ఇన్‌సైడ్ స్టోరీ: చ‌ర‌ణ్‌,ఎన్టీఆర్‌ల‌ను రాజ‌మౌళి ఎలా ఒప్పించాడు?

టాలీవుడ్‌లో రూపొందుతున్న మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌లు క‌థానాయ‌లుగా రూపొందుతున్న చిత్ర‌మిది. అటు ద‌ర్శ‌క ధీరుడు.. ఇటు ఇద్ద‌రు స్టార్ హీరోలు. ఒక‌రు మెగా ఇంటి నుంచి, మ‌రొక‌రు నంద‌మూరి వంశం నుంచి వ‌చ్చిన‌వాళ్లు. క‌నీవినీ ఎరుగ‌ని కాంబో ఇది. మ‌రి ఇది ఎలా సెట్ట‌య్యింది? రాజ‌మౌళి ఇద్ద‌రు హీరోల్ని ఎలా ఒప్పించాడు? ఇన్‌సైడ్ వ‌ర్గాల నుంచి సేక‌రించిన స‌మాచారం ప్ర‌కారం.. తెలుగు 360కి కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు తెలిశాయి.

ఓసారి రామ్‌చ‌ర‌ణ్‌ని త‌న ఆపీసుకు పిలిపించాడ‌ట రాజ‌మౌళి. ”నీ కోసం ఓ క‌థ రెడీ చేస్తున్నా.. ఇందులో ఇంకో హీరో కూడా ఉన్నారు.. అదెవ‌రో త‌ర‌వాత చెబుతా” అంటూ.. పంపించేశాడ‌ట‌. మ‌రోసారి ఎన్టీఆర్‌కి పిలుపు అందింది. ‘నీ కోసం ఓ క‌థ రాశా.. ఇందులో ఇంకో హీరో ఉన్నాడు’ అంటూ చ‌రణ్‌కి వేసిన క్యాసెట్టే ఎన్టీఆర్‌కీ వేశాడ‌ట రాజ‌మౌళి. ఈసారి ఇద్ద‌రినీ త‌న ఆఫీసుకు పిలిపించి.. ”నా క‌థ‌లో మీరిద్ద‌రే హీరోలు” అంటూ కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశాడ‌ట‌. ఎన్టీఆర్‌ని చూసేంత వ‌ర‌కూ చ‌ర‌ణ్‌కీ, చ‌ర‌ణ్‌ని చూసేంత వ‌ర‌కూ ఎన్టీఆర్‌కీ మ‌రో హీరో ఎవ‌రన్న‌ది తెలీద‌ట‌. ఆ క్ష‌ణంలో ‘నో’ చెప్పే ఛాన్సే లేదు. కాబ‌ట్టి.. ‘ఎస్‌’ అనేశారు. అప్పుడే తీసిన ఫొటోనే… బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ ఫొటో తోనే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ అనే న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

మొన్నామ‌ధ్య ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ అంటూ ఓ లోగో డిజైన్ చేసి టీజ‌ర్ వ‌దిలారు. ఇలా ఓ టీజ‌ర్ వ‌స్తుంద‌న్న సంగ‌తి చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ల‌కు కూడా తెలీద‌ట‌. ఆఖ‌రికి చిత్ర నిర్మాత డివివి దాన‌య్య‌కూ ఈ సంగ‌తి తెలీద‌ట‌. రాజ‌మౌళి మ‌న‌సులో రెండు మూడు లైన్లు ఉన్నాయ‌ని, అవి చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల‌కు చూచాయిగా తెలుస‌ని, ఈసారి రాజ‌మౌళి వీరిద్ద‌రినీ పిలిపించి క‌థ వినిపించ‌బోతున్నాడ‌ని స‌మాచారం. ఇక మీద‌ట రాజ‌మౌళి, చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌లు క‌ల‌సిన ఫొటో బ‌య‌ట‌కు వ‌స్తే… ఆరోజే క‌థ ఓకే అయిపోయిన‌ట్టు అనుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close