టీడీపీ యాప్‌లో ఉన్న ఓటర్ల జాబితా అన్ని పార్టీలకూ ఇచ్చేదేనన్న ఏపీ సీఈవో..!

తెలంగాణ పోలీసులు ఏ ఉద్దేశంతో డేటా చోరీ అంటున్నారో కానీ.. అది.. ఆంధ్రప్రదేశ్ అధికారవర్గం అసహనానికి గురవుతోంది. అసలు టీడీపీ యాప్‌లో.. ప్రజలకు సంబంధించి.. రహస్యంగా ఉంచాల్సిన ఏ సమాచారం… ఏముందో చెప్పకుండా.. సైబరాబాద్ సీపీ సజ్జనార్ రాజకీయ నాయకుడిలా వ్యాఖ్యలు చేశారు. అందులో ప్రధానమైనది ఓట్ల తొలగింపు.టీడీపీ యాప్ ద్వారా ఓటర్ల తొలగింపు జరుగుతోందన్నట్లుగా మీడియా సమావేశంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్ చెప్పుకొచ్చారు. ఏపీలో ఓట్ల తొలగింపుపై యాభై కేసులు నమోదయ్యాయన్న సమాచారం ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై.. ఏపీ ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ అమరావతిలో స్పందించారు. అన్ని రాజకీయ పార్టీలకు.. ఓటర్ల జాబితా ఇస్తామని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలకు ఇచ్చే ఓటర్ల జాబితాను ఎడిట్ చేయలేరని తెలిపారు.ఏకపక్షంగా ఎక్కడ ఓట్లు తొలగించాలో నిరూపించాలని ద్వివేదీ వ్యాఖ్యానించారు.

ఐటీ గ్రిడ్ దగ్గర ఉన్న ఓటర్ల జాబితా… వారు చూసుకోవడానికే తప్ప.. ఓటర్ల డేటా బేస్‌ని మార్చడం సాధ్యపడదన్నారు. సజ్జనార్ చెబుతున్నట్లుగా.. ఓటర్ల డేటాబేస్‌లో… ఎడిట్ చేసుకోగల ఓటర్ల లిస్ట్.. టీడీపీ యాప్ లో ఉంటే ఎక్కడ నుంచో వచ్చిందో సజ్జనారే చెప్పాలని ద్వివేదీ వ్యాఖ్యానించారు. నిబంధనల ప్రకారం ప్రతీ రాజకీయ పార్టీకి ఓటర్ల జాబితా అందుతుందని.. ఈసీ వర్గాలు చెబుతున్నాయి. అందులో మార్పు చేర్పులు సాధ్యం కావు. కేవలం అవి రాజకీయ పార్టీలు సరి చూసుకోవడానికే ఇస్తారు. మార్పుచేర్పులు ఎదైనా ఎన్నికల అధికారులే చేస్తారు. టీడీపీ యాప్ ద్వారా ఓటర్లను తొలగించారన్నట్లుగా సజ్జనార్ వ్యాఖ్యలు చేయడంతో ఏపీ ఎన్నికల అధికారుల్లో కలకలం రేగింది. సైబరాబాద్ సీపీనే ఆ తరహా వ్యాఖ్యలు చేయడంతో… తన నిజాయితీపై మరక పడిందని ద్వివేదీ కలత చెందారని భావిస్తున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చిందో బయటపెట్టాలని ఆయన వ్యాఖ్యానించడం అందుకేనని అంటున్నారు.

నిజానికి తెలుగుదేశం పార్టీపై డేటా విషయంలో రాజకీయంగా ఆరోపణలు చేస్తున్నారని .. అందరూ అనుకుంటున్నారు కానీ అది మెల్లగా అధికారుల మీదకు వస్తోంది. రాజకీయ పార్టీలు ఆరోపణలు చేసుకున్నంత కాలం.. దీనిపై ఈసీ కానీ.. ఇతరులు కానీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. ఏకంగా ఇందులో తెలంగాణ పోలీసులు ఇన్వాల్వ్ కావడం .. నేరుగా.. ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని చెప్పడంతో.. ఏపీ సీఈవో స్పందించారు. ఇప్పుడు దీనిపై సైబరాబాద్ కమిషనర్ స్పందించాల్సి ఉంది. నిక్షిప్తంగా ఉన్న సమాచారం ఏదో.. ఎక్కడ్నుంచి వచ్చిందో.. ఆయన తేల్చాల్సి ఉంది. రాను రాను.. ఇది ఏపీ, తెలంగాణ సివిల్ సర్వీస్ అధికారుల మధ్య పోరాటంలా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే..రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తాయి. ఏదైనా తప్పు జరిగితే.. అది పూర్తిగా అధికారుల మీదకే వస్తుంది. వైఎస్ హయాంలో.. కోర్టుల చుట్టూ తిరుగుతున్న అధికారులే దీనికి సాక్ష్యం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close