రివ్యూ: జాగ్వార్‌ – విష‌యం త‌క్కువ – హ‌డావుడి ఎక్కువ

ప‌రిశ్ర‌మ‌కు మ‌రో కొత్త కుర్రాడొచ్చాడు. త‌నే నిఖిల్ గౌడ‌. మామూలుగా అయితే వారం వారం మేక‌ప్పులు వేసుకొచ్చే కొత్త హీరోల్లో నిఖిల్ ని ఒక‌డిగా జ‌మ క‌ట్టేయొచ్చు. కాక‌పోతే ఈ నిఖిల్ గౌడ కొంచెం స్పెష‌ల్‌. మాజీ ప్ర‌ధాని దేవ‌గౌడ మ‌న‌వ‌డు, క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార స్వామి కొడుకు కావ‌డంతో ఈ సినిమాపై ఫోక‌స్ ప‌డింది. పైగా క‌న్న‌డ‌లో చిన్నాంబిక ఫిల్మ్స్ ఎన్నో హిట్స్ ఇచ్చిన సంస్థ‌. అక్క‌డి నుంచి వ‌స్తున్న సినిమా కాబ‌ట్టి.. ఎలా ఉంటుందా? అనే ఆస‌క్తి ఉండ‌డం స‌హ‌జం. దానికి తోడు విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ అందించిన చిత్ర‌మిది. సాంకేతికంగా బ‌ల‌మైన టీమ్ పెట్టుకొన్నారు. గ్లామ‌ర్ కోసం ఐటెమ్ సాంగ్‌లో త‌మన్నాని దించారు. ప్ర‌మోష‌న్లు బీభ‌త్సంగా చేశారు. దాంతో ఈ సినిమాపై ఆటోమెటిగ్గా ఫోక‌స్ పెరిగింది. మ‌రి జాగ్వార్ ఆ అంచ‌నాల్ని అందుకొందా? అస‌లు ఈ జాగ్వార్ ఏమిటి? ఆ టైటిల్ వెనుక క‌థేంటి?

* క‌థ‌

శౌర్య ప్ర‌సాద్ (సంప‌త్‌రాజ్‌) న‌డుపుతున్న అనేక వ్యాపారాల్లో ఎస్‌.ఎస్‌. ఛాన‌ల్ ముఖ్య‌మైన‌ది. ఆ ఛాన‌ల్ రేటింగులు పెంచ‌డానికి ఏమైనా చేయ‌డానికి సిద్ద‌ప‌డ‌తాడు. తాను ఎద‌గ‌డానికి ప‌దిమందికి మొక్క‌డానికి, వంద‌మందిని తొక్క‌డానికి కూడా సిద్ద‌ప‌డే మ‌న‌స్త‌త్వం త‌న‌ది. స‌డ‌న్‌గా ఓ రోజు.. ఎస్‌.ఎస్‌. ఛాన‌ల్ ని ఎవ‌రో హ్యాక్ చేస్తారు. `మ‌రో ఐదు నిమిషాల్లో ఓ హ‌త్య లైవ్‌లో చూడ‌బోతున్నారు` అంటూ బ్రేకింగ్ న్యూస్ ప‌డుతుంది. అన్న‌ట్టుగానే ఓ జ‌డ్జ్ (ఆదిత్య‌మీన‌న్‌)ని ఓ ముసుగు మ‌నిషి దారుణంగా చంపేస్తాడు. దాంతో సీబీఐ రంగంలోకి దిగుతుంది. ఈ కేసుని ఓ సీబీఐ ఆఫీస‌ర్ (జ‌గ‌ప‌తిబాబు) డీల్ చేస్తాడు. ఈ వేట‌కు అత‌ను పెట్టిన పేరు… ఆప‌రేష‌న్ జాగ్వార్‌. శౌర్య ప్ర‌సాద్ న‌డుపుతున్న మెడిక‌ల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు ద‌క్కించుకొంటాడు ఎస్‌.ఎస్‌.కృష్ణ (నిఖిల్‌). త‌నో అల్ల‌రి పిల్లాడు. సీనియ‌ర్లు ర్యాగింగ్ చేయం మొర్రో అంటున్నా.. బ‌ల‌వంతంగా ర్యాగింగ్ చేయించుకొంటాడు. అదే కాలేజీలో చ‌దువుతున్న ప్రియ (దీప్తి)నీ ప్రేమ‌లో ప‌డేస్తాడు. ఈలోగా ఎన్ కౌంట‌ర్ శంక‌ర్ అనే ఓ పోలీస్ ఆఫీస‌ర్‌ని జాగ్వార్ చంపేస్తాడు. అదీ లైవ్‌లో చూపిస్తాడు. అప్పుడే సీబీఐ ఆఫీస‌ర్ కి అస‌లు జాగ్వార్ ఎవ‌రు? మున్ముందు ఎవ‌రికి చంప‌బోతున్నాడ‌నే వివ‌రాలు తెలుస్తాయి. ఇంత‌కీ జాగ్వార్ ఎవ‌రు? ఎందుకు ఇదంతా చేస్తున్నాడు? కృష్ణ‌, జాగ్వార్‌లు ఒక్క‌రేనా? అనే విష‌యాల్ని సెకండాఫ్‌లో చూడాల్సిందే.

* పెర్‌ఫార్మ్సెన్స్‌

నిఖిల్ గౌడ తొలి సినిమా ఇది. అన్న‌ప్రాస‌న రోజే ఆవ‌కాయ్‌తో పాటు పిజ్జా, బ‌ర్గ‌ర్లు కూడా తినిపించేయాల‌న్న త‌ప‌న‌తో తీసిన సినిమా ఇది. పాపం… అన్ని భారాల‌నూ కొత్త కుర్రాడు నిఖిల్ బాగానే మోశాడు. నిఖిల్ హైటు, ప‌ర్స‌నాలిటీ బాగున్నాయి. కానీ ఫేస్‌లో హీరో లుక్ లేదు. అయితే చూడ‌గా చూడ‌గా నిఖిల్‌ని హీరోగా యాక్సెప్ట్ చేయొచ్చేమో..?? గ్లామ‌ర్ ప‌క్క‌న పెడితే.. ఫైట్లూ, డాన్సులు బాగా చేశాడు. కీల‌క‌మైన స‌మ‌యాల్లో ఎక్స్‌ప్రెష‌న్స్ ఇచ్చేట‌ప్పుడు లోపాలు క‌నిపించాయి. తొలి సినిమా కాబ‌ట్టి మ‌న‌మే అడ్జ‌స్ట్ అయిపోవాలి. ఇక దీప్తి పాత్ర కేవ‌లం పాత్ర‌ల‌కు మాత్ర‌మే ప‌రిమితం. త‌మ‌న్నా ఓ పాట‌లో ఐటెమ్‌భామ‌లా క‌నిపిస్తే, దీప్తి నాలుగు పాట‌ల్లో క‌నిపించింది అనుకోవాలి. జగ‌ప‌తి బాబు పాత్ర ప‌రిధి అంతంత మాత్ర‌మే. అయితే ప‌ద్ద‌తిగా చేసుకొన్నాడు. రావు ర‌మేష్ అల‌వాటైన దారిలో అల్లుకు పోయాడు. సంప‌త్ మ‌రోసారి బేస్ వాయిస్‌తో అద‌ర‌గొట్టాడు. ర‌మ్య‌కృష్ణ కాసేపు క‌నిపించిందంతే.

* సాంకేతిక వ‌ర్గం

ఈ సినిమాని టెక్నిక‌ల్‌గా చాలా హై రేంజులో చూపించాల‌న్న ప్ర‌య‌త్నం బాగుంది. అందుకు తొలి స‌న్నివేశాలే ఉదాహ‌ర‌ణ‌. జాగ్వార్ ఎంట్రీ సీన్ అదిరిపోయింది. అదే టెంపో కొన‌సాగితే ఈ సినిమా ఎక్క‌డో ఉందును. త‌మ‌న్ పాట‌ల మాటేమో గానీ, ఆర్‌.ఆర్‌తో ఆక‌ట్టుకొన్నాడు. ఏదో జ‌రుగుతోంద‌న్న ఆస‌క్తి క్రియేట్ చేశాడు. మ‌నోజ్ ప‌ర‌మ‌హంస సినిమాటోగ్ర‌ఫీ ఉన్న‌త స్థాయిలో ఉంది. రూపాయి ఖ‌ర్చు పెడితే, ప‌ది రూపాయ‌ల ఎఫెక్ట్ చూపించారు ఇందులో. పాట‌ల మేకింగ్ కూడా బాగుంది. ఓవ‌రాల్‌గా టెక్నిక‌ల్ టీమ్ అంతా బాగానే శ్ర‌మించింది.

* విశ్లేష‌ణ‌

ముందుగా విజ‌యేంద్ర ప్ర‌సాద్ అందించిన క‌థ గురించి మాట్లాడుకోవాలి. బాహుబ‌లి, భ‌జ‌రంగీ భాయ్‌జాన్ సినిమాల త‌ర‌వాత ఆయ‌న‌పై గౌర‌వం పెరిగింది. త‌ప్ప‌కుండా ఆయ‌న్నుంచి మంచి క‌థ‌లే వ‌స్తాయ‌నుకొంటారు. అయితే.. ఓ రొటీన్ క‌థ ఇచ్చి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఒక్క‌లైన్‌లో చెప్పాలంటే ప‌గ – ప్ర‌తీకారాల స్టోరీ ఇది. తండ్రిని మోసం చేసిన‌వారిపై కొడుకు తీర్చుకొనే ప్ర‌తీకారం. దాని చుట్టూ ఓ ప్రేమ‌క‌థ జోడించి స్ర్కిప్టు అల్లేశారు. లైవ్‌లో చంప‌డం అనే పాయింట్ కాస్త కొత్త‌గా ఉంటుంది. అయితే ఆ త‌ర‌వాత అంతా రొటీన్ వ్య‌వ‌హార‌మే. విజ‌యేంద్ర ప్ర‌సాద్ పేరు విన‌గానే ఆయ‌న రాసిన రొటీన్ క‌థ కూడా అద్భుతంగా అనిపించిందేమో? మొద‌టి 5 నిమిషాలూ థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. శంక‌ర్ సినిమాల లెవిల్లో ఏదో ప్లాన్ చేశారు అనిపిస్తుంది. క‌థ కాలేజీలోకి ఎప్పుడు అడుగుపెట్టిందో, అప్పుడు చ‌ప్పున చ‌ల్లారిపోతుంది. క‌థానాయిక‌ని ప్రేమ‌లో ప‌డేయ‌డం, కాలేజీలో అల్ల‌రి, సీనియ‌ర్ల‌ను ఏడిపించ‌డం.. వీటిలో ఏ స‌న్నివేశం కొత్త‌గా లేదు. క‌థ‌కు సంబంధించిన‌దీ కాదు. విశ్రాంతి స‌న్నివేశాల వ‌ర‌కూ సినిమాని లాక్కురావ‌డానికి మాత్రం ఉప‌యోగ‌ప‌డింది. కుక్కతో మందు కొట్టించ‌డం, ఆ కుక్కే ఓ మ‌నిషి బొమ్మ‌ని ప్రింటు గుద్దిన‌ట్టు గీసేయ‌డం.. ద‌ర్శ‌కుడి అద్భుత సృజ‌నా శ‌క్తిని నిద‌ర్శ‌నం అనుకోవాలి. జాగ్వార్‌, హీరో ఒక్క‌రే అనేది ముందు సీన్‌లోనే చెప్పేశారు. దాంతో జాగ్వార్ ఎవ‌రు? అనే ఉత్కంఠ‌త ఉండ‌దు. కేవలం వాడి టార్గెట్ ఏమిటి? ఎందుకు చంపుతున్నాడు? అనేది తెలుసుకోవ‌డంపైనే ప్రేక్ష‌కుల దృష్టి ఉంటుంది. ఆ స‌స్పెన్స్ ని చివ‌రి రీలు వ‌ర‌కూ దాచి పెట్టాడు ద‌ర్శ‌కుడు. పోనీ అక్క‌డైనా బ్ర‌హ్మాండం బద్ద‌ల‌వుతుందా అంటే అదీ లేదు.1980 కాలం నాటి ఫ్లాష్ బ్యాక్‌తో విసుగు తెప్పిస్తాడు. ఆ త‌ర‌వాత హీరో శ‌త్రు సంహారం చేసి.. నిజంగానే హీరో అయిపోతాడు. జ‌గ‌ప‌తిబాబుకీ – హీరోకీ మైండ్ గేమ్ న‌డిపితే బాగుండేదేమో అనిపిస్తోంది. హీరో త‌న‌కు ఏం కావాలో, ఏం చేయాలో అన్నీ చేసుకొంటూ పోతాడు. అత‌నికి అడ్డే ఉండ‌దు. అలాంట‌ప్పుడు పోటీలో మ‌జా ఎక్క‌డి నుంచి వ‌స్తుంది? విల‌న్లు సైతం హీరో వేసే వేషాల‌కు బిత్త‌ర‌పోతుంటారు. అంత తెలివైన హీరో చివ‌ర్లో సీక్రెట్ కెమెరాలు అమ‌ర్చి విల‌న్ల నుంచి గుట్టు రాబ‌డ‌తాడు.. ప‌ర‌మ రొటీన్‌గా. వీటి మ‌ధ్య గ్లామ‌ర్ కోసం త‌మ‌న్నాది దించి చేయించిన ఐటెమ్ గీతం.. అత‌క‌కుండా పోయింది. నిఖిల్ ఏమేం చేయ‌గ‌ల‌డు అని చెప్ప‌డానికి తీసిన డెమోగా అయితే.. ఈ జాగ్వార్ ఓకే. అంత‌కు మించి ఈ సినిమా నుంచి అటు నిఖిల్‌, ఇటు ప్రేక్ష‌కులు ఏమీ ఆశించ‌కూడ‌దు.

తెలుగు360.కామ్ రేటింగ్ 1.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close