భారత్ పాక్ ల మధ్య కొత్త “కుంపటి” రాజేస్తున్న బాస్మతి

కాశ్మీర్ మాదంటే మాది అంటూ భారత్ పాకిస్తాన్ లు 70 ఏళ్ళ నుండి కొట్లాడుకుంటూ ఉండడం చూశాం. రెండు దేశాల మధ్య సింధు జలాల ఒప్పందం ఉన్నప్పటికీ నదీ జలాల వాటా కోసం భారత్ పాకిస్తాన్ లు అప్పుడప్పుడు తగువాడుకోవడం చూశాం. కానీ గత కొంత కాలంగా బాస్మతి బియ్యం ఈ రెండు దేశాల మధ్య రాజేస్తున్న “కుంపటి” అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారడం ఆసక్తి కలిగిస్తోంది. బాస్మతి బియ్యం పై జియోగ్రాఫిక్ ఇండికేషన్ హోదా కోసం భారత్ దరఖాస్తు చేసుకోవడం తో, పాకిస్తాన్ ఎసరు కాగిన బాస్మతి బియ్యం లా కుతకుత లాడుతోంది. వివరాల్లోకి వెళితే..

అసలు బాస్మతి బియ్యం అంటే ఏంటి?

ఓస్ ఇది కూడా తెలియదా , బిర్యానీ లో వాడే పొడుగాటి బియ్యాన్ని బాస్మతి అంటారు అని చెబుదాం అనుకుంటారేమో, అలా కుదరదు. బాస్మతి బియ్యం అని పిలవాలంటే అది కొన్ని ప్రమాణాలకు లోబడి ఉండాలి. ఉదాహరణకి ఉడికించడానికి ముందు సుమారు 6.6 మిల్లీ మీటర్ల పొడవు, 2 మిల్లీ మీటర్ల వెడల్పు ఉండడం వంటివి. బాస్మతి అన్న హిందీ పదానికి సువాసన, పరిమళం అన్న అర్థం ఉంది. అప్పుడెప్పుడో అరబ్ మరియు ముస్లిం వర్తకులు మధ్య ఆసియా ప్రాంతానికి దీనిని తీసుకొచ్చారని, ఆ తర్వాత అప్పట్లో భారత ఉపఖండంలోని కొన్ని జిల్లాల్లో దీనిని పండించారని చెబుతుంటారు. అయితే బాస్మతి బియ్యం గురించిన ప్రస్తావన మొదటిసారిగా హీర్ రంజా అన్న 1766 నాటి రచనలో కనిపిస్తుంది. ఈ రచన లో ప్రస్తావించబడిన ప్రదేశాల ప్రకారం గనక చూస్తే, బాస్మతి పై జాగ్రఫిక్ ఇండికేషన్ భారత్ కి వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి

భారత్ పాకిస్థాన్ల కి బిలియన్ డాలర్ల రాబడి తెస్తోన్న బాస్మతి

భారత ఉపఖండంలో వందల సంవత్సరాలుగా సాగు అవుతున్న బాస్మతి బియ్యం, భారత్ తో పాటు పాకిస్తాన్ కు కూడా ఎగుమతుల రూపంలో గణనీయమైన ఆదాయాన్ని చాలా సంవత్సరాలుగా తీసుకొస్తోంది. గణాంకాల ప్రకారం భారత దేశానికి ఏటా సుమారు 7 బిలియన్ డాలర్లను బాస్మతి ఎగుమతుల ద్వారా సంపాదించి పెడుతోంది. అలాగే పాకిస్తాన్ కూడా సుమారు 2 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని బాస్మతి ఎగుమతుల ద్వారా రాబడుతోంది. ఇందులో సింహభాగం యూరోపియన్ యూనియన్ నుండే రెండు దేశాలకు వస్తోంది. దీనికి ప్రధాన కారణం 2006 సంవత్సరంలో యురోపియన్ యూనియన్ పాకిస్తాన్ లేదా భారత్ దేశాలనుండి వచ్చే బాస్మతి బియ్యం పై జీరో టారిఫ్ వెసలుబాటు ఇవ్వడమే. యూరోపియన్ యూనియన్ లోకి వచ్చే బాస్మతి లో మూడింట రెండు వంతులు కేవలం భారత్ మరియు పాకిస్తాన్ ల నుండే వెళుతోంది.

మరి భారత్ పాకిస్థాన్ల మధ్య బాస్మతి కారణంగా గొడవలు ఎలా మొదలయ్యాయి

యూరోపియన్ యూనియన్ లోకి ఇటీవలికాలంలో పాకిస్తాన్ నుండి వెళ్లే బాస్మతి ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. ఉదాహరణకి 2017లో పాకిస్తాన్ నుండి 120,000 మెట్రిక్ టన్నుల బాస్మతి యూరోపియన్ యూనియన్ కి ఎగుమతి అయితే, 2019 లో 300,000 మెట్రిక్ టన్నులు పాక్ నుండి ఎగుమతి అయ్యాయి. సహజంగానే ఇది భారతదేశాన్ని కలవరపెట్టింది. పైగా యూరోపియన్ యూనియన్ ఆ మధ్య తాము దిగుమతి చేసుకునే బాస్మతి బియ్యానికి సంబంధించిన ఎరువుల మరియు రసాయనాల ప్రమాణాల స్థాయి కఠినతరం చేయడంతో భారత్ నుండి యూరోపియన్ యూనియన్ కి బాస్మతి ఎగుమతులు తగ్గిపోయాయి. కానీ ఇరాన్, సౌదీ అరేబియా తో పాటు మరి కొన్ని మిడిల్ ఈస్ట్ దేశాలకు భారత్ బాస్మతి ఎగుమతులు ఇదే సమయంలో పెరగడం ఊరటనిచ్చింది. దీంతో యూరోపియన్ యూనియన్ లోకి ఎగుమతులు పెంచుకునే ఉద్దేశంతో, భారత్ బాస్మతి పై జియోగ్రాఫిక్ ఇండికేషన్ హోదా కోసం యూరోపియన్ యూనియన్ కి దరఖాస్తు చేసుకుంది. ఇది పాకిస్థాన్ కు సహజంగానే ఆగ్రహాన్ని తెప్పించింది

అసలు ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ? ఏంటి దీంతో ప్రయోజనాలు ఏంటి?

ఏదైనా ఒక ఉత్పత్తి ఒక భౌగోళిక ప్రాంతం నుండే ప్రధానంగా వస్తూ ఉంటే, ఆ ఉత్పత్తి కి , ఆ భౌగోళిక ప్రాంతానికి విడదీయలేని సంబంధం ఉంటే ఆ ఉత్పత్తి జియోగ్రాఫిక్ ఇండికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ జియోగ్రాఫిక్ ఇండికేషన్ ఖరారు అయితే మిగతా ఉత్పత్తులు ఆ ప్రాంతం పేరుతో మార్కెట్ చేసుకోవడానికి వీలు పడదు. ఉదాహరణకి తిరుపతి లడ్డు, వెంకటగిరి చీరలు, బందర్ లడ్డు , డార్జిలింగ్ టీ వంటివి జాగ్రాఫిక్ ఇండికేషన్ ట్యాగ్ పొంది ఉన్నాయి. డార్జిలింగ్ టీ కి జాగ్రఫీక్ ఇండికేషన్ ఖరారు అయిన తర్వాత ఆ ప్రాంతం నుండి వెళ్లే టీ ఉత్పత్తుల మార్కెట్ గణనీయంగా పెరిగింది. దీనికి కారణం డార్జిలింగ్ నుండి కాకుండా ఇతర దగ్గర ప్రాంతాల నుండి ఉత్పత్తి అవుతూ అప్పటివరకు డార్జిలింగ్ టీ పేరిట ప్రచారం చేసుకున్న ఉత్పత్తులు ఆ విధంగా ప్రచారం చేసుకునే అవకాశాన్ని కోల్పోవడమే . ఆ మధ్య ఇదే కారణంతో రసగుల్లా మీద జాగ్రఫిక్ ఇండికేషన్ హోదా కోసం బెంగాల్ మరియు ఒడిస్సా లు హోరాహోరీగా పోరాడుకున్నాయి. చరిత్ర పుటల నుండి ఎక్కడెక్కడి ఆధారాలనో తీసుకొని వచ్చాయి. చివరకు ఒడిశా పై బెంగాల్ నెగ్గిందనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ గనుక బాస్మతి మీద జియోగ్రాఫికల్ ఇండికేషన్ హోదాని భారత్ కు ఇస్తే యూరోపియన్ యూనియన్ ప్రాంతం లోకి పాకిస్తాన్ చేస్తున్న బాస్మతి ఎగుతులపై బలమైన ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో పాకిస్తాన్ కూడా దీని పై దీటు గా స్పందించాలని నిర్ణయించుకోవడంతో సమస్య జటిలంగా మారింది.

అయితే గతంలో కూడా పలుమార్లు భారత్ పాకిస్తాన్ ల మధ్య బాస్మతి కారణంగా వివాదాలు ఏర్పడినప్పటికీ, జాగ్రఫిక్ ఇండికేషన్ విషయంలో రెండు దేశాలు చర్చించుకుని రాజీ మార్గాన్ని అనుసరించాయి. కానీ ప్రస్తుతం మాత్రం రాజీ పడే అవకాశం లేనట్లు కనిపిస్తోంది. మరి మొత్తానికి బాస్మతి – ఇరు దేశాల మధ్య సత్సంబంధాల “పరిమళాన్ని” తీసుకువస్తుందా లేక ఇరు దేశాల సంబంధాలలో “బోన్” ఆఫ్ కన్ టెన్షన్ గా మిగిలిపోతుందా వేచిచూడాలి.

– Zuran (@CriticZuran)

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close