వివేక్‌ను మళ్లీ టీఆర్ఎస్‌లోకి తెచ్చేందుకు హరీష్ ప్రయత్నం !

హుజురాబాద్ ఉపఎన్నిక సందర్భంగా ఎలాంటి చిన్న అవకాశాన్ని వదులు కోకూడదనుకుంటున్న టీఆర్ఎస్ .. వద్దనుకున్న నేతల్ని కూడా దగ్గరకు తీసుకుంటోంది. తాజాగా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామిని మళ్లీ పార్టీలోకి ఆహ్వానించేందుకు హరీష్ రావు ప్రత్యేకంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనతో రహస్యంగా సమావేశమైనట్లుగా టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మళ్లీ టీఆర్ఎస్‌లోకి వస్తే మంచి ప్రాధాన్యం ఇస్తామని ఆఫర్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాకా వెంకటస్వామికి అనుచరులు ఉన్నారు. దళిత వర్గాల్లో మంచి పట్టు ఉంది. అయితే ఆయన కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వివేక్ పలు సందర్భాల్లో పార్టీలు మారుతున్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ .. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్.. ఆ తర్వాత మళ్లీ టీఆర్ఎస్.. తర్వాత బీజేపీ ఇలా ఆయన రాజకీయ పరిభ్రమణం సాగుతోంది. మొదట్లో ఆయన టీఆర్ఎస్‌లో చేరినప్పుడు చాలా గౌరవం లభించింది. కానీ రాను రాను అది తగ్గిపోయింది. కేటీఆర్ అనుచరుల హవా ఎక్కువ కావడం.. కేటీఆర్ ఆయనను దూరం పెట్టడంతో ..గత ఎన్నికల్లో ఎంపీ టిక్కెట్ కూడా ఇవ్వలేదు.

పార్టీలో ఇతర నేతలతో ఆరోపణలు చేయించి… తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడమే కాకుండా కనీసం పార్టీ టిక్కెట్ కూడా ఇవ్వకపోవడంతో ఆయన బాగా నొచ్చుకున్నారు. వెళ్లి బీజేపీలో చేరారు. అయితే అక్కడా ఆయనకు గొప్ప ప్రాధాన్యతేమీ దక్కలేదు. కానీ కేంద్రంలో ఉన్న అధికార పార్టీ నేతగా ఆయనకు కాస్త గౌరవం దక్కుతోంది. ఈటల రాజేందర్‌ను బీజేపీలోకి తీసుకు రావడంతో వివేక్‌దే కీలక పాత్ర. అయితే ప్రస్తుతం బీజేపీలోనూ వర్గ పోరు నడుస్తోంది. బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలతో వివేక్‌కు సరిపడటంలేదన్న భావన ఉంది. తానుపార్టీలోకి తీసుకొచ్చిన ఈటలను గెలిపించడానికి అగ్రనేతలు ప్రయత్నించడం లేదన్న అసంతృప్తిలో ఉన్నారు. చివరికి ఆయన కూడా అంటీముట్టనట్లుగానే ఉంటున్నారు.

ఈ పరిణామాల నేపధ్యంలో వివేక్‌ను మళ్లీ టీఆర్ఎస్‌లో చేర్పించేందుకు హరీష్ మంతనాలు ప్రారంభించారు. అయితే తనను అవమానించి పంపేసినందున వివేక్ మళ్లీ ఆ పార్టీలో చేరుతారా లేదా అన్నదానిపైఅనేక సందేహాలు ఉన్నాయి. హరీష్ విషయంలోనే టీఆర్ఎస్‌లో అనేక సందేహాలు ఉన్నాయి. ఇక ఆయన ద్వారా మళ్లీ పార్టీలో చేరితే ఉపఎన్నికల తర్వాత భవిష్యత్ ఉండదని.. పట్టించుకునే వారు ఉండరన్న అభిప్రాయంతో వివేక్ అనుచరులు ఉన్నారంటున్నారు. హరీష్ ప్రయత్నాలు ఫలించకపోవడానికే ఎక్కువ చాన్సెస్ ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎలక్షనీరింగ్ : అంచనాల్ని అందుకోలేకపోయిన వైసీపీ

ఈ సారి ఎన్నికల్లో వైసీపీ డబ్బుల పండగ చేస్తుందని ఓటర్లు ముఖ్యంగా వైసీపీకి చెందిన ఓటర్లు నమ్మకంతో ఉన్నారు. పార్టీ ద్వితీయ శ్రేణి క్యాడర్ కు కూడా రూ....

మోడీ దృష్టిలో జగన్‌ విలువ అంతే !

మోడీకి దత్తపుత్రుడినని అందుకే తాను ఇలా ఉన్నానని జగన్ అనుకుంటూ.. సర్వ అరాచకాలకు పాల్పడ్డారు. కానీ మోడీ దృష్టిలో జగన్ కు గుర్తింపు ఆయన ఓ రాష్ట్ర సీఎం.. తాను...

కేసీఆర్ నాన్ సీరియస్ పాలిటిక్స్ !

పదవిలో ఉన్నప్పుడు.. తన వెనుక బలం, బలగం ఉన్నప్పుడు కేసీఆర్ చెప్పినవి చాలా మందికి బాగానే ఉన్నాయి. కానీ ఆయన సర్వం కోల్పోయాక.. పార్టీ ఉనికే ప్రమాదంలో...

లెట్స్ ఓట్ : బానిసలుగా ఉంటారా ? పాలకులుగానా ?

ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. అంటే ఓట్లేసే మనమే పాలకులం. ఈ మౌలిక సూత్రాన్ని విస్మరించే మన ప్రతినిధులు అంటే.. మనం ఎన్నుకున్న పాలకులు.. తామే మహారాజులం అన్నట్లుగా పెత్తనం చేస్తారు. ఓ మాట...

HOT NEWS

css.php
[X] Close
[X] Close