మెగా హీరోల ఫ్లాపుల హ్యాట్రిక్‌

టాలీవుడ్ లో మెగా హీరోల‌దే డామినేష‌న్‌. ఎందుకంటే ఆ ఇంట్లో ఏడెనిమిదిమంది హీరోలు ఉన్నారు. ప్ర‌తీ సీజ‌న్‌లోనూ ఏదో ఓ మెగా మూవీ వ‌స్తూనే ఉంటుంది. చిరు,పవ‌న్‌, చ‌ర‌ణ్‌, బ‌న్నీ.. ఇలా అంద‌రూ స్టార్లే. కాబ‌ట్టి… కొడితే బాక్సాఫీసు బ‌ద్ద‌లే. కానీ ఈ సీజ‌న్‌లో మెగా హీరోల‌కు అంత‌గా క‌ల‌సి రాలేదు. ప‌వ‌న్ క‌ల్యాణ్ `బ్రో`తో మొద‌లెడితే.. కాస్త పాజిటీవ్ టాక్ తో విడుద‌లైన ఈ సినిమా ఆ టాక్‌ని నిల‌బెట్టుకోలేక‌పోయింది. ఇమిటేష‌న్లు ఎక్కువై, అస‌లు క‌థ మూల‌కెళ్లింది. బిలో యావ‌రేజ్ స్థాయి ద‌గ్గ‌రే ఆగిపోయిన బ్రో… నిర్మాత‌ల‌కు న‌ష్టాల్ని మిగిల్చింది.

భోళా శంక‌ర్ ప‌రిస్థితి మ‌రీ దారుణం. చిరంజీవి – మెహ‌ర్ ర‌మేష్ కాంబోలో రూపొందించిన సినిమా ఇది. మెహ‌ర్ ఎప్ప‌టిలానే ట్రోలింగ్ మెటీరియ‌ల్ ఇవ్వడంలో స‌క్సెస్ అయ్యాడు. హిట్టూ, ఫ్లాపూ ప‌క్క‌న పెడితే, చిరంజీవిపై ఈసారి విమ‌ర్శ‌లు ఎక్కువ అయ్యాయి. చిరు త‌న వ‌య‌సుకి త‌గిన పాత్ర‌లు ఎంచుకోవాల‌ని, కుర్రాళ్ల‌లా క‌నిపించడం త‌గ్గించుకోవాల‌ని హితవులు ప‌లికారంతా. చిరు త‌ను చేయ‌బోతున్న సినిమాల విష‌యంలో పున‌రాలోచించుకొనే ప‌రిస్థితి వ‌చ్చింది. అంతే కాదు.. చిరు త‌న పారితోషికంలో కొంత భాగాన్ని నిర్మాత‌కు వెన‌క్కి ఇచ్చి ఆదుకొన్నాడు.

ఇప్పుడు గాండీవ‌ధారి అర్జున వంతు. వ‌రుణ్‌తేజ్ – ప్ర‌వీణ్ స‌త్తారు కాంబోలో రూపొందించిన చిత్ర‌మిది. యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా అంచ‌నాల్ని అందుకోలేక‌పోయింది. దాదాపు రూ.50 కోట్ల‌తో వ‌రుణ్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెతో రూపొందించిన సినిమా ఇది. నాన్ థియేట‌రిక‌ల్ రైట్స్ మిన‌హాయిస్తే… థియేట‌ర్ నుంచి క‌నీసం రూ.5 కోట్ల ఆదాయం కూడా రాని ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఆ లెక్క‌న వ‌రుణ్ ఖాతాలో ఓ భారీ డిజాస్ట‌ర్ ప‌డిన‌ట్టే.

ఈ ఫ్లాపుల మ‌ధ్య మెగా హీరో అల్లు అర్జున్‌కి జాతీయ ఉత్త‌మ న‌టుడి అవార్డు రావ‌డం ఒక్క‌టే కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించే విష‌యం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close