రిహార్సల్స్ చేసి రికార్డెడ్ ప్రెస్‌మీట్లు..! పండగ చేస్కుంటున్న సోషల్ మీడియా..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రెస్‌మీట్ ఫోబియా పట్టుకున్నట్లుగా ఉంది. బుధవారం రికార్డెడ్ ప్రెస్‌మీట్‌ను మీడియాకు విడుదల చేసి… ఆయన అందర్నీ ఆశ్చర్యపరిచారు. ప్రెస్‌మీట్ అంటే.. జర్నలిస్టుల్ని పిలిచి.. తాను చెప్పాలనుకున్నది చెప్పి… జర్నలిస్టులు వ్యక్తం చేసే సందేహాలు తీరుస్తారు. కానీ ఆ అండ్ పీఆర్ విడుదల చేసిన రికార్డెడ్ ప్రెస్‌మీట్‌లో ఎదురుగా.. అసలు జర్నలిస్టులు కూడా లేరు. జగన్మోహన్ రెడ్డి తాను చెప్పాలనుకున్నది చెప్పి.. వెళ్లిపోయారు. ఈ వీడియో ఎవరు ఎడిట్ చేశారో కానీ.. మాట మాటకు కట్స్ పడ్డాయి. జగన్మోహన్ రెడ్డి మాటలు ఎక్కడిక్కడ స్కిప్ అవడం.. చూసేవాళ్లను దాటిపోలేదు. దీంతో సోషల్ మీడియా ఒక్క సారిగా బ్లాస్ట్ అయిపోయింది. జగన్‌ను ట్రోల్ చేయడం ప్రారంభించారు.

ప్రశ్నలు అడగనివ్వని మూడు ప్రెస్‌మీట్లకే విషయం తేలిపోయిందా..?

జగన్మోహన్ రెడ్డి.. గత పది నెలల కాలంలో.. మూడు సార్లు ప్రెస్ మీట్ పెట్టారు. మొదటి తొమ్మిది నెలల పాటు ఆయన తెలుగు మీడియా గురించే పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే.. స్థానిక సంస్థల ఎన్నికలను ఎన్నికల అధికారి రమేష్ కుమార్ వాయిదా వేశారో.. అప్పుడే మొదటి సారి ప్రెస్ మీట్ పెట్టారు. అందులో… బ్లీచింగ్ పౌడర్, పారాసిటమాల్ సూత్రం చెప్పి.. కరోనా పై పోరాడుతున్న దేశాలకు దిశానిర్దేశం చేసి.. సోషల్ మీడియాలో ప్రపంచ స్థాయి నేతగా ఎదిగిపోయారు. ఆ తర్వాత అదే కరోనా చాలా డేంజర్ అని చెప్పేందుకు మరో రెండు లైవ్ ప్రెస్‌మీట్లు పెట్టారు. ఓ సారి.. కొరియా నుంచి వైరస్ పుట్టిందని చెప్పి… ఆయన జీకేపై ప్రజంలదరికి ఓ అవకాశనకు వచ్చేలా చేయగలిగారు. ఆ తర్వాత ప్రెస్‌మీట్‌లో విదేశాల నుంచి ఇండియాకు వచ్చిన వారి లెక్క చెబ్బబోయి. కొత్త అంకెను కనిపెట్టారు. జగన్ ప్రెస్‌మీట్లు మీమ్స్ తయారు చేసేవాళ్లకు.. పండగలా మారడంతో.. ఆయన ప్రెస్‌మీట్ల కోసం.. చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు.

రికార్డెడ్ ప్రెస్‌మీట్‌తో అంత సామర్థ్యం లేదని స్వయం సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నారా..?

నేరుగా ప్రెస్‌మీట్లు పెట్టి.. చూసి చదవడానికి కూడా ఇబ్బంది పడుతున్నానని గుర్తించిన జగన్మోహన రెడ్డి.. ఈ సారి రిస్క్ తీసుకోకుండా.. రికార్డెడ్ బాట ఎంచుకున్నారు. సాక్షి నుంచి తెచ్చుకున్న ప్రొఫెషనల్ కెమెరామెన్‌తో తన ప్రసంగాన్ని ముందుగా రికార్డు చేయించారు. ఎక్కడైతే తడబడ్డారో.. ఎక్కడైతే లూజ్ కామెంట్లు, దిస్ ఈజ్ వాస్తవం, దట్ షుడ్ బి నిరంతర ప్రక్రియ… లాంటి తనదైన ట్రేజ్ మార్క్ కామెంట్లు చేశారో.. .. అక్కడ కట్ చేసి పడేశారు. ఆ తర్వాత దాన్ని మీడియాకు విడుదల చేశారు. ఆ వీడియోలో ఎన్ని కట్స్ ఉన్నాయో లెక్కలేదు. ఒక అంశం నుంచి మరో అంశానికి జంప్ అవుతూ.. చేసిన విన్యాసం.. ప్రజల దృష్టిని దాటిపోలేదు. నేరుగా ప్రెస్‌మీట్ పెట్టి… కామెడీ చేస్తే.. సీరియస్ అయిపోతుంది. అందుకే.. ప్రెస్‌మీట్ జోలికి వెళ్లకుండా రికార్డింగ్ కి ఓకే అనేశారు.

సోషల్ మీడియా ట్రోలింగ్‌కు చాన్సిచ్చిన వైసీపీ వ్యూహకర్తల బృందం..!

జగన్మోహన రెడ్డి రికార్డెడ్ ప్రెస్‌మీట్‌.. ఇతర పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలకు ఫుల్ మీల్స్ లా ఉపయోగపడుతోంది. మామూలుగా అయితే… రంధ్రాన్వేషణచేసుకుని అయిన మీమ్స్ తయారు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు రికార్డెడ్ ప్రెస్‌మీట్ మీదనే.. సెటైర్లు వేస్తున్నారు. మీడియాను ఎదుర్కోలేని సీఎం అని ట్రోల్ చేస్తున్నారు. కరోనాపై రెండు గంటల పాటు సమీక్ష చేశారనుకున్నాం కానీ… ప్రెస్‌మీట్ కోసం రెండు గంటలు ప్రాక్టిస్ చేశారని సెటైర్లు వేస్తున్నారు. అత్యంత నాసిరకంగా ఉన్న రికార్డెడ్ వీడియో ఎడిటింగ్‌ను సాక్షిలో సీనియర్లతో చేయించి ఉంటారని సెటైర్లు వేస్తున్నారు. అసలు ఏమీ తెలియకపోతే.. మూల విరాట్‌లా కూర్చోవాలి కానీ.. ఇలా.. రికార్డెడ్ ప్రెస్‌మీట్లతో పరువు పోగొట్టుకోవడం ఎందుకని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close