మోడీ, జైట్లీ పుట్టి ముంచుతున్న మాల్యా..! రాజీనామాకు రాహుల్ డిమాండ్..!!

దేశం విడిచి వెళ్లిపోయే ముందు.. అరుణ్ జైట్లీకి చెప్పానన్న విజయ్ మాల్యా ప్రకటన ఇప్పుడు కేంద్రానికి చిక్కులు తెచ్చి పెడుతోంది. దీనికి సంబంధించి ఒక్కొక్క విషయం బయటకు వస్తోంది. మాల్యా సొంత విమానంలో పారిపోవడానికి..లుక్‌అవుట్ నోటీసుల్లో మార్పు చేసి… మరింతగా కేంద్రంలోని పెద్దల నుంచి సహకారం అందిందనే విషయం తాజాగా బయటకు వచ్చింది. ఓ వైపు సీబీఐ విచారణ జరుగుతుండగానే మాల్యా విదేశాలకు పరారయ్యాడు. ఎలా పరారయ్యారన్న దానిపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2015లో సీబీఐ జారీచేసిన లుక్‌అవుట్ నోటీస్ పైనే ఇప్పుడు అందరి దృష్టి పడింది. కేంద్ర ఆర్ధిక శాఖ నుంచి “ఓ ప్రముఖుడి” ఆదేశాల మేరకు లుక్‌అవుట్ నోటీసును మార్చడం వల్లే విజయ్ మాల్యా దర్జాగా తప్పించుకున్నారు. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి బయటపెట్టారు.

బీజేపీ ఎంపీ చేసిన ప్రకటన… కేంద్రాన్ని మరింతగా గందరగోళంలో పడేసింది. ఓ అధికారి పొరపాటున చేసిన “తప్పిదాన్ని” మాత్రమే సరిదిద్దామని.. కావాలని చేయలేదని.. సీబీఐ వర్గాలు మీడియాకు వివరణ ఇస్తున్నాయి. విజయ్‌మాల్యా ఆర్ధిక అవకతవకలపై విచారణ జరుపుతున్న సీబీఐ తొలుత 2015 అక్టోబర్ 16న నోటీసులు జారీచేసింది. ఆయన భారత్ విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తే అదుపులోకి తీసుకోవాలంటూ అందులో పేర్కొంది. అయితే నవంబర్ 24న ఈ లుక్‌అవుట్ సర్క్యులర్ ను మార్చి మళ్లీ కొత్తగా జారీచేసింది. విజయ్ మాల్యా దేశం విడిచి వెళ్లేందుకు ఏ ఎయిర్‌పోర్టుకు వచ్చినా కేవలం సమాచారం ఇవ్వాలనీ, ఆయన ప్రయాణాన్ని యథాతథంగా కొనసాగనివ్వాలని దాని సారాంశం. ఈ మార్పు కారణంగానే.. విజయ్ మాల్యా ఎగిరిపోగలిగారు.

మరో వైపు.. అరుణ్ జైట్లీతో.. పార్లమెంట్‌లో… విజయ్ మాల్యా.. అరగంటకుపైగా సమావేశమయ్యారని… కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి జైట్లీ అన్నీ అబద్దాలు చెబుతున్నారంటున్నారు. కావాలంటే.. సీసీ ఫుటేజీ తీయాలని డిమాండ్ చేస్తున్నారు. తప్పు చేసిన జైట్లీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు… తమపై వస్తున్న ఆరోపణల్ని.. ఎలా సమర్థించుకోవాలో తెలియక.. బీజేపీ తంటాలు పడుతోంది. మాల్యాను… మీరే ప్రొత్సహించారంటూ.. కొత్త కొత్త అంశాలతో ఆరోపణలు ప్రారంభించారు. కానీ… అసలు వ్యవహారం మొత్తం ఇప్పుడు బీజేపీ.. జైట్లీ చుట్టూనే తిరుగుతోంది. మాల్యా ఎగిరిపోవడానికి కారణం .. జైట్లీనేనా అన్న అనుమానాలు కొత్తగా ప్రారంభమయ్యాయి. మొత్తానికి మాల్యా లండన్‌లో ఉండి.. ఇక్కడి రాజకీయాల్లో పెద్ద చిచ్చే పెట్టారనుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైద‌రాబాద్ లో భూమి కొన్న మైక్రోసాఫ్ట్…

ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల నుండి మైక్రోసాఫ్ట్ ఆఫీసులు ప‌నిచేస్తుండ‌గా, అతిపెద్ద డేటా సెంట‌ర్ ను...

‘స్వ‌యంభూ’ యాక్ష‌న్‌: 12 రోజులు… రూ.8 కోట్లు

'కార్తికేయ 2'తో నిఖిల్ ఇమేజ్ మొత్తం మారిపోయింది. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇది వ‌ర‌కు రూ.8 కోట్లుంటే నిఖిల్ తో సినిమా చేసేయొచ్చు. ఇప్పుడు ఓ యాక్ష‌న్ సీన్...

నాని సైతం.. ప‌వ‌న్ కోసం

ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ స్థాపించి ప‌దేళ్ల‌య్యింది. మెగా ఫ్యామిలీ, కొంత‌మంది క‌మెడియ‌న్లు, ఒక‌రిద్ద‌రు ప‌వ‌న్ డై హార్డ్ ఫ్యాన్స్ త‌ప్ప‌, ప‌వ‌న్‌కు నేరుగా పొలిటిక‌ల్ గా స‌పోర్ట్ ఎవ‌రూ చేయ‌లేదు. దానికి...

కేసీఆర్‌కు ధరణి – జగన్‌కు టైటిలింగ్ యాక్ట్ !

తెలంగాణలో కేసీఆర్ ఎందుకు ఓడిపోయారు.. అంటే ప్రధాన కారణాల్లో ధరణి అని ఒకటి వినిపిస్తుంది. ఈ చట్టం వల్ల కేసీఆర్ , బీఆర్ఎస్ నేతలు భూములు దోచుకున్నారన్న ఓ ప్రచారం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close