జీడీపీలో 100 శాతానికి భారత్ అప్పులు – మోదీ సర్కార్ ఘనత !

మోడీ ప్రభుత్వం చేస్తున్న ఇబ్బడిమబ్బడి అప్పులపై అంతర్జాతీయ ఎజెన్సీలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. భారత అప్పులు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. జీడీపీలో ప్రభుత్వ అప్పులు 100 శాతానికి మించొచ్చని హెచ్చరించింది. దీర్ఘకాల అప్పుల అధిక రిస్కులను ఎదుర్కోవడానికి భారత్‌కు గణనీయమైన పెట్టుబడులు అవసరమని ఐఎంఎఫ్‌ పేర్కొంది.

ఏడాది కాలం స్థూల దేశీయోత్పత్తి సమానమైన అప్పులను 100 శాతంగా భావిస్తారు. సమీప కాలంలో ప్రపంచ వృద్థి మందగమించడం ద్వారా భారత వాణిజ్యం ప్రభావితం కానుంది. సరఫరాలో లోపాలు తలెత్తడంతో కమోడిటీ ధరలు పెరుగొచ్చు.. దీంతో ఒత్తిడి పెరుగుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. 2005-06లో భారత జీడీపీలో అప్పులు 81 శాతంగా ఉండగా.. 2021-22 నాటికి 84 శాతానికి ఎగిశాయి. . ఆ తర్వాత 2022-23లో 81 వాతానికి తగ్గాయి.

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇటీవల అడ్డగోలుగా అప్పులు చేస్తోందన్న విమర్శలు ఎక్కువగా ఎదుర్కొంటోంది. 2023 సెప్టెంబర్‌ ముగింపు నాటికి భారతదేశ మొత్తం అప్పులు రూ.205 లక్షల కోట్లకు చేరాయి. ఇంతక్రితం మార్చి త్రైమాసికం నాటికి రూ.200 లక్షల కోట్ల అప్పులున్నాయి. అంటే మూడు నెలల్లోనే ఐదు లక్షల కోట్ల అప్పులు చేసినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని ఫోటో మాయం..కారణం అదేనా..?

ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమవ్వడం చర్చనీయాంశం అవుతోంది....

రేవంత్ కు నోటీసులు అంతా తూచ్..!!

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసు విషయంలో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు విషయంలో ఢిల్లీ పోలిసుల నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులే అందలేదు....

ఈవెంట్ కంపెనీ నిర్వాకం.. నిర్మాత‌ల‌కు త‌ల‌నొప్పులు

ఇండియాలోనే నెంబ‌ర్ వ‌న్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ అని చెప్పుకొనే ఓ సంస్థ చేసిన నిర్వాకం వ‌ల్ల‌, నిర్మాత‌ల‌కు త‌ల‌నొప్పులు మొద‌ల‌య్యాయి. పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్కాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అస‌లు మేట‌ర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close