రిపబ్లిక్ టీవీ ప్రో బీజేపీనా ? టీడీపీనా ?

ఢిల్లీలోని బీజేపీ సానుభూతి మీడియా… తెలుగు రాష్ట్రాల్లో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని ప్రచారం చేస్తున్నాయి. కానీ ఏపీ బీజేపీ నేతలు మాత్రం అదేమీ లేదని చెబుతున్నారు. పొత్తు లేకపోతే బతకలేమని ఆయా పార్టీలు అనుకుంటున్నాయని తాము మాత్రం 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటిస్తున్నారు. జాతీయ మీడియాతో ఎక్కువగా మాట్లాడే జీవీఎల్ నరసింహారావు, సునీల్ ధియోధర్ లాంటి వాళ్లు నేషల్ మీడియాకు అదే చెబుతున్నారు.

అయితే వీళ్లు టీడీపీనే ఎక్కువగా విమర్శిస్తున్నారు. అలాంటి వార్తలు రావడంలో టీడీపీ పాత్రే ఉందంటున్నారు. రిపబ్లిక్ టీవీలో టీడీపీ నేతలు చెబితే వార్తలు వేస్తారా అని ఎవరికైనా డౌట్ వస్తుంది. ఆ చానల్‌ను ఫాలో అయ్యే వాళ్లు చూస్తే.. జగన్‌కు సాక్షి ఎలాగో.. బీజేపీకి రిపబ్లిక్ టీవీ అలా అని ఎవరైనా చెబుతారు. అలాంటి చానల్‌లో … బీజేపీ పొత్తులపై ఇతర పార్టీలు మైండ్ గేమ్ ఆడటానికి చాన్స్ ఉంటుందా…లేకపోతే బీజేపీనే అలా ఆడుకునే చాన్స్ ఉందా అనేది ఆ నేతలకే తెలియాలి.

అయితే.. అసలు జనసేన గురించి ఏపీ బీజేపీ నేతలు ఇప్పుడు మాట్లాడటం లేదు. మొత్తం 175 స్థానాల్లో పోటీ చేస్తామని చెబుతున్నారు. మరి జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందా లేకపోతే.. పొత్తులు లేవా అన్నదానిపై వారేమీ మాట్లాడటం లేదు. తరచుగా జనసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేవాళ్లు. ఇప్పుడు జనసేన ప్రస్తావన తగ్గించి.. తామే అధికారంలోకి వస్తామన్నట్లుగా మాట్లాడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైద‌రాబాద్ లో భూమి కొన్న మైక్రోసాఫ్ట్…

ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల నుండి మైక్రోసాఫ్ట్ ఆఫీసులు ప‌నిచేస్తుండ‌గా, అతిపెద్ద డేటా సెంట‌ర్ ను...

‘స్వ‌యంభూ’ యాక్ష‌న్‌: 12 రోజులు… రూ.8 కోట్లు

'కార్తికేయ 2'తో నిఖిల్ ఇమేజ్ మొత్తం మారిపోయింది. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇది వ‌ర‌కు రూ.8 కోట్లుంటే నిఖిల్ తో సినిమా చేసేయొచ్చు. ఇప్పుడు ఓ యాక్ష‌న్ సీన్...

నాని సైతం.. ప‌వ‌న్ కోసం

ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ స్థాపించి ప‌దేళ్ల‌య్యింది. మెగా ఫ్యామిలీ, కొంత‌మంది క‌మెడియ‌న్లు, ఒక‌రిద్ద‌రు ప‌వ‌న్ డై హార్డ్ ఫ్యాన్స్ త‌ప్ప‌, ప‌వ‌న్‌కు నేరుగా పొలిటిక‌ల్ గా స‌పోర్ట్ ఎవ‌రూ చేయ‌లేదు. దానికి...

కేసీఆర్‌కు ధరణి – జగన్‌కు టైటిలింగ్ యాక్ట్ !

తెలంగాణలో కేసీఆర్ ఎందుకు ఓడిపోయారు.. అంటే ప్రధాన కారణాల్లో ధరణి అని ఒకటి వినిపిస్తుంది. ఈ చట్టం వల్ల కేసీఆర్ , బీఆర్ఎస్ నేతలు భూములు దోచుకున్నారన్న ఓ ప్రచారం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close