గోదావరి రైతులను ఎండగొట్టిన పట్టిసీమ

*గోదావరి రైతులను ఎండగొట్టిన పట్టిసీమ
*ఒడిస్సా నీరిస్తేనే రెండో పంట సాగు
*గోదావరి రైతుల్ని కొట్టి కృష్ణా రైతులకు పెట్టడమే నదుల సంధానమా
*100 శాతం సీట్లు గెలిపించిన నేల రుణం తీర్చుకోవడం ఇదేనా
*ఎమ్మెల్సీ ప్రశ్నలకు తలవంచుకున్న ఎమ్మెల్యే

ఒడిస్సాలో బలిమేల ప్రాజెక్టు నుంచి 20 టిఎంసిల నీరు విడుదల చేస్తేతప్ప గోదావరి డెల్టాల్లో రబీవరి పూర్తిగా సాగయ్యే అవకాశమే లేదు. విద్యుత్ ఇచ్చి నీళ్ళు తెచ్చుకుందాం అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనపై ఆంధ్రప్రదేశ్ అధికారులు ఒడిస్సా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే దీనిపై ఈ రోజు వరకూ ఒడిస్సా నుంచి రిప్లయ్ లేదు.

గోదావరి డెల్టాల కింద తూర్పుగోదావరి జిల్లాలో 5 లక్షల ఎకరాల్లో, పశ్చిమగోదావరి జిల్లాలో మరో 5 లక్షల ఎకరాల్లో రెండో పంటగా కూడా వరిసాగుచేస్తారు. ప్రస్తుతం నీటి అందుబాటుని బట్టి రెండున్నర లక్షల ఎకరాల్లో మాత్రమే ఇబ్బంది లేకుండా సాగుచేయవచ్చని అధికారులు చెబుతున్నారు.

కృష్ణానదిలో అనుసంధానం చేయడానికి పట్టిసీమ నుంచి ఎత్తిపోతల ద్వారా గోదావరి నీళ్ళను వదిలేయడమే ఇంతకు ముందెన్నడూ లేనంత నీటి కటకటకు కారణమని రైతులు చంద్రబాబు ని తిడుతున్నారు. మరో పార్టీకి చోటివ్వకుండా అన్ని అసెంబ్లీ సీట్లూ తెలుగుదేశానికే ఇచ్చిన పశ్చిమగోదావరి జిల్లా ప్రజల రుణం తీర్చుకోలేనని ముఖ్యమంత్రి పదేపదే చెబుతూంటారు. అంత మేలుచేసిన ఈ జిల్లానుంచి గోదావరి నీళ్ళను కృష్ణా జిల్లాకు తరలించడమే రుణం తీర్చకోవడమా అని బండబూతులు తిడుతున్నారు.

వరినాట్లకు నీరివ్వాలని రైతులు పాలకొల్లులో ఆందళన చేసినపుడు వారికి మద్దతు ఇవ్వడానికి తెలుగుదేశం ఎమ్మెల్ల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆశిబిరం వద్దకు వెళ్ళి రైతులకు అనుకూలంగా నినాదాలు చేశారు. మద్దతు ఇవ్వడానికే అక్కడికి వెళ్ళిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మల్సీ మేకా శేషుబాబు ”ఏం నాటకాలు ఆడుతున్నారా ఇక్కడ నీళ్ళు కృష్ణాకు ఎత్తిపోస్తున్నపుడు మీ నాయకుడికి సమస్య చెప్పడానికి నోరుపడిపోయిందా? ఉన్న నీళ్ళనే ఎత్తుకుపోయిన మీ నాయకుడికి నీతి వుందా? కృతజ్ఞత అంటే ఇదేనా …”అని ఏదేదో మాట్లాడటంతో ఉద్రిక్తత పెరిగింది. క్రమంగా రేతులందరూ శేషుబాబునే సమర్ధించడంతో రామానాయుడు మౌనంగా వెళ్ళిపోక తప్పలేదు.

అసాధారణ రీతిలో రోజు రోజుకూ గోదావరి నీటి ప్రవాహం తగ్గుతోంది. నది చరిత్రలో ఎప్పుడులేని విధంగా డిసెంబరులోనే ఇసుక మేటలు బయట పడ్డాయి. గోదావరి డెల్టాలో రబీ వరిసాగుకు సీలేరు బైపాస్‌ జలాలపై ఆధారపడినా ఆ నీటి లభ్యత కూడా ఆందోళనలో పడటంతో సాగు ప్రశ్నార్థకంగా మారింది. నీరు లేక నారుమళ్ళ రంగు మారిపోవడంతో రబీ సాగు డోలాయ మానంలో పడింది. ఒడిశాలోని బలిమేల ప్రాజెక్టు నుంచి జలాలను సీలేరు మీదుగా గోదావరికి తరలించి డెల్టా రబీ వరి పంటను కాపాడుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రాలేదు.

పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించడం వల్లే రబీ సీజన్‌లో ఉభయ గోదావరి రైతులకు సాగునీటి కష్టాలు ఏర్పడ్డాయన్న విమర్శలు గట్టిగా వున్నాయి. గోదావరిలో 14 మీటర్ల నీటి మట్టం ఉన్నప్పుడు మాత్రమే పట్టిసీమ ద్వారా నీటిని కృష్ణా డెల్టాకు తరలించాలన్నది నిబంధన. అయితే 14 మీటర్ల కంటే తక్కువ నీరు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం నిబంధనలను కాలరాసి కృష్ణా డెల్టాకు నీటిని తరలించడం బహిరంగ రహస్యమే. గోదావరి డెల్టాలో పూర్తి ఆయకట్టులో (ఉభయ గోదావరి జిల్లాలు) దాళ్వా సాగుకు అనుమతి ఇస్తామని ప్రభుత్వం భరోసా ఇవ్వడంతో వరిసాగుకు సిద్ధమైన రైతులను తాజా పరిణామాలు కలవరపెడుతున్నాయి. రబీ కోసం గోదావరి డెల్టా రైతులు సీలేరు జలాలపై ఆధారపడడం దశాబ్ధాలుగా ఆనవాయితీగా వస్తుంది. సీలేరులో వున్న కాస్తనీటినీ గోదావరిలోకి వదిలేస్తే విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతుంది

సీలేరు నుంచి విడుదలయ్యేనీరు గోదావరి డెల్టాల్లో రబీ సాగుని ఆదుకునేది. పుష్కరాలలో ఘాట్లు మునిగేలా నీటి మట్టాన్ని పెంచడానికి నీటిని వదిలేయవలసి వచ్చింది. మరోవైపు పట్టిసీమ ఎత్తిపోతలవల్ల దిగువకు ప్రవాహమే లేకుండా పోయింది. ఒడిస్సా లోని బలిమేల ప్రాజెక్టనుంచి గోదావరికి నీరు వస్తే తప్ప వరినాట్లే పూర్తిగా పడని అవస్ధ ఏర్పడింది

గోదావరి జిల్లాల్లోని పరిశ్రమలకు సరఫరా చేస్తున్న గోదావరి జలాలను మంగళవారం నుండి జలవనరుల శాఖ అధికారులు నిలిపివేశారు. నీటి ఎద్దడి తీవ్రతకు ఇంతకు మించిన ఉదాహరణ అవసరంలేదు.పరిశ్రమలకు సరఫరా చేస్తున్న నీటితోపాటు బ్యారేజికి ఎగువన ఉన్న వివిధ ఎత్తిపోతల పథకాలు, పంపింగ్ స్కీంలను ఇప్పటికే నిలిపి వేశామని, విశాఖ నగర పాలక సంస్థకు తాగునీటిని సరఫరా చేస్తున్న విస్కో ఎత్తిపోతల పథకాన్ని కూడా నిలిపి వేశామనీ ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ ఎస్‌ఇ ఎన్ సుగుణాకరరావు చెప్పారు.

పంట పొలాల నుండి డ్రెయిన్లలోకి వెళ్లిన నీటిని తిరిగి వినియోగించుకునేందుకు వీలుగా 600 చోట్ల అడ్డుకట్టలు ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, దీనికి సుమారు 4.5 కోట్ల రూపాయలు ఖర్చవుతుందన్నారు. అలాగే దొంగరావిపాలెం, వేమగిరి, వెలిచేరు, తాతపూడి తదితర 14 ప్రాంతాల్లో పంపులు ఏర్పాటుచేసి గోదావరి జలాలను పంపింగ్ చేసేందుకు 4.80 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close