సుభాష్ : బీజేపీ చేతిలో బకరా పవన్..!

మొత్తం మనదే కలిసి పని చేసుకుందాం..! నువ్ క్యాష్ కౌంటర్ చూసుకో అంటే… సరే అని ఒప్పుకుంటాడు పార్టనర్. వారం రోజుల తర్వాత ఆయన అంట్లు తోముతూ ఉంటాడు. కలిసి పని చేసుకుందామని ఆహ్వానించిన వ్యక్తి కౌంటర్ లో ఉంటాడు. ఈ స్టోరీ హీరో దగ్గర చెప్పి భోరుమంటాడు సమరసింహారెడ్డి సినిమాలో బ్రహ్మానందం. ఈ వారం రోజుల్లో చాలా జరిగిపోయి ఉంటాయి. పార్టనర్ అయినప్పటికీ అంట్లు తోముకోవడమే తప్ప.. నోరెత్తలేని పరిస్థితికి బ్రహ్మానందం చేరిపోయి ఉంటాడు. ఇప్పుడు బీజేపీ – జనసేన పొత్తులో పవన్ కల్యాణ్ పరిస్థితి చూస్తూంటే… ఆ బ్రహ్మీ లాంటి పొజిషన్‌లోనే ఇరుక్కుపోయాడని అనిపించక మానదు.

బడ్జెట్‌పై బీజేపీకి ప్రశంసలు.. వైసీపీపై విమర్శలా…?

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై పవన్ కల్యాణ్ విశ్లేషణ చేశారు. అందులో బీజేపీ అన్యాయం చేసిందనే ఆక్రోశం ఉంది కానీ.. మాటల్లో బయట పెట్టలేని పరిస్థితి కనిపించింది. దేశ స్థాయి బడ్జెట్ బాగుందంటూ… గొప్పగా విశ్లేషణ చేసిన పవన్… బీజేపీపై పొగడ్తల వర్షం కురిపించారు. రాష్ట్రానికి వచ్చే సరికి.. మాత్రం.. బీజేపీ ఏ నిధులు ఇవ్వకపోవడంపై… వైసీపీపై నెపం నెట్టేశారు. నిధులు ఇవ్వనిది బీజేపీ… ముందుగా విమర్శించాల్సి వస్తే బీజేపీని విమర్శించాలి. ఆ తర్వాత అధికారంలో ఉండి.. కేంద్రంపై పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకు రాలేకపోయినందుకు వైసీపీని విమర్శించాలి. కానీ పొత్తు పెట్టుకున్నందుకు.. బీజేపీని ఏమీ అనలేని స్థితికి పవన్ కల్యాణ్ వెళ్లిపోయారు. మామూలుగా అయితే.. ఆయన ఆవేశం ఓ రేంజ్‌లో ఉండేది. కానీ పొత్తు పెట్టుకున్నందున… కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చింది.

బీజేపీ పొత్తుతో స్వేచ్చగా నోరెత్తలేని పరిస్థితికి పవన్..!

బీజేపీతో పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకున్న కారణం అమరావతి అని పవన్ కల్యాణ్ చెబుతున్నారు.. కానీ.. అలాంటి సూచనలు ఏవీ కనిపించడం లేదు. పవన్ లక్ష్యం అమరావతి రైతులకు అండగా నిలబడటమే అయితే.. ఆ విషయంలో పవన్ మొదటి అడుగే ఫెయిల్యూర్ అని అనుకోవచ్చు. అదే సమయంలో బీజేపీ మాత్రం సెంచరీ స్కోర్ చేసినట్లే భావించాలి. ఏపీలో వైసీపీ పాలనలో జరుగుతున్న అన్ని వ్యవహారాలకు… బీజేపీ మద్దతు ఉందని వైసీపీ అంతర్గతంగా ప్రచారం చేసుకుంటోంది. దీనిపై.. ఇతర పార్టీలు నోరెత్తకుండా చేసుకోవడంలో.. బీజేపీ.. పవన్ తో పొత్తు ద్వారా సక్సెస్ అయినట్లే భావించాలి. ఇప్పుడు బీజేపీని వైసీపీ విమర్శించదు. జనసేన విమర్శించదు. టీడీపీ కూడా.. ఇప్పటికైతే అంటీ ముట్టనట్లుగానే విమర్శిస్తుంది. ఓ రకంగా బీజేపీ… పవన్ కల్యాణ్‌ను… పొత్తు పేరుతో కట్టేసి.. మాస్టర్ స్ట్రోక్ కొట్టినట్లుగానే కనిపిస్తోంది.

జనసేన పార్టీ ఏం చేయాలన్నా బీజేపీ పర్మిషన్ ఉండాల్సిందే..!

పవన్ కల్యాణ్‌తో పొత్తుకు సిద్దమైన బీజేపీ.. ప్రతీ కార్యక్రమాన్ని… పవన్ కల్యాణ్‌తో సంప్రదించే చేపడతామని హామీ ఇచ్చింది. ఇక్కడో తిరకాసు పెట్టినట్లుగా కనిపిస్తోంది. జనసేన ఏ కార్యక్రమం చేయాలన్నా… బీజేపీతో సంప్రదించాలన్న రూల్ అందులో దాగి ఉంది. దాంతో పవన్ కల్యాణ్ కాళ్లు చేతులు కట్టేసినట్లయింది. బీజేపీకి రహస్య అజెండా ఉందో లేదో కానీ… అంతకు ముందు పవన్ కల్యాణ్… స్వేచ్చగా నిర్ణయాలు ప్రకటించేవారు. అప్పుడు అనుకుంటే.. అప్పుడు అమరావతి రైతుల వద్దకు వెళ్లిపోయేవారు. ఏదో ఓ కార్యక్రమం తక్షణం ప్రకటించే స్వేచ్చ ఉండేది. కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్ ఆ స్వేచ్చ కోల్పోయారు. ఇప్పుడు బీజేపీ అనుమతితోనే అన్నీ చేయాల్సి ఉంది. అందుకే.. రెండో తేదీన కవాతును వాయిదా వేసిన తర్వాత .. ఏదో ఓ ప్రోగ్రాం పెడదామని… తీవ్రంగా ఒత్తిడి చేస్తే.. బీజేపీ చివరికి.. రావెల కిషోర్ నేతృత్వంలో బృందాన్ని పంపింది. ఇక్కడే.. జనసేన అధినేతని.. బీజేపీని ఎలా కార్నర్ చేసిందో అర్థమైపోతుందంటున్నారు.

యజమాని ప్లేస్ నుంచి .. పవన్ ఎక్కడ వరకూ దిగజారారు..?

ఇప్పుడు పవన్ కల్యాణ్ పరిస్థితి అటూ ఇటూ కాకుండా అయిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే… జనసేన పార్టీ ఉంది కానీ.., బీజేపీ గ్రిప్‌లో ఉంది. ఏం చేయాలో.. ఏం చేయకూడదో బీజేపీ నిర్ణయిస్తుంది. ఇది పవన్ కల్యాణ్‌కు కూడా అర్థమయిందేమో కానీ… పార్ట్ టైమ్ పాలిటిక్స్ చేస్తూ.., సినిమాలకు పుల్ టైం కేటాయిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

జగన్‌కు పీకే నాడు గెలిపించేవాడు – నేడు నథింగ్ !

ప్రశాంత్ కిషోర్ నథింగ్ అని ఐ ప్యాక్ ఆఫీసులో జగన్ పలికిన మాటలకు అక్కడ ఉన్న భారీ ప్యాకేజీలు అందుకుని తూ..తూ మంత్రంగా పని చేసిన రిషిరాజ్ టీం చప్పట్లు కొట్టి ఉండవచ్చు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close