రింకు దుగ్గా చేసిన నేరమేంటి – సీఐడీ సంజయ్ చేయని తప్పేమిటి ?

రింకు దుగ్గా అనే ఐపీఎస్ ఆఫీసర్ని కేంద్రం బలవంతంగా రాజీనామా చేయించింది. ఆమెను సర్వీస్ నుంచి తొలగించింది. ఆమె చేసిన తప్పేమిటంటే.. ఢిల్లీలో తన ఇంటి దగ్గర ఉన్న ఓ స్టేడియాన్ని రాత్రి పూట ఇతర క్రీడాకారులెవరూ వాడుకోకుండా ఖాళీ చేయించి.. తన పెంపుడు కుక్కతో పాటు వాకింగ్ చేసేది. దీనిపై ఫిర్యాదులు రావడంతో విచారించి ఆమెను సర్వీస్ నుంచి తప్పించేందుకు రాజీనామా చేయించారు. ఇది వ్యక్తిగతంగా చేసిన తప్పిదం. మరి సర్వీసులో ఉద్దేశపూర్వకంగా తప్పులు చేస్తే ఎలా వదిలి పెడతారు ? అందునా కళ్ల ముందు కనిపస్తున్న తప్పులు ఉంటే ? కానీ పట్టించుకోరు.

ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ పూర్తి స్థాయిలో సర్వీస్ రూల్స్ ఉల్లంఘించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫిర్యాదు చేశారు. సర్వీస్ రూల్స్ అతిక్రమించి మ‌రీ సంజయ్ వైసీపీకి అనుకూలంగా ప‌నిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆల్ ఇండియ‌న్ స‌ర్వీస్ రూల్స్ మేర‌కు రాజ‌కీయ ప‌క్షపాతాలు లేకుండా ప‌నిచేయాల్సిన సీఐడీ చీఫ్ అన్నింటినీ ఉల్లంఘించార‌ని హోం మంత్రికి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. వైసీపీ కార్యక‌ర్త మాదిరిగా ప‌నిచేస్తున్న ఐపీఎస్ అధికారి సంజ‌య్, సీఎం వైఎస్ జ‌గ‌న్ కోసం ప్రతిప‌క్షాల‌పై బుర‌ద చ‌ల్లుతున్నారని ఫిర్యాదులో ఎంపీ రామ్మోహన్ నాయుడు లేఖలో పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తూ సీఐడీ చీఫ్ సంజయ్ వ్యవహరిస్తున్నారని రామ్మోహన్ నాయుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. సర్వీస్ రూల్స్ అతిక్రమిస్తున్నారు అని ఆరోపించారు.ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ప్రకారం రాజకీయ పక్షపాతం లేకుండా పనిచేయాల్సిందిపోయి అన్నింటిని ఉల్లంఘిస్తున్నారని స్పష్టం చేశారు.

స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో ప్రతిపక్షనేత చంద్రబాబుని అరెస్టు చేసి విచార‌ణ చేయాల్సిన అధికారి, ఎటువంటి విచార‌ణ జ‌ర‌ప‌కుండానే స‌ర్వీసు నిబంధ‌న‌ల‌కి వ్యతిరేకంగా దేశ‌వ్యాప్తంగా ప్రెస్ మీట్లు పెడుతూ ఆరోప‌ణ‌లు చేయ‌డం తీవ్రమైన నేరంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ద‌ర్యాప్తులో గోప్యంగా ఉంచాల్సిన అంశాలను మీడియాకి విడుద‌ల చేస్తున్నారని ఫిర్యాదులో ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సీఐడీ చీఫ్ సంజ‌య్ ఉల్లంఘించిన స‌ర్వీస్ రూల్స్, అతిక్రమించిన నిబంధ‌న‌లు ఆధారాల‌ను హోం మంత్రికి ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు పంపించార‌ు. సీఐడీ చీఫ్ సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

అయితే సీఐడీ సంజయ్ ఇలా సర్వీస్ రూల్స్ ఇప్పుడే కాదు.. మార్గదర్శి విషయంలోనూ ఉల్లంఘించారు. ఓ వ్యాపార సంస్థపై ఐపీఎస్ అధికారి అన్ని విషయాలు బహిరంగంగనే ఉన్నాయి. కానీ రింకూ దుగ్గా వ్యక్తిగత అవసరాల కోసం అధికార దుర్వినియోగం చేస్తే రాజీనామా చేయించారు.. మరి సీఐడీ సంజయ్ కు ఎలాంటి శిక్ష వేయాలి ?. ఎందుకీ వివక్ష

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close