దోస్త్ మేరా దోస్త్..! మోడీ వేడుకకు కలసి వెళ్లనున్న జగన్, కేసీఆర్..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీకి కాబోతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి మధ్య.. స్నేహం అంతకంతకూ బలపడుతోంది. ఎన్నికల సమయంలో.. టీడీపీని ఓడించడానికి పూర్తి స్థాయిలో సహకరించిన కేసీఆర్.. ఇప్పుడు… జగన్మోహన్ రెడ్డిని అంత కంటే ఎక్కువగానే ప్రొత్సహిస్తున్నారు. గెలిచిన తర్వాత తన ఇంటికి వచ్చిన జగన్‌ను అత్యంత అపూర్వ రీతిలో స్వాగతం చెప్పిన కేసీఆర్… ప్రమాణ స్వీకారానికి… ఒక రోజు ముందే.. 29నే విజయవాడకు చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు.. కొత్తగా.. జగన్, కేసీఆర్ కలిసి మరో టూర్ ప్రణాళిక రెడీ చేసుకున్నారు. దాని ప్రకారం… జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కేసీఆర్ తో కలిసి.. ఢిల్లీకి బయలుదేరబోతున్నారు. సాయంత్రం ఏడు గంటలకు.. మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఇద్దరూ హాజరవనున్నారు. జగన్ పట్ల కేసీఆర్ అత్యంత వాత్సల్యం ప్రదర్శిస్తున్నారు.

జగన్ కోరిక మేరకు… సీనియర్ ఐపీఎస్ అధికారి.. స్టీఫెన్ రవీంద్రను… ఏపీకి పంపించడానికి అంగీకరించారు. ఆయన స్వయంగా కేంద్రానికి.. ఈ విషయంపై లేఖ రాసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో… కేటీఆర్ కూడా.. జగన్ పై.. ఆప్యాయత చూపిస్తున్నారు. కుటుంబ స్నేహితులన్నట్లుగా… ఆ కుటుంబాలు.. ఆ భేటీలో పాల్గొన్నాయి. జగన్.. కేసీఆర్ మధ్య.. ఎంత స్నేహం ఉంటే.. ఏపీకి అంత మంచిదనే విశ్లేషణలు ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు, విభజన సమస్యలు, ఉమ్మడి సంస్థల విభజన ఇంకా మిగిలే ఉన్నాయి. వాటిని పరిష్కరించుకోవాల్సి ఉంది. ఏపీకి.. ఏడెనిమిది వేల కోట్ల కరెంట్ బకాయిలను.. తెలంగాణ చెల్లించాల్సి ఉంది. వీటన్నింటికీ సామరస్య పూర్వక పరిష్కారం లభిస్తుందని అంచనా వేస్తున్నారు.

మరో వైపు.. మోడీ ప్రమాణస్వీకారానికి ఇద్దరూ కలిసి వెళ్లాలనుకోవడం… హఠాత్తుగా… ఖరారైన.. ప్రణాళికగా చెబుతున్నారు. ముందుగా… 30వ తేదీనే… మోడీ కూడా ప్రమాణం చేస్తూండటంతో… జగన్‌కు వెళ్లడం సాధ్యం కాదని భావించారు. అయితే… మధ్యాహ్నమే జగన్ ప్రమాణస్వీకారం చేస్తూండటంతో… సాయంత్రం ఢిల్లీకి వెళ్లవచ్చని… జగన్, కేసీఆర్ భావించిటన్లు తెలుస్తోంది. కేంద్రంతో సన్నిహిత సంబంధాలు ఉంటేనే.. నిధుల విషయంలో..న్యాయం జరుగుతుందని.. కేసీఆర్ … జగన్‌తో మాట్లాడి.. ఇద్దరూ కలిసి ఒకే విమానంలో వెళ్లేలా… మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. గతంలో బీజేపీకి దగ్గరగా ఉన్న కేసీఆర్.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని… బీజేపీకి కాస్త దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉన్నారంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com