2022 : “ముందస్తు” కళ కనిపిస్తోందే ఓటరా !

కొత్త ఏడాది వచ్చేసింది. గత ఏడాది ఏం జరిగినా… ఈ ఏడాది ఏం జరగబోతోందనే ఆసక్తి ఎక్కువ మందిలో ఉంటుంది. రాజకీయంగా ఈ ఏడాది కీలక పరిణామాలకు వేదిక అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో వచ్చే ఏడాది.. ఆంధ్రతో టు దేశంలో సార్వత్రిక ఎన్నికలు 2024లో జరగాల్సి ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న వాతావరణం చూస్తూ అంటే అన్ని అధికార పార్టీలు ముందస్తుకు వెళ్లడానికి సిద్ధమవుతున్నాయన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ ఈ విషయంలో దాదాపుగా అన్ని సన్నాహాలు పూర్తి చేసుకుందని తెలుస్తోంది. ఈ మేరకు అన్ని పార్టీలు అలర్ట్ అయిపోయాయి. మరో ఆరు నెలల తర్వాత ఎన్నికల వేడి ఉంటుందని డిసైడైపోయి.. దానికి తగ్గట్లుగా కార్యాచరణ ప్రారంణభించారు. ముందస్తు ఎన్నికలు వస్తాయా రావా అన్నది డిసైడ్ చేయాల్సిన కేసీఆర్ కూడా… ఈ విషయంలో కాస్త దూకుడుగా ఉండటంతో అందరూ నమ్ముతున్నారు. ఆగస్టు తర్వాత ఆయన అసెంబ్లీని రద్దు చేస్తారని ఏడాది చివర్లో ఎన్నికలు వస్తాయని టీఆర్ఎస్ వర్గాలు కూడా బలంగా నమ్ముతున్నాయి.

కేసీఆర్‌తో కలిసి జగన్ కూడా ముందస్తుకు వెళ్తారని ఏపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరి రాజకీయ వ్యూహం ఒకటే. కలసి ఎన్నికలకు వెళ్లడం ద్వారా ఉమ్మడి ప్రయోజనం పొందవచ్చని వారు భావిస్తున్నారంటున్నారు. అంతే కాకుండా తెలంగాణకు ముందుగా ఎన్నికలు జరిగి…. అక్కడ ఫలితం తేడా వస్తే ఆ ప్రభావం తెలంగాణపై పడుతుంది. జగన్‌తో సరి పడని నేతలెవరైనా సీఎం అయితే.. ఏపీ ఎన్నికల్లో జోక్యం చేసుకుంటే ఇబ్బందే. గత ఎన్నికల సమయంలో అప్పుడే గెలిచిన కేసీఆర్ సర్కార్ ఎంత సాయం చేసిందో ఏపీ సీఎంకు బాగా తెలుసు. మళ్లీ కేసీఆర్ గెలిస్తే సమస్యే లేదు. కానీ గెలవకపోతే ఇబ్బంది. అదే సమయంలో ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రంగా ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రెండున్నరేళ్లు గడవడం కష్టం. భారం దింపేసుకోవడానికైనా ముందస్తుకు వెళ్లక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ముందస్తు ఆలోచనల్లో ఉందని ఎప్పటి నుండో ప్రచారంలో ఉంది. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ బీజేపీ విధానం. దీని కోసం అంతర్గతంగా ఏర్పాట్లు చేసుకుంటోంది. అన్నీ కలిసి వస్తే.. సగం రాష్ట్రాలకు కలిసి ముందస్తుకు వెళ్లే చాన్స్ ఉంది. అదే జరిగితే. ఈ ఏడాది ఎన్నికల ఏడాది అవడం ఖాయమని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అధికారం నెత్తికెక్కితే పాతాళంలోకే !

అధికారం ప్రజలు ఇచ్చేది. అలాంటి ప్రజల కన్నా తానే ఎక్కువ అనుకుంటే.. పాతాళంలోకి పంపేస్తారు ప్రజలు. చరిత్రలో జరిగింది ఇదే. ఇప్పుడు జరుగుతోంది ఇదే. భవిష్యత్ లో జరగబోయేది కూడా ఇదే. ఎందుకంటే...

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోన్న పోలింగ్ … ఓటేసిన ప్రముఖులు

ఎంపీ ఎనికల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకొని క్యూ లైన్ లో నిల్చొని ఓటు వేశారు. ప్రజలంతా తమ...

ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు ఎవరివీ..? ఎందుకీ అస్పష్టత..?

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయనే విషయంలో ఎవరూ స్పష్టతకు రాలేకపోతున్నారు.ఎంపీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మొదట్లో పరిస్థితులు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నప్పటికీ అభ్యర్థుల ఎంపికలో...

ఎంపీ ఎన్నికలు…హైదరాబాద్ లో కర్ఫ్యూ..!!

హైదరాబాద్ లో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. నిత్యం రద్దీగా కనిపించే మహానగరం వెలవెలబోతోంది. ప్రజలు ఓట్లు వేసేందుకు సొంతూళ్ళకు వెళ్ళడంతో నగరమంతా బోసిపోయింది. ఇది హైదరాబాదేనా అనుమానం వచ్చేలా హైదరాబాద్ నిర్మానుష్యంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close