చైతన్య : ఓట్లు వేసి గెలిపిస్తే ఏపీని అమ్మేస్తారా..?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వానికి సంబంధించిన స్థలం .. ఎక్కడైనా.. ఒక్క గజం ఉన్నా.. సరే అమ్మేయాలని డిసైడయింది. నేరుగా ప్రభుత్వ శాఖలకు చెందినవి కాదు.. యూనివర్శిటీల్లాంటి వాటిని కూడా వదిలి పెట్టకూడదని.. పట్టుదలతో ఉంది. అంటే.. ఏపీకి ఫర్ సేల్ బోర్డు తగిలించినట్లయింది. ప్రజాఉపయోగ కార్యక్రమాల కోసం.. భూముల్ని వినియోగంచడం ఇప్పటి వరకూ చేస్తున్నారు. ఏం చేసినా.. ఆ భూములపై హక్కులు ప్రభుత్వానికే ఉండేలా.. జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఇప్పుడు తెగనమ్మేస్తున్నారు.

నాడు హైదరాబాద్‌ని వైఎస్.. నేడు ఏపీని జగన్.. !

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో హైదరాబాద్ చుట్టుపక్కల… పట్టలేనంత భూమ్ రావడం.. ఎకరం యాభై కోట్లకు వెళ్లిపోవడంతో.. ప్రభుత్వం… ఎందుకు క్యాష్ చేసుకోకూడదని అనుకుంది. భూములు అమ్మి వేల కోట్లు సంపాదించింది. వాటితోనే… ప్రజలకు వ్యక్తిగతంగా లబ్ది చేకూర్చే పథకాలు ప్రవేశపెట్టారు. ఇప్పుడు అదే పద్దితిని ఆయన కుమారుడు.. జగన్మోహన్ రెడ్డి ఏపీలో పాటిస్తున్నారు. భూములమ్మి.. తాను ఎన్నికల్లో హామీ ఇచ్చిన నవరత్నాల పథకాలకు పంచాలనుకుటున్నారు. వైఎస్ హైదరాబాద్‌లో ఉన్న విలువైన భూములను మాత్రమే అమ్మాలనుకున్నారు.. కానీ ఆయన కుమారుడు.. టోటల్ ఏపీలో ఉన్న ప్రభుత్వ భూములన్నింటినీ అమ్మాలనుకుంటున్నారు.. అదే తేడా.. !

సంపద సృష్టించడం చేతకాక ఉన్నదాన్ని అమ్మకానికి…!

సంపద సృష్టి అనేది… ఏ ప్రభుత్వానికైనా మొట్టమొదటి ప్రయారిటీ. సంపద అమ్మకం మాత్రం కాదు. ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన.. మొత్తం తెగనమ్మేసే హక్కు వచ్చేసినట్లు భావించకూడదు. ఇప్పటి వరకూ వచ్చిన పాలకులు అదే చేశారు. వీలైత..సంపదను సృష్టించారు… కానీ అమ్మకాల వరకూ వెళ్లలేదు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టో ప్రకారం… ప్రతీ ఇంటికి ఏడాదికి మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకూ లబ్ది కలగాలి. అంటే.. ఒక్కో కుటుంబానికి నెలకు 30వేలకు పైగా.. పంపిణీ చేయాల్సి ఉంది. వీటిలో నేరుగా నగదు పంపిణీ పథకాలు కూడా ఉన్నాయి. ఇవి అమలు చేయాలంటే.. ఏడాదికి లక్ష కోట్ల రూపాయలు కావాలి. ఓ వైపు ఆదాయం పడిపోయింది.. మరో వైపు అప్పులూ పుట్టే పరిస్థితి లేదు. అందుకే… జగన్మోహన్ రెడ్డి సర్కార్.. ఆస్తులు అమ్మి నవరత్నాల పేరుతో ప్రజలకు పంచాలని నిర్ణయించుకున్నారు.

అంతిమంగా మళ్లీ ప్రజల భూములకే ఎసరు..!

ఏ కుటుంబ పెద్ద అయినా ఉన్న పళంగా ఉన్న ఆస్తులు అమ్మేసి… అక్కర లేని పనులు చేయాలనుకోరు. చేయరు కూడా. కుటుంబం భవిష్యత్ గురించి ఆలోచిస్తారు. అలా ఆలోచించకపోతే.. రోడ్డున పడేది కుటుంబమే. రోడ్డున పడ్డ తర్వాత ఆ కుటుంబ పెద్ద.. తనకేమీ సంబంధం లేదని వెళ్లిపోతే.. ఇబ్బందులు పడేది కుటుంబసభ్యులు. ఇప్పుడు ఏపీ పరిస్థితి అంతే ఉంది. తాను.. చెప్పిన హామీలను అందుబాటులో ఉన్న వనరులతో… సంపదను సృష్టించి… వాటి ద్వారా అమలు చేయడానికి ప్రయత్నించాలి కానీ.. ప్రజల ఆస్తులనే అమ్మాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇలా చేయడం వల్ల… సీఎం జగన్‌్కు పోయేదేమీ లేదు. కానీ.. ఏపీ ప్రజలకే పూర్తిగా నష్టం జరుగుతుంది. భవిష్యత్‌లో పెరిగే.. జనాభా అవసరాలకు తగ్గట్లుగా.. ఏదైనా.. ఓ నిర్మాణం చేపట్టాలన్నా… ప్రభుత్వం వద్ద భూమి ఉండదు. అలా అని ప్రభుత్వాలు ఊరుకోవు. తమ వద్ద ఉన్న భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తాయి. ప్రజా అవసరాల కోసం.. మీ భూమిని స్వాధీనం చేసుకుంటున్నామని… పేద రైతులపై పడతాయి. మళ్లీ స్వాధీనం చేసుకుంటాయి. వాటిని మళ్లీ అమ్మకానికి పెడతాయి. ఈ సైకిల్ ఇలా కొనసాగుతుంది. అంతిమంగా బలయ్యేది ప్రజలు. పాలకులు కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ స్టార్ క్యాంపెయినర్ గా జగన్ రెడ్డి..!?

తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన పొరపాటే వైసీపీ కూడా చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను బీఆర్ఎస్ విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్తే..ఏపీలో టీడీపీ సూపర్ సిక్స్ గ్యారంటీలను జగన్ రెడ్డి ప్రజల్లోకి...

జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ ను రేసులో నిలబెడుతోన్న రేవంత్..!!

రేవంత్ రెడ్డి...ఈ పేరు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. వ్యుహమో మరేమో కానీ, రిజర్వేషన్లపై కుట్ర జరుగుతుందంటూ బీజేపీకి ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. రిజర్వేషన్లపై రేవంత్ వ్యాఖ్యల పుణ్యమా అని బీజేపీ జాతీయ...

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close