టీడీపీని డైవ‌ర్ట్ చేయ‌డమే ఈ వివాదం ల‌క్ష్య‌మా..?

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర పూర్త‌యిన త‌రువాత నుంచి వైకాపా గ్రాఫ్ ఏమంత ఆశాజ‌న‌కంగా లేద‌నే అంచ‌నాలు కొన్ని ఉన్నాయి. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అనూహ్యంగా సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌క‌టించారు. పెన్ష‌న్లు రెండింత‌లు చేయ‌డం, మ‌హిళ‌ల‌కు పసుపు కుంకుమ‌, రైతుల‌కు సాయం… ఇలా వ‌రుస‌గా కొన్ని ప‌థ‌కాల‌ను అమ‌ల్లోకి తెచ్చారు. దీంతోపాటు రాయ‌ల‌సీమ ప్రాంతానికి సాగునీరు వెళ్ల‌డం, పోల‌వ‌రం ప‌నుల్లో రికార్డులు న‌మోదు కావ‌డం, కియా ఫ్యాక్ట‌రీ ఉత్ప‌త్తి ప్రారంభించ‌డం, పేద‌ల‌కు పెద్ద సంఖ్య‌లో సొంత ఇళ్ల‌ను నిర్మించి ఇవ్వ‌డం… ఇవ‌న్నీ టీడీపీ పాలనలో విజ‌యాలు ఒక్క‌సారి క‌నిపించాయి. కేంద్ర సాయం లేక‌పోయినా, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సమర్థంగా న‌డిపించ‌డంలో ముఖ్య‌మంత్రి చంద్రబాబు క‌ష్టం ఫ‌లితాల‌ను ఇస్తోంద‌న్న న‌మ్మ‌కం ప్ర‌జ‌ల్లో మరింత బ‌ల‌ప‌డింది. దీంతో ప్ర‌తిప‌క్ష పార్టీ వైకాపాకి దిక్కుతోచ‌ని ప‌రిస్థితి! టీడీపీ మీద ఏ విమ‌ర్శ‌లు చేసి ప్ర‌జ‌ల్లోకి వెళ్లాలో అర్థం కాని ప‌రిస్థితి.

అందుకే, ఈ మ‌ధ్య ఏదో ఒక అంశంతో ర‌చ్చ చేయాల‌ని వైకాపా నేతలతోపాటు, వారి ప‌త్రిక సాక్షి ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వండి వారుస్తూ వ‌స్తోంది. కానీ, ఆశించిన స్థాయి చ‌ర్చ ప్ర‌జ‌ల్లో జ‌ర‌గ‌డం లేదు. దీంతో తాజాగా ఈ డాటా చోరీ అంశాన్ని తెర‌మీదికి తీసుకొచ్చారు. ప్ర‌జ‌లంద‌రికీ సంబంధించినది ఏదో టీడీపీ కాజేసింద‌నే చర్చ‌కు బాకాలు ఊదుతున్నారు. టీడీపీ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను ఏదో ఏమార్చేసింద‌న్న‌ట్టుగా ప్ర‌తిప‌క్ష నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. చంద్ర‌బాబు నాయుడు డాటా చోర్ అంటూ, గోప్యంగా ఉండాల్సిన ఓట‌ర్ల జాబితా చోరీ అయింద‌నీ, దాని వ‌ల్ల ఏదో ఘోర‌మైన నేరానికి పాల్ప‌డింద‌నే ఆరోప‌ణ‌లు వైకాపా చేస్తోంది. ఇవాళ్టి సాక్షి ప‌త్రిక కూడా అదే త‌ర‌హా క‌థ‌నాల‌తో నింపేసింది! అయితే, ఈ ర‌చ్చ అంతా టీడీపీ దృష్టిని మార్చ‌డం కోసం, ప్ర‌జ‌ల దృష్టిలో టీడీపీని దొంగ అని ముద్రవేసే ప్ర‌య‌త్నం అనేది సామాన్య ప్ర‌జ‌ల‌కు కూడా అర్థం అవుతూనే ఉంది.

ఎన్నిక‌ల ముందు అన్ని రాజ‌కీయ పార్టీల‌కూ ఓట‌ర్ల జాబితాను ఎన్నిక‌ల సంఘ‌మే ఇస్తుంది. ఛీఫ్ ఎల‌క్టోర‌ల్ ఆఫీస‌ర్ వెబ్ సైట్ లో వివ‌రాల‌న్నీ అంద‌రికీ క‌నిపిస్తాయి. కాబ‌ట్టి, ఓట‌ర్ల జాబితా మీద గోప్య‌త పేరుతో విమర్శలు చేయ‌డం అనేది అసంద‌ర్భ‌మైన ప‌ని. ఇంకోటి… డాటా చోరీ అయిందీ అయిందీ అంటూ తెలంగాణ నేత‌ల నుంచి, సైబ‌రాబాద్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్ వ‌ర‌కూ అంద‌రూ ఏపీ స‌ర్కారును విమ‌ర్శిస్తున్నారు. అయితే, ఆ డాటా ఎక్క‌డైనా దుర్వినియోగ‌మైందా..? ఆ వివ‌రాలతో ప్ర‌జ‌ల‌ను ఎవ‌రైనా మ‌భ్య‌పెడుతున్నారా..? స‌ంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధిదారుల వివ‌రాల‌ను పెట్టుకుని ఏ అధికార పార్టీ అయినా ఏం చెయ్య‌గ‌ల‌దు..? మ‌హా అయితే వారికి ఫోన్లు చేసి, మెసేజ్ లు ఇచ్చి… త‌మ పార్టీకి ఓటెయ్యండి అని మాత్ర‌మే కోర‌గ‌లదు. ఏ ర‌కంగా చూసుకున్నా డాటా చోరీ వివాదం కేవ‌లం ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించే ఒక ప్ర‌చారంశంగా మాత్ర‌మే క‌నిపిస్తోంది. సంక్షేమ పథకాల అమలును, సాధించిన అభివృద్ధిని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్తున్న ముఖ్యమంత్రిని డైవర్ట్ చేయడమే వైకాపా, దానికి వెనకున్న తెరాస, వీరికి అండగా నిలిచేందుకు అవకాశం ఉన్న మరో పెద్దన్న పార్టీ లక్ష్యంగా కనిపిస్తోందనేది కొంతమంది విమర్శ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close