పార్టీల భవితపై ‘గ్రేట్‌’ ప్రభావం

హైదరాబాదులో లేనందువల్ల ఎన్నికలపై వ్యాఖ్యానించడం కుదర్లేదు. నా కాలమ్స్‌ కామెంట్స్‌ చూస్తున్నవారికి జిహెచ్‌ఎంసి ఫలితాలు ఆశ్చర్యం కలిగించవు. తమకు వంద సీట్లు పైనే వస్తాయని ముఖ్యమంత్రి కెసిఆర్‌ పోలింగ్‌ రోజు రాత్రి అన్నట్టు ఒక ఎంపి చెప్పిన మాటలు నేను ఉటంకించాను. అలాగే టిఆర్‌ఎస్‌ అంతర్గత లెక్కల్లో ఎటు తిప్పి లెక్కించినా 92+ అని అంతకు ముందు ఒక పోస్టు ఇచ్చాను. . తెలంగాణ రాష్ట్ర రాజకీయ ప్రక్రియ ఈ ఫలితాలతో తారాస్థాయికి చేరింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా అసెంబ్లీలో అరవై దాటని కెసిఆర్‌ విమర్శలు ఎన్ని వస్తున్నా సరే రాజకీయ అస్థిరత్వం రాకుండా ఇతర పార్టీల వారిని చేర్చుకోవలసి వచ్చింది. వరంగల్‌ ఉప ఎన్నికతో రాజకీయ సత్తా చాటిన టిఆర్‌ఎస్‌ జిహెచ్‌ఎంసితో రెండవ పెద్ద అడుగు వేసింది. ఈ ఫలితం తెలుగు రాష్ట్రాలు రెండింటినీ ప్రభావితం చేస్తుంది. ఇది సహజ సిద్ధమైన ఫలితమే గాని ఆందోళనతోనో అభద్రతలోనే ఇచ్చిన విజయం కాదు.

ఈ ఎన్నికల్లో సీమాంధ్రుల ఓట్ల కోసం లేనిపోని సందేహాలు పెంచే ప్రయత్నం మంచిది కాదనీ పనిచేయదనీ నేను చాలాసార్లు చెప్పాను. ఈ మాటలు కొందరికి రుచించలేదు. విభజన తర్వాత ప్రశాంతంగా ఎవరి బతుకు వారు బతుకుతూ స్నేహపూర్వకంగా మెలగాలన్న భావనే రెండు చోట్ల వుంది. ఉద్రేకాలు రెచ్చగొట్టుకోవాలని అనుకోవడం లేదు. ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలున్నా ప్రాంతీయ పొరపొచ్చాలు కనిపించిన సందర్బాలు లేవు. కెసిఆర్‌ కూడా మొదట్లో పంథా మార్చుకున్నారు. కెటిఆర్‌ ఈ క్రమాన్ని పరాకాష్టకు తీసుకెళ్లడంలో ఫలప్రదమైనారు.

బాబు వర్సెస్‌ కెసిఆర్‌, టిఆర్‌ఎస్‌ వర్సెస్‌ టిడిపి అన్న పద్దతిలో చూసేట్టయితే టిఆర్‌ఎస్‌ స్పష్టమైన ఆధిక్యతతో ఆరంభించింది. చంద్రబాబు అర్థమనస్కంగా పోరాడుతున్న తీరును చాలాసార్లు చెప్పుకున్నాం. తెలుగుదేశం బిజెపి ఎప్పుడూ ఒక్కతాటిపై నిలవలేదు. లోకేష్‌ రేవంత్‌ రెడ్డి వంటివారి ప్రచార పొరబాట్లు పరిస్థితిని మరింత దిగజార్జాయి. హైదరాబాదును నేనే అభివృద్ధి చేశాననే చంద్రబాబు ప్రచారం 2004లోనూ దెబ్బతింది.ఇప్పుడు మరింత తిరస్కరణకు గురైంది. లోకేశ్‌ను లోకేష్‌ నేతగా నిలబెట్టేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం రాలేదు గాని ఆయన పాత్ర ఆమోదం పొందింది.

కొత్త రాష్ట్రం కొత్త ముఖ్యమంత్రి గనక కెసిఆర్‌ పట్ల కొంత అదనపు ఆసక్తి వుండటం సహజం. చంద్రబాబు తీరుతెన్నులు ఎంతమాత్రం ఉపయోగంగా లేవని కూడా టిటిడిపి నాయకులు బాహాటంగానే చెబుతూ వచ్చారు. ఈ ఫలితాల తర్వాత ఆ పార్టీ మరింత ఇబ్బందిలోపడుతుంది.చాలామంది సూట్‌కేసులు సర్దుకుని కూచున్నారు. ఈ ప్రభావం ఎపిలోనూ పడుతుంది. తాము దెబ్బతినడమే గాక హైదరాబాదులోని మిశ్రమ జనాభాకు ఒక విధమైన కృత్రిమ పరిస్థితిని తీసుకొచ్చారు తెలుగుదేశం నేతలు. కాపునాడు కల్లోలం ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి వంటివాటకిది తోడవుతుంది. పాలించే చోట సవాలక్ష సమస్యలు వదలేసి పనిచేయని పర్యటనలెందుకని రేపు స్వంతపార్టీవారే మరింతగా ప్రశ్నిస్తారు. మొదట్లో చంద్రబాబు టిటిడిపి నేతలకే ఎక్కువ సమయం కేటాయిస్తూ ఏదో ఆశించారు గాని ఇప్పుడు వారికీ ఆయనకూ కూడా ఆ విశ్వాసం నిలబడలేదు. బిజెపిలో భిన్న ధృవాలు, కేంద్రం పాత్ర, దేశమంతటా దానిపై పెరుగుతున్న వైముఖ్యం వంటివి కూడా ప్రభావం చూపాయి. అయితే ఇంత జరిగినా వారికి పాతిక శాతం వరకూ ఓటింగు వుండటం గమనించదగ్గది. కాంగ్రెస్‌ను గురించి కొత్తగా చెప్పవలసింది లేదు గాని మజ్లిస్‌ కోటలో కాస్తయినా అడుగు మోపేందుకు టిఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తుందా లేదా ధారదత్తం చేస్తుందా అనేది చూడాలి. ఇప్పటికైతే వారితో తలనొప్పి తెచ్చుకోకపోవచ్చునని మొన్నటి దాడులపట్ల అనుసరించిన ఉదాసీనతే స్పష్టం చేసింది.

ఈ విజయాన్ని బట్టి టిఆర్‌ఎస్‌ తిరుగులేని రాజకీయ శక్తి అయిపోయిందని కెటిఆర్‌ చేసిన వ్యాఖ్యలో ఆశ్చర్యం లేదు గాని చరిత్ర ఎన్నో ఘన విజయాలు గతంలోనూ చూసింది. కొన్ని వాగ్దానాలు కొన్ని వాస్తవాలు కొంత అనివార్యత కలసి ఈ తీర్పునకు దారి తీశాయని గుర్తించాలి. ఆకాశదారులు, అతిశయోక్తి వాగ్దానాల కన్నా తక్షణ సమస్యల పరిష్కారంపై శ్రద్ధ పెట్టాలి. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లపై ట్రిబుల్‌ ప్రచారంతోనే ప్రజలను ఆకర్షించేట్టయితే రేపు వారిలో నిరుత్సాహం కూడా అంతే త్వరితంగా వచ్చే అవకాశం వుంది. ఎందుకంటే జరిగే నిర్మాణం పరిమితంగానే వుంటుందని ఆ పార్టీ ఎంఎల్‌ఎలే చెబుతున్నారు.

చివరిది కాని కీలకమైంది- గతంలోని ఉద్రేకాలు పునరావృతం కావనే భరోసా ఇచ్చిన నాయకులు దాన్ని ఒక విధానంగా మార్చే ప్రక్రియ చేపట్టాలి. తెలుగువాళ్లు ఎవరైనా బెంగుళూరులోనో చెన్నైలోనో హాయిగా వున్నప్పుడు హైదరాబాదును స్వంత నగరంగా భావించేందుకు అభ్యంతరం వుండదని ఆచరణలో చాటిచెప్పాలి. గెలిచిన టిఆర్‌ఎస్‌ మాత్రమే గాక ఓడిన ప్రధాన పక్షాలు కూడా నమ్రత ప్రదర్శించాలి. ఎవరైనా సమస్యలపైన ఉద్యమాలు చేయాలి గాని సంకుచిత వివాదాలకు స్వస్తి చెప్పాలి.

బహుశా ఇప్పుడు టిఆర్‌ఎస్‌ ఫిరాయింపుదార్ల రాజీనామాలు ఆమోదింపచేసుకుని ఉప ఎన్నికల పర్వం ప్రారంభిస్తుంది. గతంలో వలెనే వాటిని గెలవడం తన ప్రాభవానికి సంకేతంగా చెబుతుంది. మెల్లమెల్లగా వచ్చే ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటుంది. జాతీయంగా ఏవైనా మార్పులు లేక అనూహ్య పరిణామాలు వస్తే తప్ప కెసిఆర్‌కు మరో అవకాశం వుంటుందనే రాజకీయ వర్గాలన్నీ అనుకుంటున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close