స్వరూపానంద ఎంత చెబితే అంత..! వైసీపీ మొదటి జాబితా లోగుట్టు ఇదే..!?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను.. ఇడుపులపాయలో విడుదల చేయాలనుకున్నారు. కానీ వివేకానందరెడ్డి హత్యతో వాయిదా పడింది. ఆ తర్వాత గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం… పార్టీలో కొత్త నేతల్ని చేర్చుకోవడం కోసం.. ఇడుపులపాయ నుంచి జగన్ హుటాహుటిన హైదరాబాద్ వచ్చారు. ఆలస్యం అవుతుంది కాబట్టి.. అక్కడే అభ్యర్థుల జాబితా కూడా విడుదల చేస్తారన్న సమాచారం మీడియాకు ఇచ్చారు. కానీ… తర్వాత మళ్లీ మనసు మార్చుకున్నారు. హైదరాబాద్‌లో అభ్యర్థుల జాబితా విడుదల చేయడం.. ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపుతుందని.. నిర్ధారించుకుని… మళ్లీ వాయిదా వేశారు. ఆదివారం ఉదయం ఇడుపులపాయకు వెళ్లి… అక్కడే అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల చేయాలనుకున్నారు. ఇది జరిగిన రెండు, మూడు గంటల్లోనే.. మళ్లీ ఓ సమాచారం మీడియాకు వచ్చింది.

తొమ్మిది మంది లోక్‌సభ అభ్యర్థుల జాబితాను.. వైసీపీ విడుదల చేయబోతోందని సమాచారం ఇచ్చారు. చివరికి ముహుర్తం చూసుకుని రాత్రి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు… తొమ్మిది మందితో.. వైసీపీ ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ తొమ్మిది లెక్క వెనుక ఉన్నది.. విశాఖ శారదాపీఠాదిపతి స్వరూపానంద స్వామి. ఆయనే లక్కీ నెంబర్లు, ముహుర్తాలు ఖరారు చేసి.. ఓజాబితా విడుదల చేయమని… సూచించారు. ఆ ప్రకారమే.. వైసీపీ నేతలు.. అన్నీ తొమ్మిది కలసి వచ్చేలా… మొదటి జాబితాను ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డికి ఇంతగా ముహుర్తాలపై నమ్మకం ఉందని.. ఎవరూ అనుకోలేదు.

ఇటీవలి కాలంలో.. స్వరూపానందను… జగన్మోహన్ రెడ్డి అమితంగా నమ్ముతున్నారు. హిందూత్వం నుంచి ఎప్పుడో బయటకు వెళ్లిపోయి… నిఖార్సుగా క్రైస్తవాన్ని ఆచరించే జగన్మోహన్ రెడ్డి… ఆశ్చర్యకరంగా… హిందూస్వామి చెప్పినట్లు చేయడం ప్రారంభించారు. స్వరూపానంద కేసీఆర్‌కు కూడా దగ్గర కావడంతో… ఆయన ముహుర్తల ప్రకారం ఇష్టం లేకపోయినా… విడుదల చేయక తప్పలేదన్న భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close