నీటి నిల్వల తాకిడికి నిర్వాసిత గ్రామాలు ఒక్కొక్కటిగా ముంపుబారిన పడుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే గండికోట నిర్వాసితులకు రూ.10 లక్షల వరకు చెల్లింపులు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. తర్వాత పట్టించుకోలేదు. ఇటీవల నీళ్లు నింపడం ప్రారంభించడంతో తాళ్లపొద్దుటూరు లాంటి గ్రామాలు నీట మునిగాయి. గండికోట నిర్వాసితులందరికీ ఇళ్లస్థలాలు చూపించకుండా నీళ్లను నిల్వ చేయడం దుర్మార్గమని అక్కడి ప్రజలు కన్నీరు పెట్టుకున్నా పాలకులు కరుణించలేదు.

85 శాతం మందికి పైగా పరిహారం చెల్లింపులు చేశామని అధికారులు ప్రకటించారు. సాంకేతికత అవరోధాల కారణంగా కొంత మందికి పరిహారం పెండింగ్‌లో పడిందని చెబుతున్నారు. కానీ.. అనేక చోట్ల అనర్హుల్ని పరిహారం ఇచ్చే జాబితాలో చేర్చి.. డబ్బులు కాజేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఇలా ఓ వ్యక్తి ప్రశ్నించినందుకు ఓ హత్య కూడా జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో… నీరు చేరుతూనే ఉంది. వారికి ఎలాంటి సాయం చేయకుండా.. ముఖ్యమంత్రి సారీ చెప్పి సరి పెట్టారనే అసంతృప్తి మాత్రం అక్కడి ప్రజల్లో కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ధర్మారెడ్డి కోసం ఆలిండియా రూల్స్ మారిపోతాయ్ !

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరోసారి డిప్యూటేషన్ పొడిగించారు. రిటైరయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ ఆయన డిప్యూటేషన్ లోనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు...

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం బీజేపీ, బీఆర్ఎస్ వెదుకులాట!

బీఆర్ఎస్ ను చుట్టుముడుతున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. లోక్ సభ ఎన్నికలతో కిందా మీదా పడుతున్న సమయంలోనే మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రభావం చూపేలా మరో ఉపఎన్నిక వచ్చి పడింది....

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో అనుప‌మ‌

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ త‌న జోరు చూపిస్తోంది. టిల్లు స్క్వేర్‌తో హిట్టు కొట్టాక‌, ఆ ఉత్సాహం మ‌రింత‌గా పెరిగిపోయింది. వ‌రుస‌గా కొత్త సినిమాల‌పై సంత‌కాలు పెడుతోంది. తాజాగా బెల్లంకొండ శ్రీ‌నివాస్ తో జోడీ క‌ట్ట‌డానికి...

22మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ లోకి హరీష్..!?

బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హారీష్ రావు కాంగ్రెస్ లో చేరనున్నారా..? 20-22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరనున్నారని ప్రచారం జరుగుతుండగా..ఆ ఎమ్మెల్యేల వెనక బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close