ఓటు బ్యాంక్ వేటలో… వీళ్ల ఘోష వినేదెవరు !

ఓట్ల కోసం ఎంత నీచానికైనా దిగజారడమే నేటి రాజకీయం. అందుకే శవరాజకీయం చాలా ప్రాచుర్యం పొందింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ అనే దళిత విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతే సోమవారం రోజంతా మీడియాలో ఈ వార్తే కనిపించింది. ఇంతటి సంచలన ఘటన జరిగినప్పుడు ఓదార్పు పేరుతో మీడియా ముందు షో చేయడానికి రాజకీయ నాయకులకు బోలెడు అవకాశం. ఇంకేం, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆగమేఘాల మీద ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. క్యాంపస్ లో విద్యార్థులతో మాట్లాడారు. రోహిత్ తల్లిని ఓదార్చారు. కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. రాజకీయం చేయనంటూనే సరిగ్గా అదే పని చేశారు.

అంతటి ఫ్లోలో ఆయన ఓ విషయం విస్మరించారు. జనవరి 19 అంటే, సొంత దేశంలో పరాయి వారిగా దుర్భర జీవితం గడుపుతున్న కాశ్మీరీ పండితుల గురించి ఆలోచించే రోజని మాత్రం ఆయనకు గుర్తుకు రాలేదు. సాక్షాత్తూ ఆయన పూర్వీకులైన నెహ్రూ కుటుంబీకులూ కాశ్మీరీ పండితులే. ఈ విషయం కూడా ఆయనకు స్ఫురణకు రాలేదు.

ఎందుకు వస్తుంది? మైనారిటీలు, దళితులు అని భజన చేస్తే ఓట్లు పొందే అవకాశం ఉంటుందనేది నాయకుల లెక్క. హిందువుల గురించి, కాశ్మీరీ పండితుల గురించి ఆలోచించి ఏం లాభం? వాళ్లు ఎంత దుర్భరంగా బతికితే మనకేంటి? 24 గంటలూ సె్క్యులరిజం గురించి వల్లి పార్టీలన్నింటిదీ ఇదే వరుస.

జమ్ము కాశ్మీర్లో 1989 చివర్లో ఉగ్రవాదులకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఊళ్లకు ఊళ్లు తగలబడి పోయాయి. పాకిస్తాన్ నుంచి చొరబడ్డ ముష్కరులు ఇష్టా రాజ్యం చెలాయించారు. వేల మంది కాశ్మీరీ పండితులను ఊచకోత కోశారు. వందల మంది యువతులపై సామూహిక అత్యాచారం చేశారు. కంటికి నచ్చిన యువతులను ఎత్తుకు పోయారు. ప్రభుత్వం కళ్లప్పగించి చూస్తుంటే, టెర్రరిస్టులు మారణ కాండ సాగించారు.

ఇక ప్రభుత్వం తమకు రక్షణ కల్పించలేదని అర్థమైన నిస్సహాయ పండితులు, 1990 జనవరి 19న పెద్ద సంఖ్యలో తమ మాతృభూమి అయిన కాశ్మీర్ నుంచి వలస పోవడం మొదలుపెట్టారు. ఎక్కడ వీలైతే అక్కడ అనాథల్లా, శరణార్థుల్లా తలదాచుకున్నారు. జమ్ము, ఢిల్లీ, చండీగఢ్, ముంబై, ఇలా వీలైన చోట తలదాచుకున్నారు. అప్పటి నుంచి ఏవో ఉద్యోగాలు చేస్తూ అష్టకష్టాలు పడుతూ జీవచ్ఛవాల్లా బతుకున్నారు. వారికి సాయం చేస్తామన్న ప్రభుత్వాలు మాట నిలబెట్టుకోలేదు. కాశ్మీర్ కు తిరిగి వస్తే పునరావాసం కల్పిస్తామని, భద్రత ఏర్పాటు చేస్తామని ప్రస్తుత మోడీ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. కానీ జరిగింది ఏమీ లేదు.

కాశ్మీర్లో పండితుల కుటుంబాలు విడివిడిగా ఉంటే మళ్లీ భద్రత సమస్య రావచ్చు. కాబట్టి గేటెడ్ కమ్యూనిటీ తరహాలో వేల ఇళ్లను ఒకే చోట నిర్మించి ఆవాసం కల్పిస్తామని, భారీగా సెక్యూరిటీ ఏర్పాటుచేస్తామని మోడీ ప్రభుత్వం ప్రతిపాదించింది. కాశ్మీర్లోని వేర్పాటు వాద అనుకూల పార్టీలు మాత్రం ఇందుకు ఒప్పుకోవడం లేదు. బీజేపీ, పీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఫ్తీ మహమ్మద్ సయీద్ మొదట ఈ ప్రదిపాదనకు అంగీకరించారు. తర్వాత మాట మార్చారు. దీంతో పండితులకు పునరావాసం కల్పిస్తామనే మోడీ హామీ ఇంత వరకూ నెరవేరలేదు.

ఆస్తులను వదులుకుని మాతృభూమికి దూరంగా 26 ఏళ్లుగా పరాయి చోట్ల కాందిశీకుల్లా బతుకుతున్న తమ సంగతి ఏమిటని సోమవారం నాడు జమ్ముతో సహా పలు చోట్ల పండిుతులు ప్రశ్నించారు. ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ప్లకార్డుల ద్వారా తమ బాధను వెల్లడించారు. అయినా రాజకీయ పార్టీలేవీ దీని గురించి పట్టించుకోలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కాశ్మీరీ పండితుల రక్షకులమని, జాతీయ వాదులమని చెప్పుకొనే బీజేపీ నేతలు కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఇక జాతీయ మీడియాకైతే రోహిత్ వార్త తప్ప దేశంలో మరో వార్తే కనిపించలేదు. ఒక్క ఎన్డీటీవీ మాత్రం ఈ అంశాన్ని హైలైట్ చేయడం కనిపించింది.

అంతేకదా. కారణాలు ఏవైనా, దళితుల పేరుతో ఓట్లను ఏరుకోవడం పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య. ఆ ఘటనల వెనుక వాస్తవాలు ఏమిటనేది వారికి అనవసరం. ఒక వైపు మాత్రమే చూడటం, రెండో వైపు వాస్తవాలను గుడ్డిగా విస్మరించడం పార్టీలకు పరిపాటి. కాశ్మీరీ పండితులను పట్టించుకుంటే ఏం లాభం? అందుకే 26 ఏళ్లుగా జీవచ్ఛవాల్లా బతుకుతున్న వారిని రాజకీయ పార్టీలు మర్చిపోయాయి. ఇంతకీ వాళ్లు ఈ దేశ పౌరులు కారా? ఈ ప్రశ్నకు జవాబు చెప్పే తీరికి మన నాయకులకు లేనే లేదు !!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close