ఏపీలో మే కాదు సెప్టెంబర్..!

ఆంధ్రప్రదేశ్‌లో పద్దెనిమిదేళ్లు నిండిన వారికి టీకాలిచ్చే కార్యక్రమం మే ఒకటో తేదీన ప్రారంభం కాదని సీఎం జగన్ తేల్చేశారు. కావాలంటే కొనుగోలు చేసైనా అందరికీ టీకాలేస్తామని.. అందరికీ ఉచితంగా ఇస్తామని.. రూ. పదహారు వందల కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు కానీ.. ఇప్పుడు… కొనుగోలు విషయంలో వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోంది. పద్దెనిమిదేళ్లు దాటిన వారికి సెప్టెంబర్ తర్వాతనే టీకాలు వేసే కార్యక్రమం ఉంటుందని ఆయన కరోనాపై సమీక్షలో వ్యాఖ్యానించారు. మే ఒకటో తేదీ నుంచి అందరికీ వ్యాక్సిన్ పేరుతో కేంద్రం… రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభించారు.

తొలి రోజే దాదాపుగా కోటి మందికిపై రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ సమయంలో చాలా రాష్ట్రాలు తాము పద్దెనిమిదేళ్లు నిండిన వారికి ఒకటో తేదీ నుంచి వ్యాక్సిన్ వేయలేమని చెబుతున్నాయి. ఈ జాబితాలోకి ఏపీ కూడా చేరింది. ప్రస్తుతం దేశంలో ఉన్న వ్యాక్సిన్ ఉత్పత్తి.. పంపిణీని బట్టి చూస్తే.. ఇదే పరిస్థితుల్లో సెప్టెంబర్ తర్వాతే పద్దెనిమిదేళ్లు నిండిన వారికి టీకాలిస్తామని సీఎం జగన్ అంచనా వేశారు. అందరికీ టీకాలివ్వాలంటే.. వచ్చే ఏడాది జనవరి వరకూ పడుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్ తప్ప.. కరోనాకు మరో పరిష్కారం లేదన్న అభిప్రాయంతో జగన్ ఉన్నారు.

మొత్తంగాచూస్తే.. కేంద్రం ప్రకటించిన టీకా కార్యక్రమం ఫార్సుగా మారింది. రాష్ట్రాలకు టీకాలు పంపిణీ చేస్తే.. ప్రజలకు అందుతాయి. కానీ రాష్ట్రాలకు కేంద్రం పంపిణీ చేసే పరిస్థితి లేదు. కొంటే.. రాష్ట్రాలు కొనుగోలు చేసుకోవాలి. రాష్ట్రాలకు నిధుల సమస్య ఉంది. అలాగే.. ఉత్పత్తి కూడా తక్కువే. ఈ పరిస్థితుల్లో సీఎం జగన్ ప్రజలు ఎక్కువగా ఆశలు పెట్టుకోకుండా ముందుగానే ఇప్పుడల్లా టీకా ఉండదనే హింట్‌ను ప్రజల్లోకి పంపేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైద‌రాబాద్ లో భూమి కొన్న మైక్రోసాఫ్ట్…

ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల నుండి మైక్రోసాఫ్ట్ ఆఫీసులు ప‌నిచేస్తుండ‌గా, అతిపెద్ద డేటా సెంట‌ర్ ను...

‘స్వ‌యంభూ’ యాక్ష‌న్‌: 12 రోజులు… రూ.8 కోట్లు

'కార్తికేయ 2'తో నిఖిల్ ఇమేజ్ మొత్తం మారిపోయింది. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇది వ‌ర‌కు రూ.8 కోట్లుంటే నిఖిల్ తో సినిమా చేసేయొచ్చు. ఇప్పుడు ఓ యాక్ష‌న్ సీన్...

నాని సైతం.. ప‌వ‌న్ కోసం

ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ స్థాపించి ప‌దేళ్ల‌య్యింది. మెగా ఫ్యామిలీ, కొంత‌మంది క‌మెడియ‌న్లు, ఒక‌రిద్ద‌రు ప‌వ‌న్ డై హార్డ్ ఫ్యాన్స్ త‌ప్ప‌, ప‌వ‌న్‌కు నేరుగా పొలిటిక‌ల్ గా స‌పోర్ట్ ఎవ‌రూ చేయ‌లేదు. దానికి...

కేసీఆర్‌కు ధరణి – జగన్‌కు టైటిలింగ్ యాక్ట్ !

తెలంగాణలో కేసీఆర్ ఎందుకు ఓడిపోయారు.. అంటే ప్రధాన కారణాల్లో ధరణి అని ఒకటి వినిపిస్తుంది. ఈ చట్టం వల్ల కేసీఆర్ , బీఆర్ఎస్ నేతలు భూములు దోచుకున్నారన్న ఓ ప్రచారం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close